Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాళ్ల మీద రాళ్లు… తిరుమల కాలిబాటలో ఓ విశేషమైన మొక్కు…

April 28, 2025 by M S R

.

తిరుమల కొండల్లో ప్రత్యేకించి నడక మార్గంలో భక్తులు రాళ్ళ మీద రాళ్ళు పెట్టడం ఎప్పుడు మొదలయ్యిందో! అదొక ఆచారంగా మారడానికి ప్రమాణాలేమిటో! తెలియదు. కానీ… అలా “రాళ్ళమీద రాళ్ళు పేరిస్తే… ఇల్లు మీద ఇల్లు కడతారు” అన్న నమ్మకం దశాబ్దాలుగా ఉంది.

అదే దారిలో కొన్ని వందలసార్లు నడిచి తిరుమల కొండల్లో అణువణువును తన పదాల్లో ఒక చిత్రంగా, దృశ్యంగా, చరిత్ర డాక్యుమెంట్ గా రికార్డ్ చేసిన అన్నమయ్య ఈ రాళ్ళ మీద రాళ్ళు పేర్చడాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు కాబట్టి… అప్పటికి ఈ నమ్మకం ఉన్నట్లు లేదు. తిరుమల పురాణాల్లో కూడా ఎక్కడా ఈ విషయం లేదు.

Ads

కాలాన్ని బట్టి ధర్మం మారినట్లే… భక్తుల అవసరాలు, కోరికలు, డిమాండ్లను బట్టి నమ్మకాలు కూడా మారుతుంటాయి. పెరుగుతుంటాయి. కోట్లమందికి సొంత ఇల్లు ఒక కల. ఎవరిని అడిగితే ఇంకెవరి ముందూ చేయి చాచాల్సిన అవసరం రాదో… అలాంటి దేవదేవుడి ముందే చేయిచాచి అడుక్కో! నీ ఏడుపేదో ఈ పాడులోకం ముందు ఎందుకేడుస్తావు? ఆ దేవుడిముందే ఏడు- ఆయనే నీ తాపత్రయాలను తీరుస్తాడు- అన్నది భక్తిలో పరమ ప్రామాణికమైన సిద్ధాంతం.

అలా స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు దాటి వంద వైపు పరుగులు పెడుతున్న వికసిత భారత్ లో నిలువ నీడలేనివారు కోట్లల్లో ఉంటారు. అందరికీ ఇళ్ళ హామీని ప్రతి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి పార్టీ పెడుతూనే ఉంటుంది. ప్రతి ఏటా ప్రతి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లక్షల్లో, కోట్లల్లో పెరుగుతూనే ఉంటారు.

తిరుమల కొండల్లో రాళ్ళమీద రాళ్ళు పేర్చినవారిలో ఎందరు ఇళ్ళమీద ఇళ్ళు కట్టారో! టీటీడి దగ్గర లెక్కలు ఉండకపోవచ్చు. అలా వారి కోరిక నెరవేరి ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది?

tirumala

“… గగనపు పుణ్యలోకాలు నీ దరిమేడలు;
మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా…”
అని మన సాధారణ మాంసనేత్రాలతో చూడలేని తిరుమల కొండల్లో కొలువైన పుణ్యలోకాల మేడలను, చెట్లల్లో మునులను అన్నమయ్య చూడగలిగాడు. మనకు ఆ దర్శనం చేయించాడు.

ఆ కోణంలో పుణ్యలోకాల మేడల మధ్య కలల మేడలు రాళ్ళమీద రాళ్ళతో కట్టినా పుణ్యమేనేమో! ఆ చెట్లలో దాగిన మునుల ముందు మన కలలను పేర్చితే నిజంగానే వాటిని నెరవేర్చే బాధ్యతను ఆ మునులు తీసుకుంటున్నారేమో!

“పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః”

భక్తితో ఆకు, పువ్వు, పండు, నీళ్ళు… ఏమిచ్చినా తీసుకుంటాను. వాటికి ప్రతిఫలమిస్తాను- అని సాక్షాత్తు భగవంతుడే స్పష్టంగా ఆన్ రికార్డ్ బహిరంగంగా చెప్పాడు.

ఇక్కడ భక్తులు భక్తితో నాలుగు రాళ్ళిస్తున్నారు- దేవుడు తమ ఇంటి పునాదికి నాలుగు రాళ్ళు వేయకపోతాడా! అని.

దేవుడితో మనదెప్పుడూ సప్లై డిమాండ్ వ్యాపారమే కదా! లిటరల్ గా దేవుడికి నాలుగు రాళ్ళిచ్చి… నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనే మన ఆర్తిలోనుండి ఈ నమ్మకం ఒక ఆచారంగా మారినట్లుంది! (హిమాలయాల్లో దూద్ కాశి ప్రాంతంలో కూడా ఈ రాళ్ల మీద రాళ్లు పేర్చడమనే మొక్కులు ఉన్నట్టుంది…)

-పమిడికాల్వ మధుసూదన్
998909018

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
  • ఓడలు బళ్లు – బళ్లు ఓడలు … వెస్టిండీస్ – బంగ్లాదేశ్ మంచి ఉదాహరణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions