ఈమధ్య వరుసగా రాజమౌళి వార్తలు కనిపిస్తున్నాయి… అవన్నీ క్రోడీకరిస్తే రాబోయే 20 సంవత్సరాల వరకూ అసలు రాజమౌళి మరే కొత్త హీరోకు టైమ్ ఇవ్వడం గానీ, ఇంకో కొత్త సినిమా అంగీకరించడం గానీ ఉండబోవేమో… సరదాగా చెప్పుకున్నా సరే, రాజమౌళి దొరకడం అంత సులభం కాదు…
పాత సినిమాల్ని కాపీ కొడతాడా..? చరిత్రకు వక్రబాష్యాలు చెబుతాడా..? అనే ప్రశ్నలు వేరు… వాటిని కాసేపు పక్కన పెడితే రాజమౌళిది తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర… తాను చెప్పాలనుకున్న కథను ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ చేస్తాడు, ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేస్తాడు, అంతకుమించి దాన్ని కొత్త కొత్త హైట్స్‌కు మార్కెటింగ్ చేసుకుని, అనూహ్యమైన లాభాల్ని గడిస్తాడు…
ఎందుకంటే… సినిమా లాభాల్లో తనకూ వాటా ప్లస్ తన ఫ్యామిలీ ప్యాకేజీ రెమ్యునరేషన్స్… అన్నింటికీ మించి ఆస్కార్ చుట్టూ ఉన్న భ్రమల్ని బ్రేక్ చేసి, సరైన లాబీయింగ్ ఉంటే ఆస్కార్ అవార్డు పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు తను… లేకపోతే నాటు నాటు వంటి పరమ నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఏమిటి..?
Ads
సరే, కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి అలియాస్ రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రస్తుతం చేస్తున్న సినిమా మహేశ్ బాబు సినిమా… ఈజీగా రెండుమూడేళ్లు దానిపైనే కాన్సంట్రేట్ చేస్తాడు… పాన్ ఇండియా ఎలాగూ ఉంటుంది, మహేశ్ బాబు ఇంతవరకూ రుచి చూడని పాన్ ఇండియా టేస్టు మాత్రమే కాదు… గత తన సినిమాల అంతర్జాతీయ మార్కెటింగ్ రుచి తెలిసిన రాజమౌళి దాన్ని భిన్న భాషల్లో, భిన్న దేశాల్లో రిలీజ్ చేస్తాడు…
సరే, ఆ మల్టీ లింగువల్, మల్టీ నేషనల్ రిలీజుల వెనుక ఉండే ఆర్థిక మర్మాలేమిటో, మాయలేమిటో తెలియదు గానీ… సినిమాకన్నా దాన్ని ఎలా అమ్ముకోవాలో ఎక్కువ ఆలోచిస్తాడు రాజమౌళి ఇప్పటి నుంచే…! ఇవి గాకుండా బాహుబలి-3 తీస్తాడట… దాంతోపాటు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందట… అంటే మరో నాలుగైదేళ్లు మటాష్.,.
ఈలోపు తన లైఫ్ డ్రీమ్ మహాభారతం పట్టాలెక్కుతుంది… అది అయిదు భాగాలు అట… రాజమౌళి బాపతు పర్‌ఫెక్షన్, ప్రజెంటేషన్ పరిగణనలోకి తీసుకుంటే అయిదు భాగాలు అవసరమే… ఆ కథ మీదే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ కూర్చుని ఉంటాడు… (ఆయనకు మోడీ రాజ్యసభ సభ్యత్వం ఎందుకొచ్చాడో ఎవరికీ అర్థం కాని మిస్టరీ… ఈ హీట్ ఎన్నికల్లో ఎక్కడా ఆయన తెర మీద కనిపించలేదు ఫాఫం…)
సో, మహాభారతానికి ఏడెనిమిదేళ్లు కనీసం తప్పదు… ఈలోపు తన మరో లైఫ్ డ్రీమ్ వెల్లడించాడు… ఓ హాలీవుడ్ రేంజ్ యానిమేషన్ లెవల్ సినిమా తీయడం మరో కల ఆయనకు… ఈమధ్య బాహుబలి బాపతు ఏదో యానిమేటెడ్ ఫిలిమ్ వివరాలు చెబుతూ తన కల గురించి చెప్పినట్టున్నాడు… బహుశా ఈగ తీసినప్పుడు ఈ సంకల్పం పుట్టినట్టుంది…
ఏతావాతా ఈ సినిమాలన్నీ అయిపోయేవరకు డెబ్బయ్ ఏళ్ల వరకూ వచ్చేస్తాడు తను… తన మెంటాలిటీ ప్రకారం హడావుడిగా రీళ్లు చుట్టేయడం ఉండదు కాబట్టి, అన్నీ లేట్ ప్రాజెక్టులే కాబట్టి… ఇప్పుడు వినిపిస్తున్న తన ప్రాజెక్టులు మరే కొత్త ప్రాజెక్టూ ఇక తన వల్ల కాదు, ఇక ఎవరికీ దొరకడు… అది క్లియర్..!!
Share this Article