ఫైరింజన్ సైరన్కన్నా ఎక్కువ డెసిబుల్స్‌తో మోగే గొంతు… మీరు ఏ పేరుతోనైనా పిలుచుకొండి… శ్రీముఖి పేరును బాబా భాస్కర్ భాషలో స్త్రీముఖి అనీ, చంద్రబోస్, కోటి, శైలజ భాషలో చెప్పాలంటే చంద్రముఖి, బహుముఖి… ఆ సైరన్ ఈమధ్యే, అంటే మూడునాలుగు రోజుల క్రితం… జీ తెలుగు టీవీలో వచ్చే ‘సరిగమ సింగింగ్ ఐకన్’ ప్రోగ్రాములో చక్కెర చిన్నోడా అంటూ మెలోడియస్గా, శ్రావ్యంగా పాడుతుంటే ఫ్లోర్ అదిరిపోయింది… తను ట్రెయిన్డ్, ప్రొఫెషనల్ సింగర్ గాకపోయినా పాడటంలో మాధుర్యాన్ని కురిపించింది… మెంటార్లందరినీ ఒక్కచోటకు పిలిచి సూపర్ మచ్చీ అనే ఓ మాస్ సాంగ్ కూడా సింగింది… కానీ…?
Ads
ఈ బైరూపికి… సారీ, ఈ బహుముఖికి అదే టీవీ నుంచి చేదు అనుభవం తప్పేట్టు లేదేమో… కాస్త వివరంగా చెప్పుకోవాలంటే… తను చాలా సీనియర్… మంచి ఎనర్జీ లెవల్స్ ఉంటయ్… స్పాంటేనిటీ కూడా ఉంది… షో ఏదైనా సరే, యాంకరింగు అలవోకగా నీళ్లు తాగినంత వీజీగా కొట్టేయగలదు… కాకపోతే ఒబేసిటీతో దూకుడు తగ్గినట్టుంది… తరువాత బిగ్‌బాస్ షో… లక్కీగా ఫైనలిస్టు… నిజానికి విజేత కావల్సింది… కానీ డబ్బు దాదాపు విజేతతో సమానంగా పొందినట్టుంది… ఇక కాస్త రిలాక్సయి ఇదుగో జీ టీవీలో అదిరింది షోలో చేరింది… అయితే..?
ఈ అదిరింది షో ఒక ఫ్లాప్ షో… ఒక్క చమ్మక్ చంద్ర స్కిట్లు తప్ప అందులో రక్తికట్టే స్కిట్లే ఉండటం లేదు… పైగా అదేదో నాగబాబు సొంత టీవీ అయినట్టు స్కిట్లలో తన భజన, బిస్కెట్లు సరేసరి… రేటింగ్స్ ఢమాల్… పెద్ద మనిమంతుడు పనిముట్టును తప్పుపట్టినట్టు యాంకర్ సమీర వైఫల్యంగా ముద్రవేసి, అగ్రిమెంట్లను పక్కనపెట్టేసి, చెప్పాపెట్టకుండా ఆమెను తీసిపారేశారు… ఫాఫం, స్కిట్లలో దమ్ములేకపోతే యాంకర్ ఏం చేయగలదు… ఎంతసేపు పళ్లికిలించి నవ్వగలదు..?
మల్లెమాల సంస్థ అయితే అగ్రిమెంట్ దాటి ఏ ఆర్టిస్టు బయటికి పోయినా పది లక్షలు ఉల్టా కట్టాలి… అదే మల్లెమాల పీకిపారేస్తే ఎవరూ నోరిప్పడానికి లేదు… మరి ఈ జీటీవీలో ఎలా ఉందో తెలియదు గానీ… సమీరను అర్ధంతరంగానే పీకేశారు… భానుశ్రీ, రవి, నవదీపులూ అర్థంతరంగానే నిష్క్రమించారు… ఏముంది..? నాగబాబు వద్దు అంటే ఇక వద్దు… ఫ్లోర్‌లోకి ఎంట్రీ కూడా ఉండదు… డబ్బులిచ్చేవాడు ఏది చెబితే అదే అగ్రిమెంట్… ఇదో కొత్తయుగం వెట్టిచాకిరీ…
సమీరను వెళ్లగొట్టి భానుశ్రీని, రవిని తీసుకొచ్చినా సరే… సరుకు సేమ్… ప్యాకేజీ సేమ్… వాళ్లయినా ఏం అమ్మగలరు..? అగెయిన్ ఫ్లాప్… ఈసారి ఆ ఇద్దరినే కాదు, జడ్జి నవదీప్‌ను కూడా తీసిపారేశారు… జడ్జిగా జానీ మాస్టర్ వచ్చాడు… యాంకర్‌గా శ్రీముఖి… తోడుగా డాన్సర్ పండు… (జూనియర్ సుడిగాలి సుధీర్)… బొమ్మ అదిరింది అని పేరు మార్చారు… కానీ అదే సరుకు కదా… పైగా ఇంకా ప్రతివారం నాసిరకంగా మారుతోంది… ఎలాగంటే..?
మొదట టీం లీడర్ హరి, పొట్టి రియాజ్‌తో సీఎం జగన్‌ను వెక్కిరించే ఓ ఇమిటేషన్ ప్రోగ్రాం చేశారు… నాగబాబు ఇలాంటివి ఎంజాయ్ చేస్తాడు కదా… ఆ షో చూసిన జగన్ ఫ్యాన్స్ ఆ ఆర్టిస్టులకు చుక్కలు చూపించారు… నాగబాబు ఎంత కెలికే ప్రయత్నం చేసినా సరే, సదరు ఆర్టిస్టులు గౌరవంగా తమను క్షమించాలని అప్పీల్ చేసుకున్నారు… తరువాత కూడా నాగబాబు ఇదే రియాజ్, సద్దాం ద్వారా ఇంకా కెలకాలని ట్రై చేశాడు… ఆ వివాదం తరువాత ఈ షో నాణ్యత, రేంజ్, టేస్ట్ అన్నీ దెబ్బతిన్నయ్… దాని ఫలితం ఏమిటో తెలుసా..?
టీఆర్పీల్లో దారుణమైన పతనం… మొన్నటి 8వ తేదీ, ఆదివారం రాత్రి షోకు వచ్చిన రేటింగ్స్ కేవలం 2.26… మీరు చదివింది నిజమే… హైదరాబాద్ మార్క్ కేటగిరీలో జస్ట్, 2.26 రేటింగ్స్ మాత్రమే… అది చాలా చాలా దిగువ స్థాయి రేటింగ్స్… ఆరోజు రఘు మాస్టర్, సింగర్ ప్రణవి కూడా ఆ షోకు వచ్చినట్టున్నారు… ఐనాసరే, షో సాధించిన ఫలితం అదీ… ఇప్పుడు అందరిలో ఆసక్తి ఏమిటంటే..? రేటింగ్స్ ఢమాల్ అన్నప్పుడల్లా యాంకర్లకు మూడుతుంది కదా… సమీర, భానుశ్రీ బాటలో శ్రీముఖిపైనా వేటుపడుతుందా..? ఒకవేళ వేటుపడితే… ఆమెకు ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ చాన్సెస్ కూడా ఏమీలేవు…!!
Share this Article