Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవనపల్లి కవితకు తత్వం బోధపడిందా..? డాడీ దగ్గరకు పరుగు..!!

June 12, 2025 by M S R

.

నేను కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులూ కేసీయార్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు… అసలు తెలంగాణ ప్రథమశత్రువు కేసీయార్ కుటుంబమే… అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి…!

డాడీ కోపంతో ఉన్నా సరే, ఏదో ఝలక్కులు ఇద్దామని ట్రై చేసి, విఫలమై, తన ఒరిజినల్ బలమేమిటో తెలుసుకున్న కవిత… ధిక్కార పతాకాన్ని అర్జెంటుగా కిందకు దింపేసి, మళ్లీ ఫామ్ హౌజుకు వెళ్లి, ఏదో దూరాన్ని పూడ్చుకునేందుకు ప్రయత్నించింది… కేసీయార్ అస్సలు దేకలేదు…

Ads

ఈ రెండూ వేర్వేరు వార్తలు… ఆమె బీజేపీలోకి పోలేదు, పోదు… కాంగ్రెస్‌లోకి రేవంత్ ద్వారా పోవడానికీ ఏదో అడ్డొస్తోంది… సొంత పార్టీ పెట్టినా పెద్ద వర్కవుట్ అయ్యేట్టు లేదు… ప్లేటు మళ్లుతోంది… సీన్ మారుతోంది… మళ్లీ డాడీయే శరణ్యంగా కనిపిస్తున్నాడు…

.

కల్వకుంట్ల కవిత… అలియాస్ దేవనపల్లి కవిత..! తండ్రిని ధిక్కరించి, అన్న కేటీయార్‌కన్నా వారసత్వంలో నేనేం తక్కువ..? ఎందుకు తక్కువ..? అనే పంతానికి వెళ్లింది… డాడీకి ఝలక్ ఇవ్వాలని అనుకుంది…

సింపుల్… కేసీయార్ మొండి… తనకు అనుగ్రహం వచ్చినా తట్టుకోలేం, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేం… నరేంద్ర, విజయశాంతి, ఈటల… ఎందరిని చూడలేదు..? బిడ్డ అయితేనేం… గీత దాటింది… అందుకే పార్టీ కేడర్‌కు స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్…

ఆమెతో వెళ్లేపక్షంలో నన్ను మరిచిపొండి అని.,. ఏదో ఊహించుకున్న కవితకు రియాలిటీ అర్థం కాసాగింది… డాడీ గురించి తనకు తెలుసు, తనకు ఎవరూ ఝలక్ ఇవ్వలేరు, ఇచ్చినవాళ్లు సొంత బిడ్డయినా సరే ఇక దగ్గరకు రానివ్వడు అని… ఐనా ఓ ఝలక్ ఇవ్వాలని అనుకుంది… దెయ్యాలు, భూతాల భాష మాట్లాడింది…

ఒక్కడూ దగ్గరకొచ్చేవాడు లేడు… అబ్బే, నాన్నే నా దైవం అంటూ కాళేశ్వరం నోటీసుల మీద స్పందించి, ధర్నా చేసి మళ్లీ గ్యాప్ పూడ్చుకునే యత్నం… ఇంటికి వెళ్లింది భర్తతో సహా… అస్సలు పట్టించుకోలేదు ఆయన… అది తన తత్వం… బిడ్డయినా సరే, ఇంకెవరైనా సరే, కోపమొస్తే అంతే…

kavitha

ఎస్, ఆమెను పట్టించుకోలేదు… చాలామంది కార్యకర్తల్లాగే ఆమే వచ్చింది… అంతే… బీఆర్‌కేఆర్ భవన్ వైపు కూడా పోలేదు ఆమె… విషయం అర్థమైంది… మరిప్పుడు కింకర్తవ్యం..? ఆమెకే తెలియదు…

మరో భిన్నమైన వాదన… బిడ్డ అంటే ప్రేమ లేకపోతే, ఇప్పటికే నోటీసులు ఇచ్చి తరిమేసేవాడే కదా, ఈరోజుకూ నమస్తే తెలంగాణలో వార్తలు వస్తున్నాయి కదా అంటారా..? ఆమెను జైలు నుంచి తీసుకురావడానికి కేటీయార్, హరీష్‌లను బీజేపీతో సంప్రదింపులకు పంపించాడు కదా అంటారా..? అన్నీ నిజమే…

కానీ బీజేపీతో సంప్రదింపులు కేవలం ఆమెను జైలు నుంచి తీసుకురావడం కోసం మాత్రమే కాదు… మరి..?

kcr

వీలయితే బీజేపీతో ఓ అవగాహన, ఓ పొత్తు, ఓ సయోధ్య, ఓ విలీన ప్రతిపాదన… వార్తలు ఎన్నిరకాలైతేనేం..? ఏ బీజేపీని తను వంగదీసి, బజారులో నిలబెట్టాలని ఎమ్మెల్యేల కొనుగోలు రచ్చను క్రియేట్ చేశాడో అవి అట్టర్ ఫ్లాప్… అధికారం పోయింది… అన్నివైపులా కేసులు, విచారణల ఒత్తిడి…

దీనికితోడు బీజేపీ కూడా కన్నెర్ర చేస్తే కథ వేరే ఉంటుందని అర్థమైంది… ఒక దశలో నాన్ బీజేపీ పార్టీల మొత్తం ఎన్నికల ప్రచారఖర్చు భరిస్తానని బీరాలు పలికిన అహం, అతి అన్నీ నేల మీదకు దిగివచ్చాయి… అందుకే బీజేపీతో సయోధ్య కావాలి…

కవిత చెప్పింది కూడా అదే… బీజేపీలో విలీనం దాకా పోయాయి ఆలోచనలు అని… సరే, బీజేపీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓ దిక్కూదివాణం లేని పాలసీ కాబట్టి… ఇన్నేళ్లూ విశ్వాసరహితులైన తెలుగుదేశానికి తోకలాగా బతికాం, ఏపీలో ఇప్పుడూ మేం అంతే… కాస్తో కూస్తో తెలంగాణలో సొంత బలం మీద విశ్వాసం ఉంది, చాన్స్ ఉంది, ఐనా బీఆర్ఎస్ వంటి ఏమాత్రం నమ్మలేని పార్టీకి తోకగా మారి, పదే పదే మా బలాన్ని మేమే దెబ్బతీసుకోవాలా అనే కేడర్ అసంతృప్తి ఉంది…

అందుకే బీజేపీ ప్రస్తుతానికి కిమ్మనడం లేదు… ఇలాగే ఉంటుందనీ లేదు… చంద్రబాబును హత్తుకోలేదా మోడీ… ఏమో, తెలంగాణలోనూ..? అరె, అదెలా… కాంగ్రెస్‌కూ రేవంత్ రెడ్డికీ చెడితే… ఇంకేదో షిండే మార్క పాలిటిక్స్ ఊహిస్తున్నారు కదా అంటారా..?

ప్రస్తుతానికి రేవంత్‌ను మించి కాంగ్రెస్‌కూ దిక్కులేదు… వద్దనుకుంటే మళ్లీ అదే పాత ఉత్తముడు, అదే పాత జానారెడ్డి… ఫాఫం, మరోవైపు బీజేపీ… నాయకుల మధ్య తగాదాల్ని క్లోజ్ చేసి, ఓ మాంచి లీడర్‌ను ముందు పెట్టి సొంత కథ నడిపించాలనే ధ్యాస, ప్రయత్నం బీజేపీలో లేదు..!! తదుపరి సినిమా కాలం చూపించాల్సిందే..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions