.
కత్తుల సమ్మయ్య… తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల ప్రస్థానంలో ఇదీ ఓ ముఖ్యమైన పేరు… పాజిటివ్ కాదు, నెగెటివ్… పోలీసులకు సహకరించి, నిద్రిస్తున్న తోటి నక్సలైట్లను చంపేసి, పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన కోవర్టు తను…
తనకు పాస్‌పోర్టు ఇచ్చి శ్రీలంక పంపించడం, అక్కడ తను విమాన ప్రమాదంలో మరణించడం ఎట్సెట్రా అప్పట్లో బాగా చర్చనీయాంశాలు… పోలీసులు ఇలాంటివి తెర వెనుక నుంచి, తామెక్కడా బయటపడకుండా చేస్తారు… కానీ కత్తుల సమ్మయ్య విషయంలో మాత్రం బహిరంగంగానే… తన వెనుక మేమే ఉన్నామన్నామని జనానికి చెబుతున్నట్టు ప్రవర్తించారు… అందుకే అది బాగా రచ్చయింది కూడా…
Ads
సీనియర్ పాత్రికేయుడు Satyanarayana Vemula పోస్టు ఓసారి చదవండి…
·
ఈ డీజీపీ వెరీ స్పెషల్… నాకు గుర్తు ఉన్నంత వరకు నా క్రైమ్ రిపోర్టింగ్ లో మొదటి డీజీపీ HJ దొర… తర్వాత ఎంతో మంది వచ్చారు…. అప్పట్లో నేను వెరీ స్మాల్… పేరుకి కంట్రిబ్యూటర్, చూసేది DGP బీట్… దొర గారికి నేను పెద్దగా తెలియదు…
ఆయన ఎపుడు శ్రీనివాస రెడ్డి అన్న… ఇషాకి అన్న లాంటి వాళ్ళకే లోనికి allow చేసేవారు… ఒకే ఒక సిరీస్ వార్తలు… నన్ను ప్రూవ్ చేసుకునే అవకాశం కల్పించాయి….అప్పట్లో కత్తుల సమ్మయ్య అనే మాజీ నక్సలైట్ ను పోలీసులు శ్రీలంక వెళ్లి బతకమని చెప్పారు…
అక్కడ సమ్మయ్య విమానం ల్యాండయే సమయంలో problem రావడంతో విమానం నుంచి కిందకు దూకి చనిపోయాడు… దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఓ ప్రెస్ నోట్ ఇచ్చింది…. దాని హెడ్డింగ్… sammayya is no more…
ఇదే నేను పట్టుకున్నా… ప్రముఖులు చనిపోయినపుడు NO more అంటారు… సమ్మయ్య పోలీసులకు అంత ముఖ్యమా అంటూ… పోలీస్ ప్రకటన చీల్చి చెండాడి ఆంధ్రభూమిలో వార్త రాసా… అది బ్యానర్… నా bye line వేముల సత్యనారాయణ అంటూ… మరునాడు అది చర్చ…
వెరీ next day మరో banner story ఇచ్చా… సమ్మయ్య భార్యకు అర్జెంట్ పాస్ పోర్ట్… కొలంబోకి ఎస్కార్ట్ అని… శ్రీలంక వెళ్లిన police officers pass port copy, visa… గగ్గోలు… దొర గారు చిందులు తొక్కారు… నా గురించి తెగ ఎంక్వైరీ చేశారు…. నో యూజ్ …
మరో బాంబు వేశా… సమ్మయ్య మృతదేహాన్ని శ్రీలంక నుంచి బేగంపేట airport కి తీసుకుని వచ్చారు… అప్పటికే నా గురించి సమ్మయ్య అనుచరులు వెదుకుతున్నారు… airport seen డిఫరెంట్ … మా photo graphar నాని నేను కలిసి కావలిసిన ఫోటో సేకరించి బయట పడ్డాం… next banner దుస్తుల మాటున పిస్తోళ్ళు…
ఇలా ఎన్నో అనుభవాలు… నిన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే… ‘‘మన సబ్జెక్ట్ కాదు… దాటిపోయాం’’ అని నవ్వుతూ చెప్పడం నచ్చింది… అంటే, అది ముగిసిన అధ్యాయం అని చెప్పడం…
(మొత్తానికి కత్తుల సమ్మయ్య ఆత్మ మన పోలీసుల్ని వదలడం లేదన్నమాట… నిజం చెప్పాలంటే ప్రస్తుతం పనిచేసే పోలీస్ అధికారుల్లో, ప్రముఖ జర్నలిస్టుల్లోనే చాలామందికి కత్తుల సమ్మయ్య కథ తెలియదు…)
Share this Article