Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తరాలు మారుతున్నా సరే… రష్యాలో ఇండియన్ పాటలే ఈరోజుకూ పాపులర్…

July 9, 2024 by M S R

ఒక వార్త… ఇండియాటుడే ప్రత్యేక కథనం అది… మోడీ రష్యా పర్యటనకు వెళ్లాడు కదా… పుతిన్ ప్రభుత్వం, రష్యన్ సమాజం ఘనంగా స్వాగతించాయి… కాలపరీక్షకు నిలిచిన స్నేహం మనది అని ఇద్దరు అధినేతలూ ఆలింగనం చేసుకున్నారు సరే… ఈ సందర్బంగా ఆ మీడియా ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రజెంట్ చేసింది… అదేమిటీ అంటే..? ఒకప్పుడు రష్యన్ల మనస్సుల్ని గెలుచుకున్న ఇండియన్ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ అలాగే అలరిస్తోందా..? ఇదీ టాపిక్…

ముందుగా ఆ కథనంలో నాకు కనెక్టయిన ఓ వాక్యం చెప్పి, అసలు కథనంలోకి వెళ్దాం… ‘‘అవును, ఇప్పటికీ ఇండియన్ సాంగ్స్ అంటే రష్యన్లకు అనురక్తి… సౌత్ ఇండియా పాటలు కూడా… అందులో ఒకటి ఊ అంటావా పాట కూడా…’’ ఇది వెల్లడించింది ఎమ్మా అనే రష్యన్ యువతి…

మరో విషయం… కోల్డ్ వార్ సమయంలో… అప్పటికింకా సోవియట్ యూనియనే… USSR… అప్పట్లో హిందీ సినిమా పాటలంటే రష్యన్లు ఊగిపోయేవారు… ఒకసారి గోర్భచెవ్ ఇండియా పర్యటనకు వచ్చాడు… అప్పటికే మిథున్ చక్రవర్తి సినిమా డిస్కో డాన్సర్, అందులో ప్రత్యేకించి జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా అనే పాట కూడా సూపర్ హిట్ రష్యాలో… మారుమూల పల్లెల్లోకి కూడా చొచ్చుకుపోయింది ఆ పాట… ఆ పర్యటనలో రాజీవ్ గాంధీ గోర్బచెవ్‌కు అమితాబ్ బచ్చన్‌ను పరిచయం చేస్తూ ఈయన ఇండియన్ సూపర్ స్టార్ అన్నాడు…

Ads

దానికి గోర్బచెవ్ ‘ఏమో, నా బిడ్డకయితే ఒక్క మిథున్ చక్రవర్తి మాత్రమే తెలుసు’ అని బదులిచ్చాడు నవ్వుతూ… ఇంట్రస్టింగు… నిజానికి రష్యాలో ఏ కాలం నుంచో ఫేమస్ పాట… రామయ్యా వస్తావయ్యా పాట… ఆ పాట పాడని రష్యన్ గొంతు లేదు… అతిశయోక్తి కాదు… రష్యాలో పర్యటించే ఇండియన్లు ఎప్పుడైనా తమ జాతీయత చెప్పుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ పాట పాడితే చాలు, రష్యన్లు ఇండియన్లు అని వెంటనే గుర్తించేవాళ్లు, ఆదరించేవాళ్లు…

కోల్డ్ వార్ సమయంలో పాశ్చాత్య సంస్కృతికి అడ్డంగా రష్యా ప్రభుత్వాలు బలమైన ఇనుప గోడలు కట్టాయి… అక్కడి థియేటర్లలో రష్యన్, ఇండియన్ సినిమాలు మాత్రమే ఆడేవి… బాలీవుడ్ పాటలు అలా పాపులర్… జిమ్మీ జిమ్మీ పాట అయితే ఏకంగా ఓ జాతీయ గీతంగా మారిపోయింది… మరి ఇప్పుడు ఇంటర్‌నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది… ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బలంగా వ్యాపించాయి… పాప్ కల్చర్ ప్రవేశించింది…

