.
శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ అనేవాడికి ఇదేమీ కొత్త కాదు… అసలు వాడొక్కడే (వాడు అనే పదం ఉద్దేశపూర్వకంగానే వాడుతున్నాను) మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు… ఈమధ్య తాగి నోటికొచ్చినట్టు బలుపు మాటలు మాట్లాడుతున్నాయి సోకాల్డ్ సినిమా అక్కుపక్షులు…
గతంలో ఫిలిమ్ క్రిటిక్స్ క్రిముల దొడ్డి నాకేవాళ్లు అని వాగాడు… పొట్టేల్ సినిమాపై రివ్యూలకు ప్రతిస్పందనగా… క్రిటిక్స్ అసోసియేషన్ వీడి మీద మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు కంప్లయింట్ చేసింది… ఏం జరిగింది, ఏమీ లేదు…
Ads
ఎహె, పోరా … మీరు నన్ను పీకేదేముంది అన్నట్టుగా కిమన్నాస్తిగా ఉన్నాడు… మంచు విష్ణుకు ఏ సోయీ లేదు, తరువాత ఫిలిమ్ క్రిటిక్స్ పట్టించుకున్నదీ లేదు… ఇప్పుడు ఏమంటున్నాడు..,?
మహాత్మాగాంధీని ఉద్దేశించి నానా కూతలూ నోటికొచ్చినట్టు కూశాడు… అవన్నీ నేను రాయలేను, నేను శ్రీకాంత్ భరత్‌లా క్రిముల దొడ్డి బ్యాచ్ కాదు కదా… ఆసక్తి ఉన్నవాళ్లు ఇదుగో ఈ న్యూస్ గ్రూప్ ఫేస్‌బుక్ పోస్ట్ చూడొచ్చు… (వీడి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకులే గానీ… స్వతహాగా పశువైద్యం చదివాడట…)
https://www.facebook.com/reel/1164864662195901
ఐతే వీడొక్కడే కాదు… మొన్నామధ్య రాహుల్ రామకృష్ణ అనేవాడూ పొట్టపలుగ తాగి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నానా కూతలూ కూశాడు, అదేలెండి, రాశాడు… ఒరేయ్, తాటతీస్తాంరా అని ‘ఎవరో’ ఓ దుడ్డుకర్ర చూపేసరికి… రెండు రోజులు సోషల్ మీడియా అకౌంట్లు డియాక్టివేట్ చేసుకుని, తరువాత తాపీగా రిస్టోర్ చేసి, అబ్బే, ఇకపై బుద్ధిగా ఉంటాను అని లెంపలేసుకున్నాడు…
అంతెందుకు..? మన బాలయ్యే నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి సైకో గాడు అన్నాడు… ఇలా సినిమా సెలబ్రిటీలకు విచక్షణ లోపిస్తోందా..? లేక మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే మితిమీరిన ధీమాయా..? ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనేవాడికీ పెద్ద జడ్జిపై చెప్పు విసరబోయిన వాడికీ తేడా ఏముంది..?
ఆమధ్య దిల్ రాజు, శ్రీముఖి తమ తప్పుకూతలకు క్షమాపణలు చెప్పుకున్నట్టు గుర్తు… వాడెవడో సినిమా ఫంక్షన్‌లో మన్మథుడు సినిమా హీరోయిన్ అన్షు అంబానీ సైజుల గురించి కూశాడు… జస్ట్, ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే…
ఈ క్రిమి దొడ్డి శ్రీకాంత్ మీద మంచు విష్ణు ఏమీ చర్య తీసుకోలేడు గానీ… ఎక్కడా ఇప్పటివరకు పోలీసులు కేసు పెట్టినట్టు వార్తలయితే (ఈ కథనం రాసే సమయానికి) కనిపించలేదు… జాతిపితగా కీర్తించబడే వ్యక్తి మీద నానా పిచ్చి కూతలూ కూస్తే… ఎవరో ఎందుకు కంప్లయింట్ చేయడం, పోలీసులే సూమోటో కేసు పెట్టొచ్చు కదా… ఏమైంది మరి..? చిత్రమేమిటంటే, పబ్లిక్ డొమైన్‌లో వీడి కుసంస్కార కూతలకు కూడా నెట్‌లో మద్దతు లభించడం..!!
ఒకడి మీద కొరఢా ఛెళ్లమంటేనే కదా… ఆ కొరఢా భయంతో మిగతావాళ్లు గీత దాటకుండా ఉంటారు..? వీడి మీద హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టి, కాస్త బుద్ది చెప్పాలని ‘ముచ్చట’ కోరిక..!
Share this Article