Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆటో అనే పేరెలా వచ్చిందో తెలుసా..? వినదగునెవ్వరు చెప్పిన…!

August 4, 2026 by M S R

.

అప్పుడప్పుడే తెల్లవారుతోంది… రైలు స్టేషన్ సమీపిస్తోంది… హడావుడిగా పెట్టేబేడా సర్దేశాను… బయటికి వచ్చాను, గతంలోలాగా లేదు, ఆటోల సందడి బాగా తగ్గింది… మా లోకేషన్ పేరు అడిగి ముగ్గురు ఆటోవాళ్లు అటువైపు రాలేం అనేశారు… ఒకతన్ని ఎక్కడో, ఎప్పుడో చూసినట్టనిపిస్తోంది… రండి సార్ అన్నాడు…

మా ఇల్లు దూరమే… మాట కలిపాను… రాత్రి గిరాకీ చూసుకుంటాను సార్ ఎక్కువగా… ట్రాఫిక్ చికాకులు తక్కువ, సిగ్నల్స్ బాధలుండవ్, వేగంగా వెళ్లిపోవచ్చు, రేటు ఎక్కువ, పొల్యూషన్ బాధ తక్కువ… పగలు పడుకోవడమే… తను చెబుతూ పోతున్నాడు…

Ads

ఐనా ఊబర్, ఓలా కాల్ ట్యాక్సీలు వచ్చాక మీ ఆటోల డిమాండ్ ఏమీ పడిపోలేదా..? ఇవి క్రమేపీ ఇక కనుమరుగై పోతాయా..? ఆ భయమేమీ లేదా..?

అస్సలు లేదు సార్, సదరు ఊబర్‌లు, ఓలాలు కూడా తమ సర్వీసులో ఆటోలను కూడా చేర్చారు కదా… అదీ ఆటోలంటే… కాకపోతే మావాళ్లే చాలామంది లోన్లు తీసుకుని, కార్లు కొనుక్కుని, ఆ కంపెనీలకు పెట్టేసి, ఈఎంఐలు చెల్లిస్తూ ‘‘ఓనర్ షిప్’’ ఎంజాయ్ చేస్తున్నారు…

మంచిదే కదా… ఆటోల్ని కిరాయికి తెచ్చి, రోజంతా కష్టపడి, ఆ అద్దెకే సగం ధారబోసే చాకిరీకన్నా సొంత కారు అనే ఫీల్ బాగుంటుంది కదా…

మంచిదీ, చెడ్డదీ అని ఏమీ ఉండదు సార్… ఈ ధోరణి కొన్నాళ్లు… కానీ ఆటోల మనుగడకు ఎప్పుడూ ఢోకా ఉండదు సార్… ఇప్పటికీ పేదవాడి వాహనం ఇదే… కాకపోతే రూపం మార్చుకోవచ్చు… అసలు నానోకారుకు స్పూర్తి ఆటోయే కదా… అంటూనే టాపిక్ హఠాత్తుగా డైవర్ట్ చేసేసి… అవునూ, మీకు ఆటో అనే పేరెందుకు వచ్చిందో తెలుసా సార్…

కాసేపు బుర్ర గోక్కుని… ఊహూఁ… ఏమీ తట్టడం లేదు… ఇంతకీ ఎలా వచ్చింది ఆ పేరు అనడిగాను… బాగా చదువుకున్నాడిలా ఉన్నాడు… చెప్పాడు… ఆశ్చర్యం అనిపించింది… ఆటోమొబైల్ తాలూకు పదాలకు సంబంధించిందేమో అనుకున్నాను లోలోపల… కానీ… కాదుట…!

బ్రిటిష్ కాలంలో… సెంట్రల్ మెడికల్ డిపోల నుంచి అన్ని హాస్పిటళ్లకూ మందుల్ని తోపుడు బండ్లలో లేదా సైకిల్ రిక్షాల్లో తీసుకుపోయేవారు… ఆ రిక్షాల్లోనే సరుకు తరలించేవి వేరే ఉంటాయి…

జలంధర్‌కు చెందిన ఓ సర్దార్‌జీ తమ పంటచేల దగ్గర నీటిని తోడటానికి వాడే ఓ పాత మోటార్ తీసుకొచ్చి, ఓ పాత సైకిల్ రిక్షాకు తగిలించాడు… కొన్ని క్రియేటివ్ మార్పులు చేయించాడు… ఇంకేముంది..? తొక్కాల్సిన పనిలేదు, వేగం ప్లస్ సౌకర్యం… ఎక్కువ లోడ్ తీసుకుపోవడం స్టార్టయింది…

ఓ బ్రిటిష్ అధికారికి ఈ ప్రయోగం భలే నచ్చేసి, కొన్ని కొత్త రిక్షాలకు కొత్త మోటార్లు తగిలించి, అన్ని హాస్పిటళ్లకూ వాటిల్లోనే మందుల్ని పంపించడం స్టార్ట్ చేశాడు… తనే పేరు పెట్టాడు… “An Urgent Transport Option”… దాని షార్ట్ ఫారమే ఆటో…

తరువాత వాణిజ్య ఉత్పత్తి మొదలైంది… ప్రయాణికుల ఆటోలు కూడా వచ్చాయి… వాహనాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి… ఈరోజు ఆటో లేనిదే జీవితం లేదు సార్…

ఆటో పేరు, చరిత్ర గురించి కొత్తగా తెలుసుకున్నందుకే కాదు… ఎవరు చెప్పినా వినాలి, జ్ఞానం ఎవరి ద్వారా లభిస్తున్నా స్వీకరించాలి అనే నా స్థిరసిద్ధాంతానికి మరో మంచి ఉదాహరణ దొరికిందనే ఆనందం కలిగింది నాకు… ఈలోపు మా ఇల్లొచ్చింది…

కథలో నీతి ఏమిటయ్యా అంటే… కళ్లు, చెవులను ఓపెన్‌గా ఉంచుకొండి…

(ఒక ఇంగ్లిషు పోస్టుకు తెలుగు అనువాదం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions