.
ఉగ్రవాదం… దేశం మీద యుద్ధం… ఇవి కేవలం బీజేపీ సమస్యలు కావు… దేశం సమస్యలు… మొత్తం భారతీయుల సమస్యలు… వాడు గనుక పైచేయి సాధిస్తే మనం ఏ దురవస్థల్లోకి పోవాల్సి ఉంటుందో ఒక్కసారి ఊహించండి…
కానీ మన దేశంలో మేధావులుగా, పాత్రికేయులుగా, చైతన్యవంతులుగా చెప్పుకోవబడే కొందరున్నారు… పేరుకు మాత్రమే… కీలకమైన యుద్ధ సందర్భంలో ఎంత సంయమనం పాటించాలో తెలియడం లేదు… తమ వికృత కోణాన్ని పదే పదే ఆవిష్కరిస్తున్నారు…
Ads
శత్రుదేశం దాడులను కూడా బీజేపీ కోణంలో చూస్తూ దేశం మీద విషాన్ని చిమ్ముతున్నారు… ది వైర్ సైటును బ్లాక్ చేయడం మీద ఓ గగ్గోలు… అదేమంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్… అది ఇచ్చింది ఎవరు మన రాజ్యాంగం… మరి వాడు మన దేశాన్ని కబళించే ప్రయత్నంలో ఉంటే… అత్యయిక పరిస్థితి అనధికారికంగా మన చుట్టూ అలుముకుని ఉంటే …
మన టోటల్ ఫ్రేడమే ప్రమాదంలో ఉంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనే మాటను పదే పదే వల్లెవేయడం, తమ నెగెటివ్ క్యాంపెయిన్‌ను జస్టిఫై చేసుకోవడం అన్యాయం కాదా..? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కు కూడా పరిమితులుంటయ్,.. ఉండాలి… ఎందుకంటే, ఇది యుద్ధం కాబట్టి..!
8000 ఎక్స్ ఖాతాల్ని స్థంభింపచేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఎక్స్ (పాత ట్విట్టర్)ను అడిగింది… తప్పదు అని చెప్పింది… లేకపోతే ఏమిటో వాడికీ తెలుసు కదా… ఏడుస్తూనే వాటిని నిలిపివేస్తున్నట్టు చెప్పింది ఎక్స్… అంతేకాదు, బాధ్యత లేకుండా ఏదిపడితే అది రాస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించింది… అవసరం…
Frontline ఎడిటర్ వైష్ణారాయ్ ఎక్స్‌లో ఎలాంటి చిల్లర పోస్టులు పెడుతుందో గమనిస్తున్నాం కదా… సరే, Raj Madiraju వాల్ మీద ఓ ఆసక్తికరమైన పోస్టు కనిపించింది… (కొంచెం పెద్ద పోస్టు.. ఓపికుంటే చదవండి..)
కొంతమంది మేధావులు చాలా మిస్-గైడెడ్ లక్ష్యాలు, ఆలోచనలతో పనిచేస్తారు.. వీళ్ళు వాడుకునే షీల్డ్ ఏంటి.. ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్..
ప్రవీణ్ సాహనీ అనే రిటర్డ్ మిలిటరీ (ఆర్మీలో అతనేం చేశాడో క్లియర్‌గా లేదు) ఆఫీసరు ఇప్పుడు జర్నలిస్టుగా మారి “ఫోర్స్” అన్న మేగజైన్ మొదలుపెట్టాడు.. కాశ్మీరు సపరేటిస్టు వాదనలను సటిల్‌గా సమర్ధించే ఘజలా వహబ్ అన్న మరో జర్నలిస్టుతో కలిసి..
ఈయన కొన్ని పుస్తకాలు, ఆర్టికిల్స్ రాశాడు, మరికొన్ని వీడియోలు తీశాడు..
అందులో ఒకటి.. “కాశ్మీరు ఎన్నికలు- ఒక ఫ్రాడు” అన్న పుస్తకం రాసిన నాజిర్ కమల్ అనే పాకిస్తానీ రైటరుతో కలిసి “ఇండియా, పాకిస్తాన్లమధ్య మిసైల్స్ ఇంపరేటివ్” అన్న ఒక మోనోలాగ్..
కొన్నాళ్ళక్రితం ఈయన ఒక పాకిస్తానీ చానెల్‌కి ఇచ్చిన ఇన్‌టర్‌వ్యూలో చాలా కేటగారికల్‌గా చెప్పాడు.. పాకిస్తాన్ ఇప్పటివరకూ ఇండియాతో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు అని..
మరో వీడియోలో పాకిస్తాను ఇండియాకి ఓవర్‌మ్యాచి అని.. అంటే మనకన్నా బలవంతులు అన్నది అతని అంచనా..
ఇహ చైనా అనగానే భయంతో వొణికిపోతూ యుద్ధమన్న మాట ఎత్తద్దని వాళ్ళను కొనియాడతాడు..
అతని ఇంటర్వ్యూలు, వీడియోల కింద చప్పట్లు కొట్టేది ఎక్కువమంది పాకిస్తానీయులే.. మిగిలిన కొద్దిమంది ఇండియన్లెవరనేది మీకూ దాదాపుగా తెలుసు..
ఆపరేషన్ సిందూర్ జరిగిన రాత్రి ఇండియా టుడేలో జర్నలిస్టు అన్న ఒక మాటను, పేరు తెలీని ఒక ఫ్రెంచి ఎక్స్‌పర్టు అన్న మరో మాటను పట్టుకుని, ఐయేయెఫ్ విమానాలు నాలుగింటిని పాకిస్తాను కూల్చేసిందన్న థియరీని సమర్ధిస్తూ ప్రవీణ్ సాహనీ ఒక పదకొండు నిముషాల వీడియో పోస్ట్ చేశాడు.. కొద్దిసేపటికి ఆ వీడియోని ఇండియన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది..
కారణం చెప్పలేదు.. చెప్పాల్సిన అవసరం కనబడలేదు.. ఏది సరైన ఇన్‌ఫర్మేషనో, ఏది మిస్-ఇన్‌ఫర్మేషనో సరిగ్గా తెలీకుండా ఎవరికి తోచిన వాదనలు, థియరీలు యుద్ధం మధ్యలో చెప్పుకుంటూ పోతే ఉత్పన్నమయ్యే కన్‌ఫ్యూజన్ గురించి ఈ సో-కాల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పర్టుకి కారణం కూడా చెప్పాలా.. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎరీనాలో..
అయితే సరిగ్గా ఇలాంటి అవకాశాల కోసం గోతికాడ నక్కలా కాచుక్కూర్చునే జర్నలిస్టు మరొకడున్నాడు.. కరణ్ థాపర్ అని, వైర్ మేగజైను.. ఇతని లీలలు ఇన్నని పేర్కొనలేము.. అసలితను ప్రశ్నలడిగే తీరులోనే నక్కతనం బయటపడుతూ ఉంటుంది..
మూడు రోజులక్రితం సీబీఇ వలలో చిక్కుకుని మోదీకి వ్యతిరేకంగా కడుపుమంట, అజీర్తితో విరుచుకుపడుతున్న సత్యపాల్ మాలిక్ అనే నాయకుడితో ఒక ఇంటర్‌వ్యూ చేశాడు థాపరు..
అందులో సత్యపాల్ “మోదీ సిగ్గులేనివాడని, ఇంకా అసభ్యమైన పదజాలంతో దూషిస్తూ రెండువారాలైనా ఇంకా పాకిస్తానుపై ఎటాక్ చేయకుండా పిరికివాడిలా దాక్కున్నాడని కాస్సేపు ఇద్దరూ కడుపు మంట చల్లార్చుకుని నవ్వుకున్నారు..
సరిగ్గా అదేరోజు రాత్రి ఆపరేషన్ సిందూర్ మొదలైంది.. క్షిపణి వీళ్ల మీదే పడ్డట్టుగా అనిపించిందేమో, సైలెంటయ్యారు..
అయితే లేటెస్టుగా ఈరోజు ప్రవీణ్ సాహనీ ఇందాక చెప్పుకున్న వీడియోని ప్రభుత్వం తీసేయగానే గుంటనక్క కరణ్ థాపర్ అర్జంటుగా అతన్ని పిలిచి చాలా బాధగా ఇంటర్వ్యూ చేశాడు.. ఎందుకిలా జరిగింది అని..
తన వీడియోలో చెప్పుకున్న థియరీలన్నీ మళ్ళీ చెప్పుకున్నాడు ప్రవీణ్ సాహనీ.. అది బైటికి రాగానే “వైర్” మేగజైను మరి పనిచేయుట మానేసింది….
ఇప్పుడు కామ్రేడ్లందరూ కలిసి ప్రభుత్వం బ్యాన్ చేసిందని, ఫ్రీడమ్మాఫెక్స్‌ప్రెషన్ అంటూ గగ్గోలు మోడ్‌లో ఉన్నారు..
బ్రదర్.. యుద్ధం జరుగుతోంది, ప్రభుత్వం ఒక స్ట్రాటజీతో పనిచేస్తుంది.. నీ చిట్టిబుర్రకు తట్టినవన్నీ నిజాలుగా భావించి రాస్తూ పోతే మన సైన్యాన్ని మనమే నిర్వీర్యం చేసినవాళ్లమవుతాం..
సో, కొన్నాళ్ళపాటు ఈ ప్రభుత్వం విడుదల చేసిన మాటలనే మీరూ చెబ్తూ వెళ్ళండి.. మీవల్ల అవట్లేదా, గుండె మూసుక్కూర్చోండి..
భయపడమనడం లేదు.. బాధ్యతపడమంటున్నాను.. నువ్వుంటోంది ఇండియా అని గుర్తించమంటున్నాను.. అంతే..
నీలాంటివాళ్ళ వీడియోలు చూసే పాపం ఆళ్ళ డిఫెన్స్ మినిస్టరు చూడు, “ఇట్సాలోవర్ సోషల్ మీడియా..” అంటున్నాడు.. తప్పు కదా..
ప్రధానమంత్రిని నిర్ద్వందంగా విమర్శించే ఒవైసీ ఎంత చక్కగా సమర్ధిస్తున్నాడు.. మీకేం పోయేకాలమొచ్చింది అని అడిగే లోపలే పోయిపారేశారు.. అదీ మ్యాటరు..
Share this Article