Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మగడు లేని వేళ తుమ్మెదా, వచ్చి మొహమాట పెడతాడె తుమ్మెదా

October 28, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. వెంకటేష్ కెరీర్ మొదట్లో సక్సెస్ అవటానికి , ఇప్పటికీ తెర మీద తళుక్కుమంటూ ఉంటానికి దోహదం చేసిన సూపర్ హిట్ సినిమా 1987లో వచ్చిన ఈ శ్రీనివాస కళ్యాణం .

ఈ విజయానికి చాలామంది తమ వంతు పాత్ర వహించారు . అసలు జుట్టంటూ ఉంటే ఏ కొప్పయినా పెట్టొచ్చు . ముందు చిక్కని కధ ఉంటే దానికి సరిపడా స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , నటీనటుల నటన , వగైరా తోడవుతాయి .

Ads

సీతాకోకచిలుక , గోరింటాకు వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అనుభవం ఉన్న మురారి , మసాలా దర్శకుడు కోడి రామకృష్ణ , రచయిత సత్యమూర్తిలు బిర్రయిన , చిక్కనయిన స్క్రీన్ ప్లేని సిధ్ధం చేసుకున్నారు . ప్లానింగ్ బాగా ఉంటే సగం సక్సెస్ వచ్చేసినట్లే .

తండ్రి రామానాయుడు నిర్మాతగా ఎంత జాగ్రత్తపరుడో వెంకటేష్ హీరోగా అంతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే నటుడు . అతని మైనస్ పాయింట్లు అతనికి తెలుసు . తదనుగుణంగా హీరోయిన్లు , దర్శకులు , సపోర్టింగ్ హీరోలను ఎంపిక చేసుకుంటాడు .

మైనస్ పాయింట్లను అధిగమించి బాగా నటించాడు ఈ సినిమాలో . ఈజీ గోయింగ్ వ్యక్తిగా , బాధ్యత కల వ్యక్తిగా , డాన్సరుగా చాలా బాగా నటించాడు . 1+2 సినిమా . భానుప్రియ , గౌతమి హీరోయిన్లు . భానుప్రియ గ్లామరుతో పాటు చక్కటి నటనను , నృత్యాలను కూడా ప్రదర్శించింది .

గలగలగలా పారే సెలయేరు లాగా , బావ కోసం చంపేందుకు అయినా చచ్చేందుకు అయినా ఎప్పుడూ సిధ్ధంగా ఉండే మరదలుగా , నిశ్శబ్ద ప్రేమికురాలిగా గౌతమి బాగా నటించింది . క్లైమాక్సులో ఆమె , గొల్లపూడి మారుతీరావు ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుంటారు . వారిద్దరి పాత్రల్ని అలా మలిచారు .

తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మోహన్ బాబు పాత్ర , నటన గురించి…. పాత్ర , నటన బాగుంటాయి . డైలాగ్ డెలివరీనే ప్రత్యేకంగా పెట్టి ప్రేక్షకుల సహనాన్ని కాస్త పరీక్షిస్తారు . Of course . మోహన్ బాబు అభిమానులకు నచ్చుతుందనుకోండి .

ఇతర ప్రధాన పాత్రల్లో సుత్తి వేలు , వంకాయల , ప్రసాద్ బాబు , అనిత కల్పనారాయ్ , వై విజయ , వరలక్ష్మి , శుభలేఖ సుధాకర్ , కాకరాల , ప్రభృతులు నటించారు . వై విజయ సినిమా పిచ్చిదిగా నటిస్తుంది . సినిమాలో చిత్రం ఏమిటంటే తండ్రి అయిన సుత్తి వేలును కూతురు అయిన గౌతమి గుర్తించకపోవటం .

విశ్వాసపాత్రుడయిన పాలేరు ఆసామి ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను కోల్పోతాడు . ఆ షాకుతో భార్య కూడా చనిపోతుంది . బిడ్డల సంరక్షణ పేరుతో యజమాని దగ్గర నుండి వేలు డబ్బులు గుంజుతూనే ఉంటాడు . ఆ బిడ్డల్ని రక్షించే క్రమంలో వాళ్ళను కొనుక్కున్న అతనిని చంపేసి బోస్టన్ స్కూలుకు వెళ్ళిపోతుంది గౌతమి .

రిలీజయి బయటకొచ్చి తెలియకుండానే బావ దగ్గరకు చేరుతుంది . కానీ అప్పటికే భానుప్రియతో ప్రేమలో పడతాడు హీరో . క్లైమాక్సులో ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయటం , హీరో విలన్ని చితకబాదటంతో శుభం కార్డు పడుతుంది . గౌతమి లూప్ లైన్లోకి వెళ్ళిపోతుంది .

ఈ సినిమాలో విశేషంగా చెప్పుకోవలసింది కె వి మహదేవన్ సంగీతమే . టైటిల్స్ దగ్గర నుండి చివరిదాకా పాటలకు , బేక్ గ్రౌండుకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు . తొలి పొద్దులో హిందోళం మలి పొద్దులో భూపాలం , కదలిక కవళిక , ఎందాకా ఎగిరేవమ్మా గోరింకా డ్యూయెట్లు చాలా బాగుంటాయి .

తుమ్మెదా ఓ తుమ్మెదా ఇంత తుంటరోడా గోవిందుడు అనే ఉట్టి పాట , అనుకోనీ అనుకోనీ అంటూ సాగే క్లైమాక్స్ పాట చిత్రీతరణ బాగుంటాయి . మోహన్ బాబు శ్రీలక్ష్మి , మమత , బబితలతో కలిసి వేసే వాత్స్యాయనా అనుభవ సారాన్ని వివరించనా బాగా హాటుగా ఉంటుంది . పాటల్ని వేటూరి , సిరివెన్నెల శాస్త్రి , జొన్నవిత్తుల వ్రాసారు . బాగా వ్రాసారు .

It’s a musical , emotional , feel good , commercial entertainer . సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వామ్మో, ఇదేం జర్నలిజం… అసలు ఎవుర్రా మీరంతా…
  • మగడు లేని వేళ తుమ్మెదా, వచ్చి మొహమాట పెడతాడె తుమ్మెదా
  • 6-5=2 … కన్నడంలో ఓ ప్రయోగం… కొత్త తరహా టెక్నిక్, కొత్త జానర్..!
  • భస్మాసుర బంగ్లాదేశ్..! మన ఈశాన్యాన్ని తనలో కలిపేసుకుంటుందట..!!
  • ఆదానీ ఆస్తులకు మోడీ మార్క్ బీమా..!? ఇదుగో అసలు ముఖచిత్రం..!!
  • బెల్టు షాపులో మద్యం తాగినట్టుగా… సాక్షి దిక్కుమాలిన కవరేజీ..!!
  • పవర్‌లో ఉంటే ప్రతిదీ క్విడ్ ప్రోకో… పవర్ ఊడిపోతే అందరూ క్విట్ పార్టీ…
  • చదరంగం కాదు, రణరంగం కాదు… ఇదొక దారుణరంగం…
  • మదనగోపాలుడు… సకల కళావల్లభుడిని దారికి తెచ్చుకున్న ఓ పడవ పిల్ల..!
  • ఆ పాకిస్థానీ ప్రేమికుడికన్నా… మన ఇడ్లీ సాంబార్ నెత్తురే చాలా నయం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions