ఫాఫం… 78 ఏళ్ల వయస్సులో దర్శకేంద్ర, దర్శకాగ్రణి, దర్శకాగ్రేసర, దర్శకశిఖర… రాఘవేంద్రరావు అట్టర్ ఫ్లాప్ ముద్రను మూటగట్టుకున్నాడు… తను మరిచిపోయింది ఏమిటంటే… అవతార్ వంటి అద్భుత హిట్ అందించిన జేమ్స్ కామెరూన్ కూడా ఒక టీవీ సీరియల్ తీయలేడు… అంతెందుకు మన రాజమౌళినే ఓ హిట్ సీరియల్ తీయమనండి… సాధ్యం కాదు… టీవీ సీరియళ్లంటేనే పరమ చెత్తా… ఎపిసోడ్ చూస్తుంటేనే ఎవడ్రా ఈ దర్శకుడు, వీడిని బొందపెట్ట అని తిట్టాలనిపించేలా ఉండాలి… పాత్రల కేరక్టరైజేషన్, చిత్రీకరణ, కథనం, కథ, సాగదీత… అదో కళ… క్రియేటివిటీ, కామన్ సెన్స్, లాజిక్, మన్నూమశానం అనేవేమీ ఉండొద్దు… ఈ బేసిక్ సూత్రం తెలియక అంత పెద్ద రాఘవేంద్రుడు కూడా ఈ జీవనసంధ్యలో ఫ్లాప్ ముద్ర వేయించుకున్నాడు ఫాఫం… అదేనండీ, జీతెలుగులో కృష్ణ తులసి అనే సీరియల్ ప్రజెంట్ చేస్తున్నాడు కదా… అది రేటింగ్స్‌లో మొదట్లోనే కుప్పకూలిపోయింది… మరీ ఘోరంగా హైదరాబాద్ బార్క్ రేటింగుల్లో 2.94 నుంచి 3.74 మధ్య కొట్టుకుంటోంది… మరీ అది మనిసిచ్చిచూడు, సావిత్రమ్మ గారి అబ్బాయి, కేరాఫ్ అనసూయ వంటి సూపర్ చెత్తా సీరియళ్లతో ఈక్వల్ అయిపోయింది…
ఈ వయస్సులో నీకిది అవసరమా..? పైగా ఇప్పుడు తనికెళ్ల భరణిని పట్టుకుని ముగ్గురో నలుగురో హీరోయిన్లను పెట్టుకుని ఓ సినిమాలో నటిస్తాడట… ఈ కృష్ణతులసి విషయానికే వద్దాం… ఆ కథకే తలాతోకా లేదు… అసలు ఓ గాయని గొంతు ఇంకెవరికో అరువివ్వడం అనేది వదిలేస్తే… అందులోని ఆడపాత్రల ధోరణి, డైలాగులు, వేషాలు చూస్తుంటేనే అసయ్యంగా ఉన్నయ్… కనీసం అవి హీరోయిన్ పట్ల సానుభూతి పెంచుతాయి అంటే అదీ లేదు… మొదటి వారమే దీని పరిస్థితి ఇదీ అంటే ఇక చూడాలి, దాని భవిష్యత్తేమిటో… మాటీవీని సీరియళ్లలో కొట్టేయాలని జీవాడు నానా కష్టాలూ పడుతున్నాడు… కానీ వర్కవుట్ కావడం లేదు… కారణం :: తమ సీరియళ్ల స్క్రిప్టుల మీద, వాటి కథాకథనాల మీద వాళ్లకే పట్టు లేదు… రివ్యూ లేదు… ఉదాహరణకు…
Ads
జీవాడి పాపులర్ సీరియళ్లు త్రినయని, ప్రేమ ఎంత మధురం… మొన్న ఓరోజు ఓ సీన్… అదేనండీ… సతీ త్రినయని… 11 మంది ఉన్నారు సీన్లో… అందరూ ఫుల్ మేకప్పులో… నగలతో… వరుసగా గ్రూప్ ఫోటోకు నిలబడ్డట్టు నిలబడ్డారు… ఒక డైలాగ్… వెంటనే 11 మందికీ విడివిడిగా ఫ్రీజ్ షాట్లు… థూమీబచె… ఏం చెత్త నింపుతున్నారురా బాబూ ప్రేక్షకుల మెదళ్లలో… అది జీవాడి సీరియళ్లలో టాప్… నిజానికి కథ ఎలా తగలడ్డా సరే గానీ… దర్శకత్వపు మెళకువలతో నెట్టుకురావచ్చు… కానీ సీరియల్ మొత్తమూ అడుగడుగునా ఇలాంటి లోపాలే… సేమ్, ప్రేమ ఎంత మధురం… వాస్తవానికి మొత్తం టీవీ సీరియళ్లలో నంబర్ వన్ కావాల్సిన స్టోరీ… యాక్టర్స్ ఇరగదీస్తున్నారు… ఏక్‌సేఏక్… కానీ దర్శకత్వ లోపాలతో దాన్ని భ్రష్టుపట్టించేస్తున్నారు… రమ్యకృష్ణను కూడా తీసుకొచ్చి, నటింపజేసి, హైప్ క్రియేట్ చేసి నాగభైరవిని కూడా నాశనం చేశారు… ఇప్పుడిక కృష్ణతులసి… ఈ పనికిమాలిన సీరియళ్లతో మాటీవీని ఎలా కొడతావురా నాయనా..? మరీ ఈటీవీ, జెమిని స్థాయికి దిగజారనివ్వకు…!! రాఘవేంద్రరావు సంగతి అంటారా..? అది గాన్ కేస్…!!
Share this Article