.
Subramanyam Dogiparthi
……….. మల్లాది వారు పెద్దలకు మాత్రమే అనే టైటిల్ని తన నవలకు కరెక్టుగానే పెట్టుకున్నారు . ఇది A సర్టిఫికెట్ నవలే . నాన్ వెజిటేరియన్ కధాంశం . దాని ఆధారంగానే జంధ్యాల తన హాస్య రసాన్ని జోడించి వెజిటేరియన్ సినిమాను చేసి U సర్టిఫికెట్ పొందారు .
- బూతుకూ హాస్యానికీ నడుమ… అశ్లీలానికీ ఆహ్లాదానికీ నడుమ గీతను జంధ్యాల గౌరవించారు .
ప్రేక్షకులు కూడా కామెడీగానే తీసుకున్నారు . ఇలా విశృంఖల సరసాన్ని , వినూత్న ఆలోచనలను జనాల్లోకి వదలొచ్చా వంటి సదస్సులను జనం పెట్టలేదు . సోషల్ మీడియా , టివి చర్చలు ఇంతగా లేకపోవడం వలన బతికిపోయారు . అప్పట్లో మనోభావాలు కూడా ఇంత విచ్చలవిడిగా దెబ్బ తింటూ ఉండేవి కాదు .
డిఫరెంట్ 1+ 2 సినిమా . నరేష్ మద్రాసులో ఓ ఆఫీసులో మేనేజర్ . ప్రవరాఖ్యుడు . ఆఫీసులో లేడీస్ అందరూ దధ్ధోజనం , వడపప్పు , చలిపిండి , పేరిన్నెయ్యి వంటి నిక్ నేమ్సుతో అల్లరి చేస్తుంటారు . అతని స్టెనో మనోచిత్రకు (పాత్ర పేరు మార్గరెట్) కూడా అతని మీద మోజు , ఇష్టం , ప్రేమ , వగైరాలు పుష్కలం . హీరో గారు ఆమెను కూడా దూరం పెడుతుంటాడు .
Ads
ఇంతలో శ్రీవారికి పెళ్లి అయిపోతుంది . ఆమె చాలా ఎగ్రెసివ్ , అల్లరిపిల్ల . ఫస్ట్ నైట్ వాయిదా పడుతుంది . హీరో గారికి చచ్చేంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ , సైకలాజికల్ భయం . అందుకని మార్గరెట్టుని శిక్షణ ఇవ్వమంటాడు . ఆమె కూడా సంతోషంగా అంగీకరిస్తుంది .
సినిమాకు ఆయువుపట్టు ఈ శిక్షణ ప్రహసనమే . ఆరు రోజులు ఆరు రకాల అవాంతరాలు రావటం , శిక్షణా తరగతులు జరగక పోవటం , శారీరకంగా తప్పు చేయకుండా బయటపడతారు . ఆఖరి రోజు శ్రీవారికి తప్పు చేయకూడదు అని అనిపించి తరగతి గది లోనుంచి వెళ్ళిపోతాడు .
ఈ మొత్తం ప్రహసనంలో అతనికి ధైర్యం వచ్చి, శోభనం ముగియటంతో సినిమా అయిపోతుంది . సినిమాలో కనక వాళ్ళిద్దరు తప్పు చేసి ఉంటే జంధ్యాలకు చెడ్డ పేరు వచ్చేదేమో ! జరగక పోవటం వలన , జరిపించక పోవడం వలన కామెడీగా స్వీకరించి జనం చూసేసారు .
జంధ్యాల నాటికల్లో , సినిమా కధల్లో హాస్య పాత్రలకు ఒక్కో పిచ్చ పెడతాడు . రాధాకుమారికి మొక్కల పిచ్చి . సుత్తి వీరభద్రరావు తస్కరుడు . ఇతరుల వస్తువులను కొట్టేసే బలహీనత , చివరకు బ్లాక్ మెయిలర్ కూడా అవుతాడు . పుచ్చా పూర్ణానందంకు ఆడవాళ్ళ పిచ్చి . వృధా సరసుడు . సాక్షి రంగారావుకు స్వీట్ల యావ . ఇలా .
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది మూడు పాత్రలు . ఒకటి నరేషుది . బాగా నటించాడు . రెండో పాత్ర మనో చరిత్ర . ప్రముఖ తమిళ నటుడు టి యస్ బాలయ్య కుమార్తె . చాలా బాగా , అందంగా నటించింది . ఇదే మొదటి తెలుగు సినిమా అనుకుంటా . ఇది కాకుండా మావారి గోల , కిరాయి మొగుడు వంటి మూడు నాలుగు సినిమాలలో మాత్రమే నటించింది . ఎందుకనో మన తెలుగులో కొనసాగలేదు . గ్లామరస్ హీరోయిన్ మిస్సయింది తెలుగుకు .
ఇతర ప్రధాన పాత్రల్లో లక్ష్మీకాంత్ , రాధాకుమారి , సాక్షి రంగారావు , సుత్తి జంట , శ్రీలక్ష్మి , రావి కొండలరావు , హేమ సుందర్ , డబ్బింగ్ జానకి , రాళ్ళపల్లి , భీమరాజు , హరిబాబు , గంగారత్నం , పుచ్చా పూర్ణానందం , ప్రభృతులు నటించారు .
రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అంటూ సాగే పాట సంగీతపరంగానే కాకుండా చిత్రీకరణ చాలా బాగుంటుంది .
బామ్మ గంగారత్నం , మనమరాలు అనితారెడ్డిల మధ్య సున్నితమైన సరసం గొప్పగా ఉంటుంది . తర్వాత నరేష్ , అనితారెడ్డిల డ్యూయెట్ చంద్రకాంతిలో చందన శిల్పం స్వర శృతి లయలా మణిహారం పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది .
టైటిల్ సాంగ్ , ఐకానిక్ సాంగ్ శ్రీవారీ శోభనం వినాయకుడీ కళ్యాణం అల్లరి అల్లరిగా ఉంటుంది . సినిమాలో కాకినాడ మంజులా ఆర్ట్ అకాడమీ వారి డాన్సులు , ఓ స్కిట్ , వగైరా బాగుంటాయి . ఇప్పటికీ ఈ అకాడమీ పనిచేస్తుందో లేదో … రాంబాబు , లక్ష్మి అనే కళాకారులు యన్టీఆర్ పాటని ఇమిటేట్ చేస్తూ బాగా అలరిస్తారు .
చాలామంది మగవారిలో ఉండే ఈ సున్నితమైన సైకలాజికల్ కాంప్లెక్సుని కధాంశంగా తీసుకుని సినిమా తీయటం కాస్త సాహసమే . అయితే ఆ అంశాన్ని హాస్యరసం చుట్టుముట్టేసి , అది మరీ హైలైట్ కాకుండా కాపాడేస్తుంది . 1985 మార్చిలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది .
An excellent , feel good , entertaining movie . చూసి ఉన్నా మళ్ళా టైం ఉన్నప్పుడు చూడొచ్చు . సరదాగా సాగుతుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు ….
Share this Article