జయసుధ ఏదో క్లారిటీ ఇచ్చింది… ఐననూ ఏదో అస్పష్టత… ఏదో సందేహం… విషయంలోకి వెళ్తే… జయసుధ వయస్సు 64 ఏళ్లు… ఆమె మొదటి వివాహం నిర్మాత వడ్డే రమేష్ బావమరిది కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌తో జరిగింది… కానీ అది ఎన్నాళ్లో సాగలేదు… తరువాత ఆమె రెండో వివాహం జితేంద్ర కజిన్ నితిన్ కపూర్‌తో 1985లో జరిగింది… ఇద్దరు పిల్లలు…
ఆయన 2017లో మరణించాడు… ఆమె నట, రాజకీయ జీవితాలను పక్కన పెడితే… అప్పటి నుంచీ ఒంటరిగానే ఉంటున్న జయసుధ కొన్నేళ్ల క్రితం క్రిస్టియానిటీలోకి మారింది… తరువాత అస్వస్థతకు గురై అమెరికా వెళ్లి ఏదో చికిత్సను పొంది వచ్చింది… ఈమధ్య బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు ఆమె పాత జయసుధలాగే కనిపించింది… సో, ఆల్ ఈజ్ వెల్…
ఈమధ్య కొన్నాళ్లుగా ఓ విదేశీయుడితో కనిపిస్తోంది… రహస్యం ఏమీ లేదు… ఆమెతోపాటు పలు సినిమా ఫంక్షన్లకు కూడా హాజరయ్యాడు… అతనెవరో ఆమె ఎవరికీ చెప్పలేదు… చెప్పాల్సిన పని లేదని అనుకుందేమో బహుశా… అంత క్లోజ్‌గా ఆమెతో తిరుగుతున్న తీరు చూసి సహజంగానే సోషల్ మీడియా కన్నుపడింది… ఆమె మూడో పెళ్లి చేసుకుందనీ, పెళ్లి కోసమే అమెరికా వెళ్లిందనీ రాసిపారేసింది… ఈ విదేశీయుడు ఓ అమెరికన్ అనీ తేల్చేసింది…
Ads
ఇక జయసుధకు తప్పలేదు… అయ్యా, బాబూ, మూడో పెళ్లి కాదు, అంత సీనేమీ లేదు, ఆయన నా బయోపిక్ తీస్తున్నాడు, పేరు Philip Rules, ఇక్కడ నా పట్ల జనం ప్రవర్తించే తీరు, కనబరిచే అభిమానం స్వయంగా చూడాలని ఇక్కడికి వచ్చాడు, నాతో తిరుగుతున్నాడు అని చెప్పింది… ప్చ్, నమ్మబుల్‌గా లేదు… అది నిజమైనా సరే, సందేహం తీరేలా లేదు… ఎందుకంటే..?
ఆమె అతనితో దిగిన ఫోటోలు, ఆ ఇంటిమసీ, కలిసి తిరుగుతున్న తీరు… తన బయోపిక్ తీసే అమెరికన్ నిర్మాతలా లేడు ఆయన… ఆమెతో జనం వ్యవహరించే తీరు, కనబరిచే అభిమానం చూడటానికి ఓ విదేశీ నిర్మాత స్వయంగా ఆమెతోపాటు రావడం ఏమిటి..? ఐనా జయసుధ బయోపిక్ తీస్తే గీస్తే తెలుగు దర్శకులు ఎవరైనా తీయాలి, తీస్తేనే అందులో ఆమె జీవితం సమగ్రంగా, సరిగ్గా ఆవిష్కరించబడుతుంది… ఒకవేళ బయోపికే నిజమైతే ఇప్పటివరకూ ఆమె ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు… అందులో రహస్యమేముంది దాచిపెట్టుకోవడానికి..? ఆమె చెప్పిందే నిజమైతే బయోపిక్ రచయిత ఆమెతోపాటు వస్తాడు గానీ నిర్మాత ఎందుకొస్తాడు..?
మరో వెర్షన్ ఏమిటంటే… ఆమె క్రిస్టియానిటీలోకి మారడానికి దారితీసిన పరిస్థితులపై ఏదో ఫిలిమ్ తీస్తున్నాడని..! అలాంటప్పుడు అది బయోపిక్ ఎందుకు అవుతుంది..? ఆమె క్రిస్టియాన్‌గా మారడానికి కారణాలను గనుక ఏదో స్పిరిచువల్ ఫిలిమ్ గనుక తీసే పక్షంలో ఆమెతోపాటు అమెరికా నుంచి వచ్చి, ఇక్కడ ఆమెతో కలిసి తిరగాలా..? ఆమె చెప్పిందే నిజమే అయినా సరే, అది సందేహాలు తీర్చేలా లేదు… మూడో పెళ్లే అయి ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు కదా… ఎలాగూ ఒంటరిగా ఉంది… ఏమో… ఓ మిస్టరీ..!!
Share this Article