.
ఇంతకుముందే కదా మనం ‘పిచ్చులతో ఆడుకోకండి’ అని ఓ కథనం చదువుకున్నాం… అంటే, బ్యాటర్లకు అనుకూలించే పిచ్చుల తయారీ, పవర్ ప్లే రూల్స్ గట్రా ఆటలోని మజాను ఎలా చంపేస్తున్నాయో, బౌలర్లను మరీ బాల్స్ విసిరే యంత్రాలుగా ఎలా మార్చాయో చెప్పుకున్నాం కదా… గౌహతి వన్డే మ్యాచులో ఏకంగా 5 సెంచరీలు, 811 రన్స్ రావడం ఆ పిచ్ ఎంత జీవం లేనిదో గుర్తుచేసుకున్నాం కదా…
దీనికి పూర్తి కంట్రాస్టు… ఒక్క బ్యాటింగులో కాదు, క్రికెట్ ఆటకు సంబంధించిన ప్రతి అంశంలోనూ జట్టు మంచి ఆటతీరు చూపిస్తే ఎలా ఉంటుందో… ఆసియా కప్, సెమీ ఫైనల్, టీ20 మ్యాచ్ చూపించింది… ఇది శ్రీలంక, ఇండియా నడుమ జరిగింది…
Ads
సింపుల్‌గా ఆరు డకౌట్లు శ్రీలంక జట్టులో… అంతేకాదు, మూడు రనౌట్లు… ఇండియా పూర్ణాధిపత్యం… మొదట బ్యాటింగు చేసిన ఇండియా 169 రన్స్ చేసింది… శ్రీలంక బౌలర్లూ తక్కువేమీ కాదు… చకచకా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మన వికెట్లు కూల్చేశారు…
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, దూబే, అక్సర్ పటేల్, శ్రేయస్ అయ్యర్… ఫెయిల్… వైభవ్ సూర్యవంశీ బెటర్, ఇషాన్ కిషన్ రెచ్చిపోయి 174 స్ట్రయిక్ రేటుతో 80 పరుగులు చేసి నిలబెట్టాడు ఇండియాను…
నిజానికి ఛేదించలేని టార్గెట్ ఏమీ కాదుగా అది… కానీ బూమ్రా వేసిన మొదటి ఓవర్‌లోనే శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి, ఇక ఆ తరువాత కోలుకోలేదు… చివరకు 10 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేక 45 పరుగులకే చాపచుట్టేసింది… ఇదేమీ బౌలర్లకు అనుకూలంగా తయారైన పిచ్ కాదు, ఇషాన్ కిషన్ పరుగులే తార్కాణం… శ్రీలంకకు టీ20లలో ఇదే అతి తక్కువ స్కోర్… సో, ఇక పాకిస్థాన్‌తో ఫైనల్… మరో మజా మ్యాచ్‌కు రెడీ అయిపొండి….
Share this Article