ఆంధ్రజ్యోతి వాడేమంటున్నాడు… జగన్ లోకేష్‌ను కూడా వదిలిపెట్టేట్టు లేడు… తనను కూడా అరెస్టు చేస్తాడు, ఇప్పట్లో చంద్రబాబును బయటికి రానివ్వడు… సో, ఇక తప్పనిసరై బ్రాహ్మణిని రంగంలోకి దింపుతారు… ఇదీ తన వార్తల సారాంశం… ఏమాటకామాట… ఆమె హెరిటేజ్ మీద పెడుతున్న శ్రద్ధను రాజకీయాల్లో పెడితే తప్పకుండా క్లిక్కవుతుంది… గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంది, ఎక్స్‌ప్రెషన్ కెపాసిటీ ఉంది… కుటుంబ నేపథ్యమూ ఉపయోగపడుతుంది… అయితే చంద్రబాబు కూర్చోవాల్సిన కుర్చీలో మొన్న బాలయ్య కూర్చుని పార్టీ శ్రేణులకు ఏదో ఉద్బోధ గావిస్తున్నట్టు ఫోటో, వార్త కనిపించింది…
నో, నో, ఎందుకోగానీ రాధాకృష్ణకు బాలయ్య అంటే అస్సలు గిట్టదు అదేమిటో మరి… అఫ్‌కోర్స్, బాలయ్యకూ ఆ ఎబిలిటీ లేదు… తన మాటలు వెనక్కి తిరిగి వింటే తనకే అర్థం కావేమో… ఐనా ఆయనే సక్కగుంటే చంద్రబాబు బావకు టీడీపీ పగ్గాలు ఎలా వచ్చేవి..? వోకే, బ్రాహ్మణియే కరెక్టు అనుకుందాం… ఇక పదండి మరికొన్ని నిజాల్లోకి… మొన్నటిదాకా అందరూ చర్చించుకున్నది ఏమిటి..? జగన్ గనుక బెయిల్ రద్దయి మళ్లీ జైలుకు పోతే ఎవరు ఆపద్ధర్మ సీఎం… అపద్ధర్మ సీఎం వంటి చాన్స్ ఏమీ ఉండదు, సీఎమ్మే… భారతీరెడ్డి సీఎం పగ్గాలు తీసుకుంటుందని రాసిన ఆంధ్రజ్యోతి మరి విజయమ్మ మాటేమిటి..? అసలు ఈ కోణంలో షర్మిలకూ జగన్‌కూ పడటం లేదని కూడా రాసిపడేశాడు…
తెలంగాణకు వద్దాం… కేసీయార్ జాతీయంలోకి వెళ్లిపోయి చక్రాలు తిప్పే పని చేపడితే ఇక్కడ కేటీయార్ సీఎం… మరీ కాదంటే కవిత… నో, నో, నాట్ హరీష్, నాటెటాల్ సంతోష్… అవసరమైతే హిమాంశు… అంతేతప్ప అన్యులెవరికీ చాన్స్ లేదు, ఉండదు, ఉండకూడదు కుటుంబ పార్టీల సంప్రదాయం ప్రకారం… స్టాలిన్‌కు ఏమైనా అయితే సనాతన ధర్మ ఖండనుడు ఉదయనిధే సీఎం… నో, నో, చివరకు కనిమొళిని కూడా కానివ్వరు… ఎందుకూ అనడక్కండి, అదంతే…
Ads
దేవెగౌడ తరువాత కుమారస్వామి… అది కర్నాటకం… మహారాష్ట్రకు వెళ్దాం… పవార్‌కు ఏమైనా అయితే తప్పకుండా సుప్రియా సూలే వారసురాలు… పార్టీ పగ్గాలు ఆమెవే… నెవర్ అజిత్ పవార్‌ను కానివ్వరు… ఠాక్రే తరువాత ఉద్ధవ్ ఠాక్రే… తనకేమైనా అయితే ఆదిత్య ఠాక్రే రెడీ… ఆల్‌రెడీ శివసేన రాజకీయాల్లో వేళ్లు, కాళ్లు పెట్టేశాడు కూడా… అంతదాకా దేనికి..? నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్… వాళ్లవే కాంగ్రెస్ పగ్గాలు… రాహుల్ కాడి కింద పడేస్తే (పడేయడు, పడేయటానికి మన సొసైటీ అంగీకరించదు, చేతగాకపోయినా మోస్తూనే ఉండాలి…) ప్రియాంక కొడుకు రెహాన్ రెడీ కావల్సిందే…
ఇలాగే దిగువ నుంచి కశ్మీర్ దాకా వెళ్తే… ప్రతిచోటా ఇదే తంతు… ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీ, పీడీపీ… ఏ పార్టీ ఐనా ఇంతే… లెఫ్ట్, రైట్ జాతీయ పార్టీలు మినహా… ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే… ఆ కుటుంబం చేతుల్లోనే ఆయా పార్టీల పగ్గాలు, పదవులు, పార్టీల ఆస్తులు… కార్యకర్తల సంపద కూడా…! వేరే వాళ్లను రానివ్వరు, సెకండ్ కేడర్ ఎదగనివ్వరు… తెలంగాణలో అనేకచోట్ల ఇప్పుడు ప్రజాప్రతినిధుల వారసులు రెడీ అయిపోయారు… అవసరమైతే రెబల్స్‌గా మారి, పార్టీలు జంపి, బరిలో నిలబడతారుట…
ఈ ట్రెండ్ ప్రతిచోటా ఉంది… సో, ఈ ట్రెండ్ ప్రకారం బ్రాహ్మణి అర్హురాలు… కాదు, కాదు, ఆమె మాత్రమే అర్హురాలు… కనుచూపు మేరలే ఎవరూ లేరు… ఉండనివ్వరు… రేప్పొద్దున జగన్ అల్లుడెవరో వస్తే, అర్జెంటుగా హిమాంశు ఎదిగి నేనూ రెడీ అని సిద్ధపడిపోతే, బ్రాహ్మణి కాదంటే దేవాంశు… వీళ్లంతా ఎవరు..? రాజుకేమైనా అయితే రాచకుమారుడు లేదా రాచకుమార్తె… పెళ్లయితే అల్లుడు మరీ కాదంటే మనుమడు లేదంటే మనుమరాలు… రాచరికాలు పోయాయని ఎవరన్నారు..? నిక్షేపంగా కొనసాగుతూ ఉంటే..!!
Share this Article