ఎప్పటిలాగే వినాయకచతుర్థికి రెండు టీవీలు స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేశాయి… జెమిని వాడికి టేస్ట్ లేదు, ఎప్పటిలాగే వదిలేశాడు… ఈటీవీకి జబర్దస్త్ ప్లస్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం ఉంది కదా… ఎప్పటిలాగే అలవోకగా ఓ స్పెషల్ షో చేసి ప్రసారం చేసేసింది… దాని పేరు ఊరిలో వినాయకుడు… కామెడీ స్టార్స్ టీం మాటీవీ వాడికి ఉంది కదా… సీరియళ్లలోని కొందరు నటుల్ని తీసుకుని, బిగ్‌బాస్ పాత మొహాల్ని కూడా తీసుకుని ‘పండగే పండగ’ అని ఓ షో చేశాడు… రెండు ప్రోగ్రామ్స్‌లోనూ ఒకటే రోగం… ఒక దాంట్లో బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్ ఓవరాక్షన్… అదే కామెడీ స్టార్స్ తరహాలో మోత ఎక్కువ, కామెడీ తక్కువ… ఈటీవీ స్పెషల్ తక్కువేమీ కాదు, ఒకవైపు రోజా జీవితచరిత్ర, మరోవైపు హైపర్ ఆది చరిత్ర… సరే, ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే… అయితే… జీటీవీ వాడు కూడా ఓ షో ప్రిపేర్ చేశాడు, కానీ మాటీవీ, ఈటీవీలతో పోటీ ఎందుకులే అనుకుని, ఆదివారానికి వాయిదా వేసుకున్నాడు… స్వామి వారి సంబురాలు తగ్గేదేలే అని ఓ పేరు పెట్టాడు, పాపం, ఆమధ్య ఫ్లాపయిన ఓ సింగింగ్ కంపిటీషన్ ప్రోగ్రాం ఉందిగా, ఒకరిద్దరు సింగర్లు, సీరియళ్లలో నటులు ప్లస్ శ్రీముఖి… ఏదోలే, రీలు చుట్టేశాడు, రెడీగా ఉన్నాడు…
ఒకప్పుడు సుడిగాలి సుధీర్‌ను ఈటీవీలోని ఓ పండగ స్పెషల్ నుంచే అవమానకరంగా తీసేశారు గుర్తుంది కదా… ఆ సుధీరే ఇప్పుడు ఈటీవీ స్పెషల్స్ లీడ్ చేస్తున్నాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తనే యాంకర్ కమ్ లీడర్… ఈసారి పండగ ప్రోగ్రాంను రష్మి, సుధీర్ కలిసి యాంకరింగ్ చేశారు… మాటీవీలో అదే అనసూయ… మధ్యలో ఆ బవిరిగడ్డం ఓహోంకార్ పెద్దరికం సరేసరి… (ఈ ప్రోగ్రాం ఎడిట్ చేసేవాళ్లు పదే పదే ఒకరిద్దరి మొహాల్నే ఫోకస్ చేస్తున్న తీరు కూడా చూసుకునే సోయిలేదు మాటీవీ క్రియేటివ్ టీమ్‌కు… అందుకే అంత భారీ రీచ్ ఉన్న ఆ టీవీ కూడా కామెడీ స్టార్స్ వంటి భారీ ఖర్చు ప్రోగ్రామ్స్‌ను సక్సెస్ చేసుకోలేకపోతోంది…) ఈసారి పండగ షోలో ఆకట్టుకున్నది షణ్ముఖప్రియ… మిగతాదంతా సోది… మరి ఈటీవీ స్పెషల్‌లో..? రష్మి-సుధీర్ లవ్ స్టోరీ తొమ్మిదో జయంతి… అదేనండీ వార్షికోత్సవం…
Ads
Sudheer & Rashmi Love Story – 9 Year’s of Journey | Oorilo Vinayakudu | ETV Vinayaka Chavithi Event పేరిట యూట్యూబులో సెర్చ్ చేస్తే దొరుకుతుంది… కానీ ప్రోమో మాత్రమే… నిజానికి అంతకుమించి షోలో కూడా ఇంకేమీ ఉండదు… ఎందుకు..? ఉండలేదు… ఆమె ఆల్రెడీ వివాహిత… సుధీర్ తమ్ముడికి పెళ్లిచేసి తను మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు… పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే ఇన్నేళ్లూ ఆగడు కదా… ఇప్పుడూ అదే చెప్పాడు, మేం ఒకరికొకరం బలంగా సపోర్ట్ చేసుకునే, అవ్యక్తమైన గాఢ స్నేహితులం అని..! గతంలో కూడా చెప్పాడు..! టీవీ ప్రేక్షకుల్ని ఎంటర్‌టెయిన్ చేయడం కోసం ఆ లవ్ ట్రాక్ అలా నడుస్తూ ఉంటుంది… ఎప్పటివరకు..? అదే ఇక్కడ ఆసక్తికరం…
టీవీల్లో జనానికి వినోదం పంచడం కోసం రకరకాల టవ్ ట్రాకుల్ని క్రియేట్ చేస్తుంటారు నిర్వాహకులు… కానీ రష్మి-సుధీర్ డిఫరెంట్ లవ్ స్టోరీ… 9 ఏళ్ల జర్నీలో… ఒకరికొకరు తోడుగా ఉండటమే కాదు, నాన్ స్టాప్‌గా నవ్విస్తున్నారు, కవ్విస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు లవ్ రెన్యువల్ అయిపోతూనే ఉంది… ఇన్నేళ్ల వాళ్ల లవ్ స్టోరీ నిజం కాదని తెలిసీ ప్రేక్షకులు ఆ కథను చూస్తూనే ఉన్నారు, నిజానికి ఎప్పుడూ బోర్ రాని ప్రేమకథ… ఇద్దరి వయస్సూ మీదపడుతోంది… ఐనా వాళ్ల కెమిస్ట్రీ కాస్త అబ్బురమే… రష్మి ఏమిటో సుధీర్‌కు మొత్తం తెలుసు… సుధీర్ ప్రయాణం మొత్తం రష్మికి తెలుసు… ఆ ఇద్దరి ‘స్నేహబంధం’ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు… ఐనా ఎప్పటికీ అది కొత్తకొత్తగా కనిపించే ఓ కల్పనాత్మక ప్రేమకథే… పండగ స్పెషల్‌లో ఈసారి డిఫరెంటుగా రష్మితో సుధీర్‌కు పలురకాల ప్రేమ గిఫ్టులు ఇప్పించారు, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నయ్… చిన్న ఎపిసోడే కావచ్చుగాక… కానీ తొమ్మిదేళ్ల వాళ్ల జర్నీని, బాండ్‌ను మళ్లీ ఫ్రెష్ అన్నట్టుగా ప్రజెంట్ చేశారు… బాగుంది…
చెప్పనేలేదు కదూ… కొంపకొచ్చిపోరో కోడె నాగ, కొంపముంచుతాందోయ్ ఈడు బాగ అంటూ దిగుదిగుదిగునాగ అనే ఓ కంట్రవర్సీ పాటకు పూర్ణ అండ్ టీం డాన్స్ చేయడం… ఆధ్యాత్మికాన్ని అశ్లీలం చేసేసిన ఆ థమన్ ప్లస్ అనంత శ్రీరామ్ ప్రయత్నంలాగే ఇదీ ఛండాలంగానే ఉంది…!! ఐనా ఈటీవీ వాడికి అశ్లీలం అంటే ఎంత అనురక్తో మళ్లీ కొత్తగా చెప్పనక్కర్లేదు కదా…!!
మరొక్క సంగతి… వర్ష అనే నటి చిన్నాచితకా పాత్రలతో మొదలెట్టింది… ఇంకో చటాక్ ఎక్కువ బరువు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉండే ఆమె మెల్లిమెల్లిగా కుదురుకుంది… ఈటీవీ రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిపోయింది, సీరియళ్లు సరేసరి… ఏదో టాస్క్ ఇవ్వగానే ఓ పిచ్చిదానిలా, బిచ్చగత్తెలా వేషం వేసుకుని, రోడ్ల మీద లవర్ కావాలంటూ తిరిగిన ఎపిసోడ్‌లో నిజంగా బాగా చేసింది… వెంట వెళ్లిన ఇమాన్ కూడా కాస్త వెలవెలబోయాడు గానీ వర్ష పర్‌ఫెక్ట్… రోహిణిలాగే వర్ష కూడా నాలుగు రోజులు టీవీల్లో నిలదొక్కుకున్నట్టే…!!
Share this Article