నిజంగా బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లతో బాలీవుడ్ దశ మారిపోయిందా..? ఈ సంవత్సరం ప్రేక్షకుల మొహాలు చూడక వెలవెలపోయిన థియేటర్లు నిజంగానే కళకళలాడుతున్నాయా..? హిందీ సినిమాలు మళ్లీ గాడిన పడ్డాయా.? ఈ ప్రశ్నకు సమాధానం… లేదు..! అంత సీన్ లేదు… డబ్బింగ్ సినిమాల్ని, అనగా సోకాల్డ్ పాన్ ఇండియా సినిమాల్ని, ఇప్పటికీ థియేటర్లలో ఉన్న విక్రమ్ వేద, బ్రహ్మాస్త్రలను కూడా వదిలేస్తే… దాదాపు 30-35 పేర్కొనదగిన హిందీ సినిమాలు…
కానీ వాటిల్లో మూడు మాత్రమే హిట్… మిగతావన్నీ వాషవుట్… కొన్ని అత్యంత ఘోరమైన డిజాస్టర్లు… నిర్మాతలకు ఏడుపే మిగిలింది… నిజానికి సౌత్ నుంచి హిందీని డబ్బింగైన సినిమాల్లో కూడా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 మాత్రమే వసూళ్లు కుమ్ముకున్నాయి… కానీ రాధేశ్యామ్, విక్రమ్, వలిమై, బీస్ట్, లైగర్, రాకెట్రీ తదితర సినిమాలు హిందీ వెర్షన్లపరంగా ఫ్లాప్…
పెద్ద సినిమాల్ని పక్కనపెడితే… లోబడ్జెట్ హిందీ సినిమాలు దేశ్ కీ ధర్తీ, తులసీదాస్ జూనియర్, లక్నో జంక్షన్, దేహతి డోస్కో, నికమ్మా షెర్డిన్, ది ఫిలిబిత్ సాగా, జనహిత్ మే జారీ వంటి సినిమాలయితే అత్యంత ఘోరమైన డిజాస్టర్లు… సో, అంత బాగా ఏమీలేదు… కొన్ని సినిమాల రిజల్ట్ చూద్దాం…
Ads
Badhaai Do… ఫ్లాప్… 45 కోట్లు పెడితే 20 కోట్లు వచ్చినయ్…
Gangubai Kathiawadi… అందరూ అనుకున్నట్టు ఇదేమీ సక్సెస్ సినిమా కాదు… దాదాపు 180 కోట్లు ఖర్చు చేస్తే కష్టమ్మీద 130 కోట్ల వరకూ వసూలు చేసింది… వెరసి ఫ్లాప్ కేటగిరీయే… ఆలియా భట్ నటన ఒక్కటే ఆదుకోలేదు కదా… సంజయ్ లీలా భన్సాలీకి పెద్ద షాక్…
Jhund… అమితాబ్ బచ్చన్ సినిమా… సోషల్ డ్రామా… విమర్శకులు బాగుందన్నారు… కానీ 35 కోట్లు ఖర్చు చేస్తే వచ్చింది 15 కోట్లు… ఫ్లాప్…
The Kashmir Files… ఈ సంవత్సరం బాలీవుడ్‌లో చెప్పుకోదగిన హిందీ హిట్ ది కశ్మీర్ ఫైల్స్… వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూలు చేసింది… దీనికి పెట్టింది మహా అయితే 25 కోట్లు… పది రెట్ల వసూళ్లు… బ్లాక్ బస్టర్…
Bachchan Pandey…. అక్షయ్ కుమార్ సినిమా… యాక్షన్ కామెడీ… 165 కోెట్లు ఖర్చు పెట్టారు… కానీ వసూలైంది జస్ట్, 50 కోట్లు… అదీ కనాకష్టంగా… ఫ్లాప్…
Attack…. జాన్ అబ్రహాం తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది… జనం చాలా కర్కశంగా తిప్పికొట్టారు… 70 కోట్లు పెట్టుబడి పెడితే 15 కోట్లు తిరిగి వచ్చింది… డిజాస్టర్…
Jersey… కబీర్ సింగ్ తరహాలో జెర్సీ కూడా తనకు మంచి లైఫ్ ఇస్తుందని షాహిద్ కపూర్ ఆశపడ్డాడు… 110 కోట్ల దాకా పెట్టుబడి పెట్టించాడు… తీరా చూస్తే వచ్చింది 20 కోట్లలోపే… డిజాస్టర్…
Runway 34…. అజయ్ దేవగణ్, అమితాబ్ సినిమా… ఇది విమర్శకుల ప్రశంసల్ని పొందింది… కానీ సగటు ప్రేక్షకుడికి అస్సలు నచ్చలేదు… సినిమా మీద నమ్మకంతో 80 కోట్ల దాకా పెట్టారు… 30 కోట్లు వచ్చింది… ఢమాల్…
Heropanti 2… టైగర్ ష్రాఫ్ సినిమా మీద చాలామంది చాలా అంచనాలు ఉండేవి… కానీ బాలీవుడ్ గ్రహచారమే అందరినీ ఈడ్చి తంతోందని గమనించలేదు… 100 కోట్లు ఖర్చు చేస్తే మరీ 25 కోట్లతో చేతులెత్తేసింది… డిజాస్టర్…
Jayeshbhai Jordaar… రణవీర్ సింగ్, షాలినీ పాండే నటించిన ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో ఎవడికీ తెలియదు… 90 కోట్లు ఖర్చు చేస్తే 15 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు… డిజాస్టర్‌కు తాత…
