Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తిలక్ వర్మ..! భేష్… కానీ సరిపోదు… ముందుంది అసలు పరీక్ష…!!

April 21, 2026 by M S R

.

తిలక్ వర్మ …  ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పటిలాగే పేలవ బ్యాటింగు స్టార్ట్ చేసింది… మూడు వికెట్లకు 44 పరుగులు… సూర్యకుమార్, హార్డిక్ పాండ్యాలు మళ్లీ ఫెయిల్… కానీ తిలక్ వర్మ మొదట 19 బంతుల్లో 22 రన్స్ మాత్రమే చేశాడు… ఇక మరో ఘోరపరాజయం ఈ జట్టుకు తప్పదు అనుకునే స్థితిలో తిలక్ వర్మ హఠాత్తుగా రెచ్చిపోయాడు… 23 బంతుల్లో 82 పరుగులు… ఏ బ్యాటరైనా కలలు గనే ఇన్నింగ్స్… సెంచరీ వచ్చింది…

ఈ దెబ్బకు ముంబై ఇండియన్స్ గెలవడమే కాదు… తిలక్ వర్మ బ్యాటింగు పుణ్యమాని, 99 పరుగుల తేడాతో గెలిచిన పుణ్యమాని పాయింట్స్ పట్టికలో కింద నుంచి నాలుగో ప్లేసుకు ఎగబాకారు… లేకపోతే ఇంకా చెన్నై జట్టుతో దిగువ స్థానాల్లో పోటీలో ఉండేది… (బంతిని చూసి కొట్టు అని నేను చెప్పాను, అదీ ఫలితం అని హార్డిక్ తరువాత మీడియాతో అన్నాడట తిలక్ వర్మ సెంచరీపై… హహహ… తన ఆటకు దిక్కులేదు గానీ, తిలక్ వర్మకు సలహాలిచ్చాడుట)

Ads

అనేక మ్యాచుల తరువాత బుమ్రాకు మళ్లీ వికెట్ దక్కింది… గుడ్, మళ్లీ ఫామ్‌లోకి వస్తే సరే… కానీ స్టిల్ ఆ జట్టు మీద క్రికెట్ ప్రేమికుల విశ్లేషణ, విమర్శ ఏమిటంటే..? ముంబై ఇండియన్స్ సీనియర్ ప్లేయర్లను బాగా డబ్బు పెట్టి కొన్నది గానీ… వాళ్లెవరూ ఆటను సీరియస్‌గా తీసుకోవడం లేదు… రిజర్వ్ బెంచులో ఉన్న జూనియర్లను బాగా వాడుకోవాల్సింది గానీ, దానిపైనా దృష్టి పెట్టడం లేదు అని…

నిజమే… వరుస ఓటముల తరువాత ముంబై అశ్విన్ కుమార్‌ను పట్టుకొచ్చింది… 4 వికెట్లు తీశాడు… అదీ గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ వెన్నువిరిచాడు… అందుకే ఆ ఘనవిజయం… ఇతర జట్లు కూడా ‘రిజర్వ్ ప్లేయర్లతో’ ప్రయోగాలు చేస్తున్నాయి, ఫలితాలు సాధిస్తున్నాయి కూడా… ఆడే అవకాశం వస్తే జూనియర్స్ కూడా ఓ తపనతో, ఓ కసితో ఆడుతున్నారు… అదీ తేడా…

ఇక ముంబై గాడిన పడినట్టేనా..? లేదు..! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాలే జట్టుకు నష్టదాయకం అవుతోందనే విశ్లేషణలు జోరుగా వస్తున్నాయి… తిలక్ వర్మకు ఈరోజు కలిసొచ్చింది… కానీ కన్సిస్టెన్సీ కావాలి… సరిగ్గా పార్టనర్‌షిప్ బిల్డ్ చేసే సహచరుడు కావాలి… తనొక్కడూ రాణించినా మిగతా బ్యాటర్ల పేలవమైన బ్యాటింగు జట్టుకు శాపంగానే ఉంది ఇంకా…

ఈ మ్యాచులో గుజరాత్ టీమ్ బ్యాటింగు, బౌలింగులో ఫెయిల్ కాబట్టి ముంబైకి కలిసొచ్చింది… రాబోయే మ్యాచులు ఇంత ఈజీ కాదు, పైగా అవే కీలకం కూడా…  కోల్‌కత్తా, లక్నో, చెన్నై, ముంబై… ఇప్పటికీ నాసిరకం ఆటలో పోటీలుపడుతున్నాయి… స్టిల్ పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్, బెంగుళూరు జట్లే టాప్-4 ప్లేసులో ఉన్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions