జబర్దస్త్ సరే, భ్రష్టుపట్టిపోయింది, చివరకు రేటింగ్సులో కూడా… ఢీ ఎప్పుడో నాశనం… కొత్తగా అంతన్నాడే ఇంతన్నాడే అన్నట్టుగా సుడిగాలి సుధీర్‌ను తీసుకొచ్చి ఇంకేదో కిట్టీ పార్టీ షో స్టార్ట్ చేశారు, దానికీ రేటింగ్స్ లేవు… సుమ అడ్డా గురించి చెప్పుకోవడమే దండుగ… ఫాఫం హేమిటి ఈటీవీ ఇలా తయారైంది చెప్మా, కనీసం ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలా ఉందో చూద్దామని ట్యూన్ చేస్తే…
బుక్కయిపోయా… మొనాటనీ… ఆ డైరెక్టర్లకు క్రియేటివిటీ అడుగంటినట్టుంది… కొత్తదనాన్ని ఇంజక్ట్ చేయాలనే సోయి కూడా పోయినట్టుంది… సరే, ఎన్నికల ప్రచారంలో తిరిగీ తిరిగీ, పవన్ కల్యాణ్‌ను, జనసేనను గెలిపించడంలో బిజీగా ఉన్నాడు కదా, కొంత రిలీఫ్ అనుకుంటే… ప్చ్, మరింత బోరింగు… ఆటో రాంప్రసాద్ ఒక్కడే హీరో అయిపోయాడు ఆ షోకు… తోడుగా ఫాఫం ఆ పొట్టి నరేష్…
నచ్చనిది ఏమిటంటే..? ఇన్నేళ్లయింది… రష్మి, సుధీర్ తమ మధ్య లవ్వూ కొవ్వూ ఏమీ లేవని లక్షన్నరసార్లు చెప్పారు… సుధీర్ కూడా బయటికి వెళ్లిపోయి ఎంచక్కా ఆహా ఓటీటీలో సర్కార్ షో ఇరగదీస్తున్నాడు… ఇదే ఈటీవీలో షో చేస్తున్నాడు, కానీ ఎక్కడా రష్మి అనే ప్రస్తావనే రాదు… తన ప్లేబాయ్ తరహా జోకులతో నడిపించేస్తున్నాడు… కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అక్కడెక్కడో భూతకాలంలోనే ఆగిపోయినట్టుంది… చూసీ చూసీ ప్రేక్షకులకు బోర్ వచ్చింది కదా… అదెప్పుడో కాలం చెల్లిన లవ్ ట్రాక్ గురూ… ఆ రేంజులో మరో జంటను చూపించలేక, చివరకు అదే అదే పట్టుకుని వేలాడుతున్నట్టున్నారు…
Ads
మళ్లీ అదే రష్మి, సుధీర్ లవ్ ట్రాకు ప్రస్తావన, అదైనా కాస్త కొత్తగా పేలిందా..? లేదు, నూకరాజుతో ఏదో అనిపించారు గానీ తుస్సుమంది… తోక పటాకులాగా…! మంచి కామెడీ, ఎనర్జీ ఉండే ఫైమాను కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు… అక్కడ ఫ్యామిలీ స్టార్స్‌లో రియాజ్, ఇక్కడ పొట్టి నరేష్… అంతగా జనం ఎంటర్టెయిన్ అవుతున్నారని అనుకుంటున్నారేమో ఫాఫం… రాంప్రసాద్ స్వయంగా యాక్ట్ చేసిన ‘కర్మ-ఖర్మ’ ఎపిసోడ్ కూడా అర్థరహితంగా ఉంది…
ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చివరలో కొత్త ప్రోమో ఒకటి వదిలారు… వచ్చేశాడు, మళ్లీ ఆది వచ్చేశాడు,.. అవే పాత జోకులు, అదే పొట్టి నరేష్‌తో మురికి జోకులు… రోహిణి సరే, కానీ ఆమె కామెడీ టైమింగ్ ఏమైనా వాడుకుంటున్నారా సరిగ్గా అంటే, అదీ లేదు…
బుల్లెట్ భాస్కర్, రాకెట్ రాఘవ, నా పెట్టే తాళం సత్యశ్రీ, రోహిణి, ఫైమా, నూకరాజు వంటి ఆర్టిస్టులను పెట్టుకుని సరిగ్గా ఓ ఎపిసోడ్ చేయకపోవడం విచిత్రమే… ఇమాన్యుయేల్, వర్ష, శాంతి స్వరూప్ వంటి ఆర్టిస్టులు ఎందుకో ఈమధ్య కనిపించడం లేదు… కొంచెం నయం ఏమిటంటే… పండు డాన్స్ పాట ఒకటి ఉంది… రానుంది… పోనీ, ఈటీవీ ఇలా తయారైంది… మరి మస్తు డబ్బు పెట్టగల స్టార్‌మా..? అదీ ఈటీవీని చూసి వాతలు పెట్టుకుంటోంది… కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గరల్స్ షో ఆ బాపతే..!!
Share this Article