.
బిడ్డ చచ్చినా పురుటి కంపు పోనట్టు..! ఇది మన సెలెబ్రిటీలు, వాళ్ల వార్తల కవరేజీలో అత్యుత్సాహానికి సరిగ్గా వర్తిస్తుంది…
బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఫ్లాప్… డౌట్ లేదు… ఏడుకన్నా ఫ్లాప్… మెంటల్ కేసుల్ని ఎంపిక చేసి నానా చెత్తా నింపారు ఆ షో టీమ్…
Ads
సరే, ఎలాగోలా అయిపోయింది… కానీ ఇంకా ఆ కంపు వాసన పోలేదు… తెలుగోడిని గాకుండా కన్నడమొడిని విజేతను చేయడం ఏమిటి అని ఓ రచ్చ… ఆడటం చేతకాని విధం… విజేత నిఖిల్ కన్నడిగ… గౌతమ్ గాకుండా తనను విజేతను చేశారట, బిగ్‌బాస్ కుట్ర చేసిందట…
అసలు నిఖిల్ నటించేదే తెలుగు సీరియళ్లలో… ఈ గౌతమ్ షోలో పిచ్చి పిచ్చి చేశాడు… అక్కా అనే వెటకరింపులు, అరుపులు, కేకలు అబ్బో చెబితే చర్విత చరణం… కాకపోతే తన పీఆర్ టీం బాగా శ్రమపడింది… కన్నడ వర్సెస్ తెలుగు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది… అందుకే గౌతమ్ పోటీలోకి వచ్చాడు… లేకపోతే ఓ దశలో వెళ్లిపోయేవాడే…
నిఖిల్ కన్సిస్టెన్సీయే తనను గెలిపించింది… అంతా అయిపోయాక నిఖిల్ బయటికొచ్చాక తన మీద ఏమేం దుష్ప్రచారాలు జరిగాయో తెలుసుకున్నాడు… జస్ట్, తన పట్ల నెగెటివిటీ పెంచడానికి … మరి పీఆర్ టీమ్స్ చేసే పని అదేకదా… కానీ తన కుటుంబాన్ని కూడా లాగి అల్లరిపాలు చేస్తున్నారని, షో అంటే షో, అంతే, అదీ అయిపోయింది, ఇకనైనా ఈ వెగటు క్యాంపెయిన్ ఆపకపోతే తన తడాఖా చూపాల్సి వస్తుందని నిఖిల్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది…
అదొక ఆట అని మరిచిపోయి గౌతమ్ కూడా ఇంటర్వ్యూల్లో ఏదేదో చెప్పేస్తున్నాడు… నాట్ కరెక్ట్… తన మెంటాలిటీయే అది… ఈలోపు మరో ప్రచారం పట్టుకొచ్చారు… షోలో ఉన్నప్పుడు, తను షో అయిపోగానే తన లవర్ కావ్య దగ్గరకు వెళ్తాననీ, కొట్టనీ, తిట్టనీ అని చెప్పాడు… కానీ విజేత అయ్యాక వచ్చి కర్నాటక వెళ్లిపోయాడు గానీ కావ్య దగ్గరకు ఎందుకు వెళ్లలేదు… తన ప్రేమలో నిజాయితీ లేదు, అందరినీ తన ఆటకు వాడుకోవడమే అనేది ఆ ప్రచారం…
ఆమె దగ్గరకు వెళ్లకపోతే ఇప్పుడేమైనా అరిష్టమా..? అదొక ద్రోహమా..? వాడికి నిజాయితీ లేకపోతే ఇప్పుడు ఆ దిక్కుమాలిన ఆటకు వచ్చిన కొత్త అప్రతిష్ఠ ఏమైనా ఉందా..? పిచ్చి ప్రచారం…
మరో ప్రచారం… ఆకుల సోనియా ఆటలో ఉన్నప్పుడు నిఖిల్‌ను పెద్దోడు అని, పృథ్విని చిన్నోడు అని సంబోధించేది… సన్నిహితంగా ఉండేది… నెగెటివిటీ మూటగట్టుకుని బయటకు వచ్చింది… పీడాపోయింది అనుకుని తన లవర్ వీరగోని యశ్‌ను పెళ్లి చేసుకుంది… గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చి, బిగ్‌బాస్ పాత, కొత్త వాళ్లను కూడా పిలిచింది…
దానికి ది గ్రేట్ పల్లవి ప్రశాంత్ వచ్చాడు… తన చుట్టూ బౌన్సర్లు… హంగామా..? తెలుసు కదా, గత సీజన్ ఫినాలే తరువాత ఈ హీరో ఫ్యాన్స్ క్రియేట్ చేసిన విధ్వంసం… తను కూడా ఓ అల్లు అర్జున్ అని ఫీలవుతున్నాడు ఈ నడుమ… హైదరాబాదులో ఆ రేంజ్ ఉద్రిక్తతలు క్రియేట్ చేయగలిగింది తను, బన్నీ మాత్రమేనని ఫీలింగ్…
అదయిపోయింది కదా, పెద్దోడు నిఖిల్ సోనియా పెళ్లికి ఎందుకు రాలేదని మరో ప్రచారం… వాడి బాధేమిటో, పరిస్థితేమిటో తెలియకుండా… దాన్ని ఓ పిచ్చి ప్రచారానికి వాడుకుంటున్నారు… యాడ దొరికార్రా మీరంతా…
ఓహోంకార్ తెలుసు కదా… టీవీ షోలను హోస్ట్ చేసి, నిర్మిస్తుంటాడు… ఇస్మార్ట్ జోడీ షోకు ఈసారి సోనియాను, యశ్‌ను తీసుకున్నాడట… తను ప్రేరణకు కూడా హామీ ఇచ్చినట్టున్నాడు షోలోనే… ఈ సీజన్ ఫుల్ నెగెటివ్ క్యాంపెయిన్ల నడుమ ఇదొక్కటీ కాస్త బాగున్నట్టనిపించింది..!!
Share this Article