Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?

June 17, 2026 by M S R

.

Psy Vishesh …. I Stand with Srinidhi Viplava Sri
సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అణగారిన వర్గాల, దళిత-బహుజనుల గొంతుకను బలంగా వినిపిస్తున్న మహిళా జర్నలిస్టు శ్రీనిధి విప్లవ శ్రీ.
ఆమెను సైద్ధాంతికంగా ఎదుర్కొనే సత్తా లేక, వస్త్రధారణను మారుస్తూ అత్యంత హేయమైన మార్ఫింగ్ ఫోటోలతో ట్రోలింగ్‌కు దిగడం వికృత మానసిక స్థితికి అద్దం పడుతోంది.
ఒక సైకాలజిస్ట్‌గా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ డిజిటల్ దాడి వెనుక దాగున్న సైకో-సోషల్ కోణాలు పంచుకుంటున్నా.

1️⃣ Casteist & Gender Bias
ఒక అణగారిన వర్గానికి చెందిన మహిళ మైక్ పట్టి వ్యవస్థను ప్రశ్నిస్తుంటే, శతాబ్దాలుగా సాగుతున్న పితృస్వామ్య, అగ్రవర్ణ అహంకారానికి అది జీర్ణం కావడం లేదు. ఆమె మేధస్సును, ప్రశ్నలను కౌంటర్ చేయలేక ‘మార్ఫింగ్’ అనే చౌకబారు అస్త్రాన్ని ప్రయోగించారు. ఇది ప్రశ్నించే ప్రతి మహిళా జర్నలిస్టును భయపెట్టాలనే వ్యవస్థీకృత కుట్ర.

Ads

2️⃣ Se- Ual Objectification
బహుజన మహిళలు ఐడెంటిటీని సంపాదించుకుని సమాజంలో ఒక స్పేస్‌ను క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, వారిని మానసికంగా దెబ్బతీయడానికి వాడే పాత ఆయుధం character assassination. ఒక జర్నలిస్టు వస్త్రధారణను మార్ఫింగ్ చేయడం ద్వారా, సమాజం ఆమె చెప్పే ‘విషయాన్ని’ కాకుండా కేవలం ఆమె ‘శరీరాన్ని’ మాత్రమే చూసేలా డైవర్ట్ చేయాలనేది ఈ ట్రోలర్ల వ్యూహం.

3️⃣ Fear of Alternative Media
కార్పొరేట్ మీడియా అట్టడుగు వర్గాల బాధలను పట్టించుకోనప్పుడు, శ్రీనిధి లాంటి స్వతంత్ర జర్నలిస్టులు సమాంతర డిజిటల్ విప్లవాన్ని నడుపుతున్నారు. ఈ గ్రౌండ్ రియాలిటీ పవర్ చూసి భయపడే, ఫేక్ ఐడీల వెనుక దాక్కుని ఇలాంటి అసభ్యకర పోస్టులతో ఆమెను మానసికంగా కుంగదీసి, ఛానెల్ మూయించాలనే పిరికి ప్రయత్నాలు చేస్తున్నారు.

4️⃣ Online Disinhibition & Sadism
తాము ఎవరో ప్రపంచానికి తెలియదు అనే Anonymity చాటున దాక్కుని, ట్రోలర్లు తమలోని అసభ్యకరమైన ఆలోచనలను మార్ఫింగ్ రూపంలో బయటపెడుతున్నారు. ఒక మహిళను బహిరంగంగా అవమానించడం ద్వారా, ఆమె మానసిక వేదనను చూసి వీరు వికృతానందం పొందుతున్నారు.

శ్రీనిధికి సపోర్ట్ చేయడం అంటే ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం కాదు… ఆన్‌లైన్ వేదికలపై మహిళలకు జరిగే అవమానాలకు వ్యతిరేకంగా, స్వతంత్ర జర్నలిజం రక్షణ కోసం నిలబడటం.
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions