Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అడ్డదారులూ ఫలించని సాక్షి… ఈనాడును జయించలేక చతికిల… ప్చ్, ఆంధ్రజ్యోతి…

April 3, 2023 by M S R

పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు… ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… పది రోజుల క్రితం తాజా ఫిగర్స్ వచ్చాయి… జాతీయ స్థాయిలో ఎవరూ రాసుకోలేదు… ఎవరికీ ఆశించినంత, రాసుకునేంత సంతృప్తి లేదు గనుక… కరోనా భయాల అనంతరమూ పత్రికల సేల్స్ పెద్దగా పెరగలేదు గనుక… 2019 స్థాయిని తిరిగి చేరలేదు గనుక… చేరుకుంటామనే నమ్మకమూ, సూచనలూ లేవు గనుక… సరే, ప్రింట్ మీడియా పరిస్థితి ఇకపై కూడా పెద్దగా బాగుపడే అవకాశాల్లేవు, కారణాలు అనేకం కాబట్టి ఆ చర్చను కాస్త పక్కన పెడితే…

తెలుగు పత్రికల సర్క్యులేషన్ గురించి చెప్పుకోవాలి కాస్త… ఎందుకంటే..? సాక్షి అడ్డదారుల్లో సర్క్యులేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోందని ఈనాడు కోర్టుకెక్కింది… సుప్రీం దాకా చేరింది పంచాయితీ… వాలంటీర్లకు దినపత్రికల్ని కొనడానికి డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చి, సాక్షి కాపీలు ఎక్కువగా అమ్ముడుబోవడానికి సాక్షి యాజమాన్యం (అనగా జగన్) తప్పుడు దారుల్లో ప్రయత్నిస్తున్నాడు అనేది ఆరోపణ… నిజంగా జగన్ ఆలోచన, ఆచరణ ఫలించాయా..? ఈనాడు భయపడినట్టుగా ఈనాడు సర్క్యులేషన్ దీంతో పడిపోయిందా..? అసలు ఆంధ్రజ్యోతి పరిస్థితి ఏమిటి..?

సాక్షి అడ్డదారులు అనేది నిజం… ఈనాడు ఆరోపించిందని కాదు… ఏపీలో నంబర్ వన్ కావాలనీ, వైసీపీ వాదనే జనంలోకి ఎక్కువగా వెళ్లాలనీ, పనిలోపనిగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలను తొక్కేయాలని ఆ సంకల్పం… కానీ రామోజీరావు పడనివ్వలేదు… తను డంపింగ్ చేస్తున్నాడో, నిజంగానే పాఠకులు మళ్లీ ఈనాడును నెత్తిన పెట్టుకుంటున్నారో, సాక్షిలో జగన్ భజన తప్ప మరేమీలేక పాఠకులు వదిలేస్తున్నారో, ఈమధ్య ప్రభుత్వ వ్యతిరేకత కోణంలో ఈనాడు యాక్టివ్ అయిపోయింది కాబట్టి పాఠకుల ఆదరణ పొందుతున్నదో గానీ… ఈరోజుకూ ఈనాడు నెంబర్ వన్…

Ads

abc

చివరకు వాణిజ్య ప్రకటనలకు అత్యంత కీలకమైన హైదరాబాదులో కూడా ఈనాడు మళ్లీ నెంబర్ వన్ పొజిషన్‌లోకి వచ్చేసింది… (2022 జనవరి-జూన్ లెక్కల్లో సాక్షి హైదరాబాదులో ఈనాడును దాటేసింది… అది ఆరు నెలల ముచ్చటే అయిపోయింది…) ఆమధ్య కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి గుర్తున్నాయా..? మామూలు కంట్రిబ్యూటర్ దగ్గర నుంచి సాక్షి డైరెక్టర్ల దాకా సాక్షి కాపీల టార్గెట్లు పెట్టారనీ, ప్రతి ఒక్కరూ సాక్షి సర్క్యులేషన్ పెరిగేలా తమ పరిచయాలు, బంధుత్వాలు, స్నేహాల్ని వాడేసుకోవాలనీ..!! వెరసి ఏం జరిగింది..? ఇలాంటి టార్గెట్లూ పనిచేయలేదు, వాలంటీర్ల డబ్బులూ పనిచేయలేదు… మొత్తంగా సాక్షికి ఏ ఫాయిదా లేదు… అవును మరి, పత్రికలో దమ్ముండాలి కదా… ఏపీలో జగన్ భజన, తెలంగాణలో కేసీయార్ పట్ల మెతక ధోరణి…

అలాగని ఈనాడు గొప్ప పత్రిక అని కాదు… అది సాక్షికి తాత… దాని ‘యెల్లో కలర్’ ఎలా ఉన్నా, రోజురోజుకూ దాని పాత్రికేయ ప్రమాణాలు వేగంగా పడిపోతున్నా సరే… పోటీపత్రికలు అంతకన్నా ఘోరంగా ప్రమాణాల్ని పాతరేస్తున్నందున, పాఠకులు మళ్లీ మళ్లీ ఈనాడే నయంరా అనుకుంటున్నారు… పైన టేబుల్ చూశారు కదా… అంతకుముందు అర్ధవార్షికంతో పోలిస్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ కాస్త పెరిగింది… కరోనా సంక్షోభానంతరం కాస్త పరిస్థితులు చక్కబడుతున్నందున మళ్లీ పత్రికల మార్కెటింగ్ సిబ్బంది యాక్టివ్ అయిపోయారు, అదీ కారణం…

ఆంధ్రజ్యోతి ఫాఫం, కేవలం 24 వేల కాపీల్ని పెంచుకోగా… ఈనాడు 1.3 లక్షల కాపీల్ని పెంచుకోగలిగింది… సాక్షి కేవలం 75 వేల కాపీలు మాత్రమే పెంచుకోగలిగింది… సో, వాలంటీర్లతో కొనుగోళ్లు అనే ప్రయత్నం దారుణంగా ఫెయిలైందనే అనుకోవాలి… ఈనాడును కొట్టేయలేకపోయింది సరికదా హైదరాబాద్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయింది… సాక్షి 2.57 లక్షల కాపీలు కాగా, ఈనాడు కాపీల సంఖ్య 3.05 లక్షలు… మరి ఏపీలో…? కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి ఎడిషన్లలో సాక్షి ఈనాడుకన్నా ముందంజలో ఉంది… అంతే… మిగతా అన్నిచోట్లా ఈనాడే నెంబర్ వన్…

అదుగో రాజధాని అంటూ జగన్ ఇన్నేళ్లుగా చెబుతున్న వైజాగ్‌లో సాక్షికన్నా ఈనాడే ఎక్కువ… దాదాపు డబుల్… ప్రస్తుత రాజధాని విజయవాడలో సాక్షి 60 వేలయితే ఈనాడు 90 వేలు… తెలంగాణలో కూడా ఈనాడే టాప్… ఉదాహరణ కావాలా..? నిజామాబాద్‌లో ఈనాడు 41 వేలు కాగా సాక్షి 18 వేలు, ఆంధ్రజ్యోతి జస్ట్, పది వేలు… మహబూబ్‌నగర్‌లో సాక్షి 16 వేలు కాగా ఈనాడు 39 వేలు, ఆంధ్రజ్యోతి కేవలం 9 వేలు… చివరకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి మెట్రోల్లో కూడా ఈనాడే టాప్…

సో, ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే..? కరోనా భయాల అనంతరమూ దినపత్రికల పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడలేదు… తెలుగు పత్రికల విషయానికి వస్తే… సాక్షి అడ్డదారులూ ఫలించలేదు… ఈనాడు ఈనాటికీ నెంబర్ వన్… (ఏబీసీ ఫిగర్స్ దిగువన చూడొచ్చు… కాకపోతే సాక్షి స్టూడెంట్ ఎడిషన్స్ తో కాస్త తేడా కనిపిస్తాయి ఫిగర్స్…)

ఏబీసీ

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions