ఓ నాస్తికుడు… దేవుడిని నమ్మనివాడు… పైగా హిందూ మతద్వేషి… ఆ డీఎంకే బాస్, ఆ డీఎంకే ప్రభుత్వ ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చాడు కదా… ఇంకేముంది..? గుళ్లకు, హిందూ ఉత్సవాలకు ఇబ్బందులే అనే అపోహ కొంత ఏర్పడింది… అపోహ అనే పదమే కరెక్టు… ఎందుకంటే..? స్టాలిన్ సీఎం అయ్యాక ఈరోజు వరకూ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ మెచ్యూరిటీ కనిపిస్తోంది… ప్రత్యర్థి పార్టీలపై కక్షసాధింపులు గానీ, పాత పథకాల రద్దు గానీ, విచక్షణారహితంగా కొత్త పథకాల ప్రకటనలు గానీ ఏమీ లేవు… కరోనా నియంత్రణ మీదే కాన్సంట్రేట్ చేశాడు తను… అమ్మ క్యాంటీన్ల కొనసాగింపు గురించి మనం చెప్పుకున్నదే కదా… ఒక కార్పొరేట్ కంపెనీని ప్రజావసరం కోసం ఎలా వాడుకోవాలో చేసి చూపించాడు తాజాగా… మేఘా ఇంజినీరింగ్ కంపెనీ తెలుసు కదా… రెండు తెలుగు రాష్ట్రాలనూ అంబానీ టైపులో శాసించగల కంపెనీ… అఫ్ కోర్స్, దేశంలో పలుచోట్ల, విదేశాల్లో కూడా చాలా రంగాల్లోకి విస్తరించారు… ఎక్కడికో వెళ్లిపోయారు ఓనర్లు… దేశధనిక జాబితాల్లో ప్రముఖంగా కనిపించే రేంజ్‌కు…వాళ్లతో తమిళనాడులో 3 వేల పడకల హాస్పిటళ్లను అప్పటికప్పుడు నిర్మింపజేసుకున్నాడు స్టాలిన్… ఒకేచోట కాదు, అనేకచోట్ల..! ఏం చేస్తున్నా సరే, తమిళనాడులో సెకండ్ వేవ్ కేసుల సంఖ్య ఆశించినంత తగ్గడం లేదు… సరే, గుళ్లు, నాస్తికత్వం విషయానికి వస్తే… తమపై ఉన్న అపోహలను పటాపంచలు చేసేలా తాజాగా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది స్టాలిన్ ప్రభుత్వం… గుళ్లల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు 4 వేల చొప్పున నగదు, 10 కిలోల బియ్యం, 15 రకాల కిరాణ సామగ్రిని ఉచితంగా అందచేస్తున్నట్టు దేవాదాయ మంత్రి పీకే శేఖర్ బాబు ప్రకటించాడు…
స్థూలంగా చూస్తే చాలా చిన్న సాయంగా కనిపించవచ్చుగాక… కానీ అర్చకులు, మతవిశ్వాసులు వంటి వివక్ష లేకుండా… మనం, మన ప్రజలు అనే ధోరణితో… ఎవరికి ప్రభుత్వ సాయం అవసరం అనే ఏకైక కోణంలోనే నిర్ణయాలు తీసుకోవడం అనేది అభినందనీయం… ఆస్తిక- నాస్తిక తేడా చూపించకపోవడం..! (నిజానికి డీఎంకే హిందూ ద్వేషం, నాస్తికత్వం ఇంతకుముందున్న స్థాయిలో లేవిప్పుడు…)… రాష్ట్రంలో 36 వేల గుళ్లున్నాయి… అందులో 34 వేల గుళ్ల ఆదాయం పది వేలు కూడా ఉండదు, అదీ సంవత్సరానికి..! వీటిల్లో పనిచేసే ఉద్యోగులకు, అర్చకులకు, ఇతర వర్కర్లకు స్టడీగా రెవిన్యూ ఏమీ ఉండదు… అంతా భక్తుల దయ, వీళ్ల ప్రాప్తం… ఇప్పుడేమో లాక్ డౌన్లు, కరోనా భయాలతో జనం గుళ్లకు పోవడం లేదు, ప్రభుత్వమే వద్దంటోంది… దీంతో ఆ అరకొర ఆదాయం కూడా ఆవిరైపోయింది… ఇదీ సమస్య… అందుకే వెంటనే అలాంటి గుళ్లను గుర్తించి 4 వేల నగదు, బియ్యం, కిరాణ సామగ్రిని అందించాలని స్టాలిన్ ఆదేశించాడు… ముందు కడుపులు నిండాలి కదా… జూన్ 3… అంటే ఎల్లుండి స్టాలిన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి… ఆ రోజు నుంచే ఈ సాయం పంపిణీ స్టార్ట్ చేస్తున్నారు… 2020 ఏప్రిల్‌లో ఫస్ట్ వేవ్ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కూడా గుళ్లలో వర్కర్లు, పూజారులకు వేయి రూపాయల చొప్పున సాయం చేసింది… ఇప్పటివరకైతే స్టాలిన్ నిర్ణయాలు బాగుంటున్నయ్… కొనసాగాలనే కోరుకుందాం…!!
Ads
Share this Article