▪️ ఏరా ఏకాకి.. కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వెళ్తున్నావేం ? అంటూ సూర్యాన్ని ఒడిసిపట్టి జీపులో ఎక్కించిన ఇన్స్పెక్టర్ ఆయన్ను సరాసరి స్టేషన్ కు తీసుకెళ్తాడు. అక్కడ సూర్యంతో వేలిముద్ర వేయించడానికి పోలీసులు ఎంతగా ప్రయత్నించింది.. స్టేషన్ లో అందర్నీ కొట్టి సూర్యం ఎలా పారిపోయిందీ ఇంకా కళ్ళ ముందే ఉంది.
▪️ సూర్యాన్ని , అయన కుటుంబాన్ని వీరభద్రయ్య పెడుతున్న హింసలు చూస్తుంటే థియేటర్లో వాళ్లకు మనసు రగిలిపోయేది. అంత పేదరికంలోనూ సూర్యాన్ని మధులత ప్రేమించడం ప్రేక్షకులకు కాస్త ఊరట. డాక్టర్ సుజాత సపోర్ట్ ఓదార్పు సైతం సూర్యానికి కొండంత అండ.
▪️ పోలీస్ జాగిలాలు తరుముతుంటే దొరికిపోతాడేమో అని ఊపిరి బిగబట్టి చూస్తుండగా ఒక ఆకును గొట్టంలామార్చేసి నోట్లో పెట్టుకుని వాగులో దూకి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు పోవడం.. జాగిలాలు నిస్సహాయంగా ఇవతలి ఒడ్డునే అరుస్తూ నిలబడం ప్రేక్షకుడికి పెద్ద థ్రిల్..
Ads
▪️ తన అరటి తోటలోని గెలలన్నీ వీరభద్రయ్య తన్నుకునిపోగా బోడిగా నిలిచిన అరటి చెట్లను అసహాయుడై కోపంతో తెగనరికిన సూర్యంలోని పౌరుషం ప్రేక్షకులకు గూస్ బంప్స్..
▪️ డబ్బులిస్తాం .. పైగా పోయేది అవతలోడి ప్రాణమే కదా మాకేటి నష్టం అని చెప్పేశాం అంటూ సుత్తివేలు చెప్పే డైలాగ్.. సూపర్
▪️ నీకన్న తండ్రి ప్రాణాలు కాపాడడానికి రాయబారిగా వచ్చావా అంటూ సూర్యం చెప్పే డైలాగ్ అదుర్స్
▪️ మధూ, పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను. ప్రేమించడానికి మరో జన్మలో కలుద్దాం.. బై…
▪️ మీ దృష్టిలో దొంగగా.. హంతకుడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు.. అంటూ డాక్టర్ సుజాతకు సూర్యం చెప్పే ఫ్లాష్ బ్యాక్.. సూపర్
▪️ చేతులకు సంకెళ్లతో రౌద్రం నిండిన కళ్ళతో నిలబడిన సూర్యం పోస్టర్.. ఇప్పటికీ ఒక సంచలనం..
- ప్రత్యేకంగా చెప్పాల్సింది మాధవి… చిరంజీవితో దీటుగా డాన్సిన పాటలు ఇప్పటికీ చూడబులే… మొగలి పొద రగిలినా, మెరమెర మెరుపుల మేనకై మెరిసినా, యువత గుండెలు కొల్లగొట్టినా… అల్టిమేట్ పాటలు ఈనాటికీ…
▪️ అంతవరకూ ఒక రూట్లో నడుస్తున్న తెలుగు సినీ గమనాన్ని దిశ మార్చి మరో దారి చూపిన చిత్రం.. యథావిధిగా మా కొమ్మినేని అప్పారావు మ్యూజిక్ .. పరుచూరి డైలాగ్స్… కోదండ రామిరెడ్డి దర్శకత్వం.. ఫైనల్ గా సినిమా ఒక ఇండస్ట్రీ హిట్… రిలీజై సరిగ్గా నలభయ్యేళ్ళు.. (28-10-1983)…. రచయిత :: కొప్పర గాంధీ
Share this Article