Bhool Bhuliayaa 2….. బాలీవుడ్ కన్నీళ్లు తుడిచిన రెండుమూడు సినిమాల్లో ఇదీ ఒకటి… కార్తీక్ ఆర్యన్, టబు, కైరా అడ్వానీ నటించిన ఈ సినిమాకు 75 కోట్ల దాకా పెట్టుబడి పెట్టారు… కానీ 180 నుంచి 190 కోట్ల దాకా వసూలు చేసింది… బ్లాక్ బస్టర్…
Dhaakad…. కంగనా రనౌత్‌ను నేలమీదకు దింపిన సినిమా… తలవంచుకున్న సినిమా… బహుశా ఇంత ఘోరమైన సినిమా ఇకపై తను తీయలేదేమో… 85 కోట్లు ఖర్చు చేస్తే… మొదటిరోజే వందల షోలు రద్దయ్యాయి… కష్టమ్మీద 2.6 కోట్ల రూపాయలు వచ్చాయి… డిజాస్టర్‌కా బాప్…
Anek…. ఇది మరో డిజాస్టర్… ఆయుష్మాన్ ఖురానా, అనుభవ్ సిన్హా తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫ్లాపున్నర… 45 కోట్లకు గాను 8 కోట్లు వసూలు చేసింది…
Jugjugg Jeeyo…. దీన్ని ఫ్లాప్ అనలేం… కానీ రూపాయి లాభాన్ని మాత్రం తీసుకురాలేకపోయింది… వరుణ్ ధావన్, కైరా అడ్వానీ, అనిల్ కపూర్, నీతూకపూర్ నటించిన సినిమాకు 100 కోట్ల దాకా పెట్టారు… కానీ 85 కోట్ల దాకా వసూలు చేయగలిగింది… చావు తప్పి కన్ను లొట్టపోయింది…
Rashtra Kawach Om…. ఇది బాలీవుడ్‌లో మరో భారీ డిజాస్టర్… ఆదిత్యరాయ్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్… 60 కోట్లు పెడితే 6 కోట్లు కూడా రాలేదు…
Khuda Haafiz: Chapter 2…. ఇది 2020 నాటి సినిమాకు సీక్వెల్ డ్రామా… ఇదీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది… 50 కోట్లు ఖర్చు చేస్తే 10 కోట్ల వరకూ వసూలు చేసింది…
Hit: The First Case….. అదే పేరున్న తెలుగు సినిమాకు రీమేక్… ఎవరెవరు నటించారో మరి, పెద్ద పేరున్నవాళ్లు ఏమీ కాదు, 40 కోట్లు ఎందుకు పెట్టారో తెలియదు… 9 కోట్ల వసూళ్ల లెక్కల మిస్టరీయే…
Shabaash Mithu…. లెజెండరీ టాప్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ఇది… శెభాష్ మిథు… తాప్సీ నటించింది… ఎంత ఘోరమైన డిజాస్టర్ అంటే… ఫస్ట్ బాల్‌కే క్లీన్ బౌల్డ్… 40 కోట్లు ఖర్చు చేశారట… జస్ట్, 2 కోట్లు వచ్చిందంటున్నారు…
Shamshera… రణబీర్ కపూర్ కమ్ బ్యాక్ మూవీ అన్నారు… ఆహా అన్నారు… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అన్నారు… 150 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు… బహుశా మానిప్యులేటెడ్ ఫిగర్స్ కావచ్చు… కానీ వచ్చినవి కూడా 45 కోట్లు అట… ఏమో, అదీ డౌటే… పెద్ద డిజాస్టర్…
Ek Villain Returns ….. అప్పట్లో, అంటే 2014లో సూపర్ హిట్ సినిమా ఏక్ విలన్… దానికి సీక్వెల్ ఇది… ఏక్ విలన్ రిటర్న్ అని పేరు పెట్టారు… 80 కోట్లు పెట్టారు, కానీ ఆడియెన్స్ ఛీఫో అన్నారు… 40 కోట్ల దాకా వచ్చినట్టు లెక్క… ఫ్లాప్…
Laal Singh Chaddha…. వార్తల్లో బాగా నాని, హిందీ సినిమాల స్టార్ల మొహాలు పగిలిపోయిన సినిమా ఇది… ఆమీర్ ఖాన్ సినిమా అంటే ఒకప్పుడు హాట్ కేక్… ఈ సినిమాకు 180 కోట్లు పెట్టారు… విపరీతమైన విమర్శలు… కష్టమ్మీద 60 కోట్ల దాకా రెవిన్యూ సంపాదించారు ఎలాగోలా… ఇదీ డిజాస్టరే…
Raksha Bandhan… లాల్ సింగ్ చద్దా సమయంలోనే ఇదీ విడుదలైంది,,.. అక్షయ్ కుమార్ సినిమా… ఫాఫం, దీనిపై తనకు బాగా ఆశలు ఉండేవి… కానీ వర్కవుట్ కాలేదు… 80 కోట్లు పెడితే 40 కోట్ల కష్టమ్మీద వచ్చింది… జనానికి కూడా సినిమా నచ్చలేదు… ఫ్లాప్…
Do Baaraa…. ఇది మరో డిజాస్టర్… కాస్త హార్ష్‌గా అనిపించినా సరే బలుపు మాటలతో జనాన్ని రాకుండా చేసుకున్న సినిమా… అసలే సినిమాలో దమ్ములేదు, దమ్ముంటే బాయ్‌కాట్ చేసుకొండని బహిరంగంగా పిలుపునివ్వడంతో, సరే, మీ మాటెందుకు కాదనాలి అంటూ ప్రేక్షకుడు ఆ థియేటర్ల వైపే పోలేదు… 25 కోట్లు ఖర్చు చేస్తే 3, 4 కోట్లు కూడా రాలేదు… టాలీవుడ్ సినిమా పరిస్థితి కూడా అంత బాగా ఏమీలేదు… అది మరోసారి చెప్పుకుందాం…!
Share this Article