మాటీవీ క్రియేటివ్ హెడ్ మీద నిజంగా కేసు వేయాలి ఎవరైనా…? మా వరలక్ష్మి వ్రతం అని పేరు పెట్టి ఓ చెత్తా, దిగజారుడు షో ప్రసారం చేసినందుకు,.!! ఇక్కడ మనోభావాలు దెబ్బతినేందుకు ఏమీ లేదు… మాటీవీ, జీటీవీ, ఈటీవీ… ఏ ఎదవైతేనేం..? అందరూ అదే రేంజ్ కదా… ప్రత్యేకించి మాటీవీ వాడిని విడిగా తిట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఆ శీర్షిక ఏమిటి..? ఈరోజు నడిపించిన షో ఏమిటి..? కనీసం అది కిట్టీ పార్టీ కూడా కాదు, అంతకుమించిన ఓ ‘‘క్రాక్ షో’’… ఫస్ట్ ఒక విషయం చెప్పుకుని, మిగతావి మాట్లాడుకుందాం… ఈ షోలో రోళ్లు పెట్టి, పసుపులు దంచే పోటీ ఒకటి పెట్టారు… దాని వెనుక బ్యాక్ గ్రౌండ్ పాట ఏమిటో తెలుసా..? ‘‘దంచవే మేనత్తకూతురా..?’’ తరువాత అవినాష్, మరెవరో ఇద్దరు ఆడలేడీస్ ఆ పాటకు స్టెప్పులు వేస్తారు… గలీజు గాడిదలు… ఆ పాటకూ, ఆ శీర్షికకూ, ఆ వ్రతానికీ ఏమిట్రా లింకు..? ఆ బూతుపాటను కోట్ల మంది ఆడవాళ్లు జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి ముడిపెట్టడం ఏమిట్రా..? హార్ష్‌గా అనిపిస్తోంది కదా… ఆ సీన్ చూస్తుంటే ఇంతకుమించిన కోపమే వచ్చింది… ప్రతివాడికీ మన సంప్రదాయాల్ని కించపరచడం అలవాటైపోయింది… వరలక్ష్మి వ్రతాన్ని కూడా రికార్డింగ్ డాన్సులు చేశారు కదరా…?
ఈటీవీ వాడిని చూసి మాటీవీ వాడు నేర్చుకున్నాడు… తమ సీరియళ్లలో, కామెడీ షోలలో పాల్గొనేవాళ్లకు తృణమో ఫణమో పారేసి, స్పెషల్ షోలలో పార్టిసిపేట్ చేయించడం, కాదంటే వాడికి కోపమొచ్చి చాన్సులు లేకుండా చేస్తాడేమోననే భయంతో వాళ్లంతా అర్జెంటుగా రంగులు పూసుకుని, షోకు పేరంటం వచ్చేయడం అలవాటైపోయింది… దంచవే మేనత్త కూతురా పాటేం ఖర్మ..? దిగుదిగుదిగునాగ పాటకు డాన్సులు చేయమన్నా రెడీ అనేట్టుగా తయారయ్యారు… దీనికి ఉదయభాను యాంకర్… ఎస్, సుమ కాలం, అంటే క్రీస్తుపూర్వం రోజుల్లోనే ఓ వెలుగు వెలిగింది… అన్నీ బాగుంటే సుమకు దీటుగా, సారీ, సుమకు తెలంగాణ యాక్సెంట్ రాదు, ఉదయభానుకు అదీ మంచినీళ్లప్రాయం… సో, సుమను దాటి ధగధగ వెలగాల్సిన ఉదయభాను, తరువాత ఎందుకో తెరమరుగైంది… తనకు డాన్స్ వచ్చు, బోల్డ్‌గా నటించడం వచ్చు, పాడటం వచ్చు, యాంకరింగు అలవోకగా చేయగలదు, సరే, ఏ రీజన్స్ ఉన్నాయో ఏమిటో గానీ… గ్రహణం పట్టి, మళ్లీ బుల్లితెర మీద ఇప్పుడు కనిపించింది… అలవోకగా చేసేసింది… కానీ ఎటొచ్చీ షో కాన్సెప్టు, ఆచరణే ఓ చెత్త…
Ads
అందరూ ఆడాళ్లే ఒక్క అవినాష్ తప్ప… తెలుసు కదా, నడమంత్రపు సిరి, పాపులారిటీ… ఓవరాక్షన్… తనకుతోడుగా ఓ బుడంకాయ్… మాటీవీ వాడి టేస్టే టేస్టు… ఇక్కడ మెచ్చుకోవాల్సింది రోహిణి… తన టైమింగు, ఎనర్జీ బాగుంది… అంతే ఇక… మిగతా కిట్టీ పార్టీ టైపు పోటీలు గట్రా ఉత్త టైంపాస్ పల్లీ యవ్వారం… చెప్పనేలేదు కదూ, మధ్యలో ఓ పెద్దమనిషి వచ్చి ఏదో పాట పాడాడు… కర్ణకఠోరం… చివరలో ఓ మహర్షి వచ్చాడు, ఈ వ్రతమహత్యం చెప్పాడు… అసలిక్కడ వ్రతమేమిటి..? ఈ ప్రవచనం ఏమైనా సూటయిందా అసలు..? సంభావన దక్కింది కదా, పండగ చేస్కో పో… అసలు ఈ దరిద్రపు పోటీలు, అవినాష్ మార్క్ కామెడీ షోయా వ్రతం అంటే..? చివరకు వ్రతాల్ని కూడా కామెడీగా మార్చారు సరే, ఈ అవినాష్‌ను నమ్ముకుని ఆల్‌రెడీ మాటీవీవాడు కాస్త మునిగాడు… ఇలాంటివే చేస్తే మరింత మునుగుతాడు… ఏదో మీటర్ల ట్యాంపరింగ్ కళ తెలుసో ఏమో గానీ, మళ్లీ మస్తు రేటింగ్స్ రావచ్చుగాక… కానీ జనం ఏవగించుకున్నారురా మహానుభావా..? చివరగా… అవును, అవినాషూ… గంగవ్వ, అరియానా, సుజాత, ఆషురెడ్డి తదితర బిగ్‌బాస్ కేరక్టర్లను తీసుకురాలేదు… ఏమైంది…!~?
Share this Article