Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెంపుడు రాళ్లు..! ఒంటరితనంలో అవే స్నేహితులు, చుట్టాలు, పిల్లలు…!!

May 15, 2024 by M S R

ఆమెకు బాగా కోపం వచ్చింది… పని ఒత్తిడి, బాస్ వేధింపులు, తన అసహాయత… ఇంటికి వచ్చాక తన బాస్ ఫోటోను పెద్ద సైజులో ప్రింటవుట్ తీసి, గోడకు అతికించి, చెప్పుతో ఎడాపెడా కొట్టింది… దూరం నుంచి సూదులు విసిరింది… తరువాత చింపి స్టవ్వుపై పెట్టి కాల్చేసింది… కాస్త రిలాక్స్… బెడ్ మీదకు వెళ్లి నిశ్చింతగా పడుకుంది…

ఫోటోను కొడితే ఏమొస్తుంది..? బాస్‌కు ఏమీ తగలవు… కానీ అది మెంటల్‌గా ఓ రిలీఫ్… బాధను, కోపాన్ని, అసహాయతను, కన్నీళ్లను బయటికి తరిమేయడానికి ఓ ఎగ్జాస్ట్… ఇక్కడ ఫోటోకు ఓ నిర్జీవ పదార్థం… దానికి యానిమల్ తాలూకు ఎమోషన్స్ ఏముంటాయ్ అనే లాజిక్కులు కుదరవు…

చాలామంది తమ వేదనను పంచుకోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి ఇష్టులైన వారి ఫోటోలతో, తమకిష్టమైన ఏవైనా వస్తువులతో… ఏదీ దొరక్కపోతే గోడకో చెప్పుకుంటారు… ఆ వస్తువును హత్తుకుంటారు… అదీ అంతే… జస్ట్, ఇవి ఉదాహరణలు… నిజానికి ప్రపంచంలో ఇప్పుడు పెద్ద వ్యాధి ఒంటరితనం… తద్వారా ఏ ఏమోషన్‌నూ బయటకు తరిమేయలేని, పంచుకోలేని ఓ శూన్యత…

Ads

కారణాలు అనేకం కావచ్చు… ఎవరూ లేకపోవడం, ఒక్కరే ఉండాల్సి రావడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఓ సమస్య… చాలామంది పెట్స్ మీద అపరిమితమైన ప్రేమల్ని పెంచుకుంటారు.., కష్టాన్ని, సుఖాన్ని, ప్రతి ఉద్వేగాన్ని చెప్పుకుంటారు… అదొక స్వాంతన… Harvard Graduate Scholl of Education గత ఏడాది నిర్వహించిన ఓ సర్వేలో మూడింట ఒకవంతు అమెరికన్లు, ప్రత్యేకించి 18-25 వయస్సున్నవాళ్లు తరచూ ఒంటరితనంలోకి జారిపోతున్నారు…

నిజంగా సమస్యే… నవ్వుతూ, తుళ్లుతూ, ఆనందంగా గడపాల్సిన ఏజ్ అది… ఐనా మానసికంగా ఒంటరితనం… నిజానికి అమెరికా ఒక్కటే కాదు, ప్రపంచమంతా ఉన్నదే… ఒంటరితనాన్ని బ్రేక్ చేసుకోవడానికి నానా మార్గాలూ ఆశ్రయిస్తుంటారు… మరీ న్యూక్లియర్ కుటుంబాలు వచ్చాక మానసికంగా ఓదార్చే, వెన్నుతట్టే చేతులు, మాటలు కరువైన స్థితి… ఓ లెక్కన భారతీయ కుటుంబం ఈవిషయంలో చాలావరకూ లక్కీ…

అవసరానికో, ఆత్మీయతకో ఎవరో ఒకరు తోడుంటారు… తనకు ఓ కుటుంబం బాసటగా ఉందనే ఫీలింగే పెద్ద భరోసా… తాజాగా South China Morning Post ఓ వార్తను ప్రచురించింది… నమ్మబుద్ధి కాలేదు మొదట… కానీ నిజమేనట… దక్షిణ కొరియాలో అనేకులు రంగురంగుల రాళ్లను ఏరుకొచ్చి, వాటిని పెట్స్‌గా మార్చుకుంటున్నారు… అవే వాళ్లకు స్నేహితులు, బంధువులు…

stones

ఆమె పేరు లీ… 30 ఏళ్లు… ఫార్మస్యూటికల్ రీసెర్చర్… ఓ అందమైన రాయిని తెచ్చుకుంది ఎక్కడి నుంచో… తను  ఒంటరిది… ఆ రాయినే బాలికగా భావించి, దానిపై కృత్రిమంగా కళ్లు పెట్టింది… పాత తువ్వాలతో ఓ దుప్పటి కుట్టి, చుట్టూ కట్టింది… అలిసిపోయినప్పుడు, కోపమొచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు ఆ ‘బాలిక’తోనే  చెప్పుకుంటుంది… వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెప్పుకుంది తన ఫీలింగ్స్‌ను…

సియోల్‌లో నివసించే ఓ 33 ఏళ్ల కొరియన్ మహిళ కూడా ఓ రాయికి “Bang-bang-i” అని పేరు పెట్టుకుంది… (అంటే కొరియన్ భాషలో ఆనందంలోకి మునకేయడం)… అది తన జీవితంలోకి వచ్చాక ప్రశాంతతను ఇచ్చిందట… సరే, అది మానసికంగా తన ఫీలింగ్… ‘ఇది రాయే కావచ్చుగాక, కానీ ఎన్నేళ్లుగా ఎంత కఠినమైన వాతావరణాన్ని, శిథిలీకరణను అనుభవిస్తే ఆ చిన్నటి, నునుపైన రాయిగా మారిందో కదా… మనమెంత..?’ అంటోంది ఆమె…

ఇవన్నీ మనకు అబ్సర్డ్‌గా కనిపించవచ్చుగాక… కానీ వాటిని ప్రేమించేవాళ్లకు అది ఆనందం, అదొక మెంటల్ కంపానియన్‌షిప్… ఆమె ఆ రాయిని ఎప్పుడూ తన జేబులో ఉంచుకుని తిరుగుతూ ఉంటుంది… తనతోపాటుగా ఎప్పుడూ ఎవరో ఉన్నట్టు భావన తనకు… ఈ వార్త దిగువన బోలెడు మంది తామూ ఈ మార్గాన్ని అనుసరిస్తున్నామని తమ అనుభవాలు షేర్ చేసుకున్నారు కామెంట్లుగా… అంతేకాదు, చాలామంది కొత్తగా ఈ మార్గం వైపు మళ్లుతున్నారట… శుభం..! కొన్ని తర్కానికి, లోతైన హేతువిశ్లేషణలకూ లొంగవు… ఈ పెట్ స్టోన్స్ కథలాగే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions