.
Pardha Saradhi Potluri ………… అమెరికా పతనం – పీటర్ టర్చిన్- part-1
పీటర్ టర్చిన్- Peter Turchin!
పీటర్ టర్చిన్ మాక్రో హిస్టరీ ( Macro History) కి సంబంధించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త. హిస్టోరికల్ డైనమిక్స్ మీద పుస్తకాలు వ్రాసాడు.
పీటర్ టర్చిన్ పుట్టింది 1957 లో ఒక్కప్పటి సోవియట్ యూనియన్ లో. అమెరికాలో స్థిరపడిన రష్యన్ జాతీయుడు.
నిజానికి పీటర్ టర్చిన్ బయాలాజీ పట్టభద్రుడు. జూవాలజీలో Ph.d చేశాడు కానీ చరిత్ర దాని డైనమిక్స్ మీద చాలా ఖచ్చితమైన జోస్యాలు చెప్తున్నాడు.
Ads
2010 లో పీటర్ టర్చిన్ 2020 నుండి అమెరికా పతనం మొదలవుతుంది అని జోస్యం చెప్పాడు. అయితే గ్రహకూటమి లేదా మరొకటిని ఆధారం చేసుకుని జోస్యం చెప్పలేదు పీటర్ టర్చిన్!
చరిత్ర దాని డైనమిక్స్ ఆధారం చేసుకొని ( macro history – cliodynamics – mathematical modeling and statistical analysis) ఏం జరగవచ్చో 15 ఏళ్ళ ముందే చెప్పాడు పీటర్ టర్చిన్.
ఆశ్చర్యకరంగా ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతున్నది.
2010 లో పీటర్ టర్చిన్ అమెరికా పతనం 2020 లో మొదలవుతుంది అని చెప్పినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే పీటర్ టర్చిన్ అనే పరిశోధకుడు ఫ్రెంచి తత్త్వవేత్త నాస్ట్రోడామస్ కాదు, జపాన్ కి చెందిన జోస్యం చెప్పే బాబా వంగా కాదు.
కేవలం చరిత్రలో జరిగిన సంఘటనలని కూలంకషంగా అధ్యయనం చేయడం వలన పీటర్ టర్చిన్ భవిష్యత్తుని ఊహించగలిగాడు.
పీటర్ టర్చిన్ క్లియోడైనమిక్స్- మాథమాటికల్ మోడలింగ్, స్టాటిస్టికల్ అనాలసిస్ డైనమిక్స్ of హిస్టరికల్ సొసైటీస్ ద్వారా ఏమి చెప్పాడంటే…..
మొత్తం మూడు అంశాలని పరిగణలోకి తీసుకొని విశ్లేషంచి చెప్పినవి…
1.సాధారణ కార్మికుల జీత భత్యాలలో పెరుగుదల లోపించి ఉన్నత వర్గాలతో పోలిస్తే తీవ్ర వ్యత్యాసం ఉండడం.
2.ఉన్నత విద్య నేర్చుకొని డిగ్రీలతో యూనివర్సిటీల నుండి బయటికి వచ్చి తమ విద్యార్హతకి సరిపోలే ఉద్యోగం కోసం పోటీపడేవారు ఎక్కువ అవడం. టర్చిన్ దీనిని ఓవర్ ప్రోడక్షన్ తో పోల్చాడు. తమ విద్యార్హతతో సమానమైన ఉద్యోగం దొరకపోవడంతో అసంతృప్తి పెరిగి, అది ప్రభుత్వం, సమాజం పట్ల ద్వేష భావం కలగడం జరుగుతుంది. దీనిని వెల్త్ గాప్ ( Wealth Gap) గా పేర్కొన్నాడు పీటర్ టర్చిన్.
ప్రతీ 50 సంవత్సరాలకి ఒకసారి ఇది జరుగుతూ వస్తున్నది అమెరికాలో.
పీటర్ టర్చిన్ ఉదాహరణగా 1870, 1920, 1970 లలో అమెరికాలో జరిగిన హింసలని గుర్తు చేస్తూ 50 సంవత్సరాలకి ఒకసారి ఇవి జరిగినప్పుడు రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని, మళ్ళీ ఇప్పుడు అవే పరిస్థితులు కనపడుతున్నాయని, కాబట్టి 1970 నుండి 50 సంవత్సరాలు లెక్కవేస్తే అది 2020 గా ఉంటుంది కాబట్టి, 2020 కి నేను అమెరికా డౌన్ ఫాల్ ప్రారంభం అవబోతున్నది అని చెప్పగలుగుతున్నాను.
50 సంవత్సరాలు గడిస్తే తరాలు మారి గత సంఘటనలు మర్చిపోతున్నారనీ, ఇదే అవకాశంగా తీసుకొని ఎలైట్ గ్రూపు ( అమెరికన్ ఆయుధ, ఫార్మా, వాల్ స్ట్రీట్ ) మళ్ళీ అదే ఫార్ములాని అమలు చేసి అమెరికాని అస్తవ్యస్త్యం చేస్తున్నాయి. ఈ ఎలైట్ గ్రూపు మద్దతు లేనిదే ఎన్నికలలో గెలవడం కష్టం అది డెమోక్రాట్లు కావొచ్చు లేదా రిపబ్లికన్లు కావొచ్చు.
3. ఎలైట్ గ్రూపు తమ స్వార్ధం కోసం పన్నుతున్న వ్యూహాలే పదే పదే అమలు చేస్తూ రావడంవల్ల అమెరికా ప్రభుత్వం అది ఏ పార్టీ అధికారములో ఉన్నా సరే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. దాని ఫలితమే యుద్దాలు, ఆర్ధిక ఆంక్షలు, కొన్ని దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా మారడం జరుగుతూ వస్తున్నది!
ప్రస్తుతం అమెరికా తీవ్ర ఆర్ధిక మాంద్యంలో ఉన్నది.
అమెరికా అప్పులు నానాటికి పెరిగిపోతున్నాయి.
అమెరికా అప్పుల్లో ఎలా ఉంది?
ఇష్టారీతిన డాలర్లు ముద్రిస్తూ పోతున్నది కదా?
ఉదాహరణకి చైనా తన ఉత్పత్తులని అమెరికాకి ఎగుమతి చేసి డాలర్ల రూపంలో పోగుచేస్తూ వస్తున్నది. కానీ అవి చైనా సెంట్రల్ బాంక్ లో ఉంటే వడ్డీ రాదు.
ఇక్కడే అమెరికా తన బ్యాండ్లు ఆఫర్ చేస్తుంది. అమెరికన్ బాండ్లు కొంటే వడ్డీ ఇస్తుంది ఫెడరల్ రిజర్వ్.
రేండేళ్ల కాలపరిమితి గల బాండ్స్ లో పెట్టుబడి పెడితే 3.88% వడ్డీ ఇస్తుంది. నాలుగేళ్లు పరిమితి వరకూ మార్పు ఉండదు.
అదే 10 ఏళ్లకి 4.25%, 30 ఏళ్లకి అయితే 4.75% వడ్డీ ఇస్తుంది.
చైనా గత 30 ఏళ్లుగా ట్రెజరీ బాండ్లలో తన డాల్లర్లని పెట్టుబడి పెడుతూ వచ్చింది. ఒక దశలో 3.2 ట్రిలియన్ డాలర్ల విలువచేసే ట్రెజరీ బాండ్స్ చైనా అధీనంలో ఉండేవి.
2010 నుండి చైనా క్రమేణా తన బాండ్స్ అమ్ముకుంటూ కాష్ చేసుకుంటూ వస్తున్నది.
అమెరికా చైనాతో వాణిజ్య యుద్ధం మొదలుపెట్టినప్పటికి చైనా ప్రతీకారం తీర్చుకోవడానికి తన దగ్గర ఉన్న ట్రెజరీ బాండ్స్ ఒక్కసారిగా అమ్మలేదు. ఒక్కసారిగా బాండ్స్ అమ్మితే డాలర్ విలువ పడిపోయి చైనా కరెన్సీ యువాన్ పెరిగిపోయి తద్వారా తన ఎగుమతుల మీద ప్రభావం చూపిస్తుంది కనుక ఒక్కసారిగా కాకుండా దశల వారీగా అమెరికన్ బాండ్స్ ని ఉపసంహరించుకుంటూ వస్తున్నది.
గాంధార దేశ ప్రభావం!
Yes! ఆఫ్ఘానిస్తాన్ లో జోక్యం చేసుకున్న ఏ దేశమూ బ్రతికి బట్ట కట్టలేదు.
తన మద్దతు ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వం సహాయం కోసం అప్పటి సోవియట్ అధ్యక్షుడు లియోనిద్ బ్రెజ్నెవ్ 24 డిసెంబర్ 1979 లో అప్పట్లో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉబ్జెకిస్థాన్ ద్వారా తన సైన్యాన్ని ఆఫ్ఘానిస్తాన్ లోకి పంపించాడు.
1979 నుండి 1989 వరకూ అంటే… 10 ఏళ్ళ పాటు సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి ముజాహిదీన్లతో పోరాడింది. చివరికి 1989 లో అప్పటి సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గొర్బచేవ్ ఆఫ్ఘానిస్తాన్ నుండి తమ సైన్యాన్ని ఉపసంహారిస్తున్నట్లుగా ప్రకటించాడు!
10 ఏళ్ళ పాటు సోవియట్లు ఆఫ్ఘనిస్తాన్ లో పోరాడినందుకు ధనం, ఆయుధాలు, సైనికుల ప్రాణాలని భారీగా నష్టపోయి చివరికి 1991 లో సోవియట్ యూనియన్ వచ్చిన్నం అయిపొయింది!
అప్పటి పదేళ్ల యుద్ధంలో అమెరికా, పాకిస్థాన్ లు సోవియట్లకి వ్యతిరేకంగా ముజాహిదీన్లకి సహాయం చేశాయి.
అరబ్ దేశాలతో పాటు ఇరాన్, చైనాలు కూడా తలొక చేయి వేసాయి సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా! ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం!
అమెరికా - గాంధార దేశం!
2001 నుండి 2021 వరకు అంటే… రెండు దశబ్దాలపాటు అమెరికాతో పాటు మిగిలిన నాటో దేశాలు ఆఫ్ఘానిస్తాన్ లో తిష్ట వేసి అల్ ఖైదా, ISI, తాలిబాన్లతో యుద్ధం చేసి ఏమీ సాధించకుండానే వెనక్కి వచ్చేసాయి.
పదేళ్లు సోవియట్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటేనే కుప్పకూలింది, అలాంటిది అమెరికా దాని మిత్రపక్షాలు
20 ఏళ్ళు ఉంటే ఇంకెంత నాశనం అవ్వాలి?
పీటర్ టర్చిన్ 2010 లో చెప్పిన జోస్యం 2020 కల్లా అమెరికా పతనం ప్రారంభం అవుతుందని.
2022 లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టిన మూడు నెలలకే అమెరికా ఉక్రెయిన్ కి ఆయుధాలు సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ పీటర్ టర్చిన్ చెప్పిన జోస్యం రెండేళ్లు ఆలస్యంగా మొదలైంది అని చెప్పుకోవచ్చు.
ఉక్రెయిన్ కి అమెరికా ఇచ్చింది ఒక డాలర్ అయితే లెక్కల్లో వ్రాసింది 10 డాలర్లు. జో బిడెన్ & Co అవినీతికి అంతే లేదు.
ఇప్పటికిప్పుడు అమెరికా ఆర్ధిక పరిస్థితికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నా ఏదో దాస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి., ఎందుకంటే పశ్చిమ దేశాల సంస్కృతి ఉద్భవించింది రహస్యంగా ఉండడం లేదా రహస్యంగా ఉంచడం అనే సిద్ధాంతం నుండి! కలి పురుషుని తీవ్రమైన ధృక్కుల ప్రభావం ఇది. వీళ్ళు రహస్యంగా ఉంటూ, రహస్యంగా ఉంచుతూ ప్రపంచాన్ని శాసిస్తారు! (తరువాయి భాగం రెండో పార్టులో…
Share this Article