కొత్త సినిమాలు, కొత్త పాటలు ప్రవేశించి… పాత ఇండియన్ సినిమాలు, పాటల ప్రాభవాన్ని తగ్గించేశాయా..? కాదు, స్టిల్ ఆ పాటలు రష్యన్లను అలరిస్తూనే ఉన్నాయి… 40 ఏళ్ల తరువాత కూడా జిమ్మీ జిమ్మీ పాట అంతే పాపులర్… మామూలుగా మన ఇండియన్ ప్రముఖ నాయకులు రష్యాలో పర్యటించినప్పుడు మ్యూజిక్ బాండ్ తప్పకుండా రామయ్యా వస్తావయ్యా పాట ప్లే చేస్తుంది… తరువాత జిమ్మీ జిమ్మీ పాట చేరింది… నిన్న ప్రధాని మోడీ పర్యటనవేళ భాంగ్రా, గర్బా పాటల్ని ప్లే చేశారు మ్యూజిక్ బాండ్…

అమర్ అక్బర్ ఆంథోనీ, మేరా నామ్ జోకర్, బాబీ, షోలే, డిస్కో డాన్సర్, డాన్స్ డాన్స్, కిషన్ కన్హయ్యా ఇలాంటి సినిమాలను మూవీ క్లబ్బులో ఎక్కువగా వేసేవాళ్లు అప్పట్లో… ఆ పాటలే రష్యన్ల ఇళ్లల్లో మోగిపోయేవి… ప్రత్యేకించి హమ్ తుమ్ ఏక్ కమ్‌రే మే బంద్ హో, జీనా యహా మర్నా యహా, హవాకే సాథ్ సాథ్ పాటలు బాగా పాపులర్…

అప్పట్లో సుధా రాజగోపాల్ అనే మ్యూజిక్ లవర్ చాలామందితో మాట్లాడి తన పుస్తకంలో ఏం రాశారంటే… ‘‘అసాధారణమైన ట్యూన్లు, మెలొడియస్ సాంగ్స్, వాటికి తగినట్టు డాన్సులు మాకు ఇష్టం అని రష్యన్లు చెబుతుంటారు…’’ ఓ ఇండియన్ జర్నలిస్టు మరో ఇద్దరితో కలిసి వ్లాడికవాజ్ అనే సుదూర ప్రాంత సిటీకి వెళ్లాడు… ఓ బార్‌లో ప్రవేశించగానే ఏదో వెస్టరన్ ట్యూన్ వాయిస్తున్న గిటారిస్ట్ వీళ్లు చూడగనే జిమ్మీ జిమ్మీ స్టార్ట్ చేసి, పాట పాడాల్సిందిగా ఇన్వయిట్ చేశాడు… ‘‘భారతీయులం ఆ పాటను మరిచిపోయాం, కానీ రష్యన్లు మరిచిపోలేదు’’ అంటున్నాడు ఆ జర్నలిస్టు…

ఇప్పటి పాటలు కూడా వాళ్లను ఆకర్షిస్తున్నాయి… ప్రత్యేకించి నోరా ఫతేహి వంటి సింగర్ల మీద ఆదరణ పెరిగింది… పఠాన్ పాటలు కూడా హిట్… హిందీ పాటలే కాదు, ఇప్పుడు పంజాబీ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి… మ్యూజిక్ సిస్టమ్ ఉన్న ప్రతి కారులో జోగి సాంగ్ మోగుతూనే ఉంటుంది… సౌత్ ఇండియా పాట వై దిస్ కొలవెరి కూడా ఈరోజుకూ ఫేమసే… పుష్పలోని ఊ అంటావా పాట కూడా… రష్యన్లు ఇండియన్ సినిమా మ్యూజిక్‌ను విదేశీ సంగీతంలాగా చూడరు… రష్యన్లకు ఇదీ సొంత సంగీతమే..!! సోనీ టీవీ వాళ్లూ వింటున్నారా..? ఈసారి మాస్కోలో గానీ సెయింట్ పీటర్స్ బర్గ్‌లో గానీ ఇండియన్ ఐడల్ షో షూటింగు నిర్వహిస్తే..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions