.
ప్రపంచంలోకెల్లా ఏ మానవ సమాజానికి సంబంధించిన ఎపిక్ మహాగ్రంథమయినా తీసుకొండి… మహాభారతం వంటి మహాసాగరం మరొకటి దొరకదు… ఎంత తవ్వితే అంత… మంచి, చెడు, నీతి, అక్రమం, ధర్మం, అధర్మం, వాటి వెనుక చరిత్రి, తప్పొప్పుల మీమాంస, భక్తి, విధేయత, వీరం, దానం, వేదన, విషాదం… అసలు లేని మానవ ఉద్వేగం ఏముంది అందులో… ఎటొచ్చీ లోతుల్లోకి వెళ్లాలి… సరిగ్గా అర్థం చేసుకోవాలి…
అందులో ఎందరో అన్‌సంగ్ హీరోలు… అంటే దక్కాల్సిన ప్రాధాన్యం దక్కని నాయకులు… అందులో ప్రథముడు బాహ్లీకుడు… చాలామంది ప్రవచనకర్తలకైనా ఈ పేరు తెలుసో లేదో సందేహమే… నిజానికి ఈ పాత్రకు భారతంలో దక్కాల్సిన న్యాయం దక్కి ఉంటే అసలు భారతమే లేదు, ఆ కురుక్షేత్రమే లేదు… నిజం…
Ads
- హస్తినాపురానికి కావల్సిన రాజు తను..,. ఎలాగో కాస్త వివరంగా చెప్పుకుందాం… ఎందుకంటే, ఆయన కథను లోతుగా చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది — హస్తినాపుర సింహాసనానికి దగ్గరగా ఉన్న వంశస్థుడు చివరకు అదే వంశం యుద్ధంలో అనామకంగా మరణించాడు… కాస్త తాపీగా చదవండి, ఎన్నో విశేషాలు ఈయన కథలో… నియోగం, బహుభర్తృత్వం సహా…
కురువంశంలో ముగ్గురు అన్నదమ్ములు… హస్తినాపుర రాజు ప్రతీపుడికి ముగ్గురు కుమారులు…
-
దేవాపి (పెద్దవాడు)
-
బాహ్లీకుడు
-
శంతనుడు
సహజంగా చూస్తే హస్తినాపుర రాజు కావాల్సింది దేవాపి… కానీ కథ అక్కడే మలుపు తిరిగింది…
దేవాపి ఎందుకు రాజ్యం వదిలేశాడు?
పురాణాలు చెబుతున్న ప్రకారం దేవాపికి ఏదో చర్మవ్యాధి ఉండేదని చెబుతారు…
ఆ కాలంలో శారీరక లోపం ఉన్న వ్యక్తి రాజుగా ఉండకూడదనే భావన ఉండేది…
అందుకే దేవాపి రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం, తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడని కథనం…
అలా మొదటి వారసుడు సింహాసనం నుంచి దూరమయ్యాడు…
బాహ్లీకుడు ఎందుకు హస్తినాపురంలో రాజు కాలేదు?
తర్వాతి వరుసలో ఉన్నవాడు బాహ్లీకుడు.
కానీ ఆయన కూడా హస్తినాపురంలో రాజు కాలేదు.
కారణం — బాహ్లీక దేశంలో రాజ్య వారసత్వ సమస్య.
అక్కడ రాజ్యాన్ని నిలబెట్టడానికి బాహ్లీకుడిని అక్కడికి పంపారని కథనాలు చెబుతాయి.
అలా ఆయన బాహ్లీక దేశానికి రాజయ్యాడు, హస్తినాపుర సింహాసనం దూరమైంది…
ఆ బాహ్లీక రాజ్యం గురించి కొన్ని చరిత్రకారులు చెబుతున్నది ఏమిటంటే —
అది ఈరోజు మధ్య ఆసియాలోని బల్ఖ్ ప్రాంతంతో (ఆఫ్ఘనిస్థాన్) సంబంధం ఉన్న రాజ్యం కావచ్చని… అప్పటి అఖండ భారతంలో అది భాగమే…
శంతనుడే హస్తినాపుర రాజు
ఇలా ఇద్దరు పెద్ద అన్నదమ్ములు దూరమవడంతో చివరకు శంతను హస్తినాపుర రాజయ్యాడు. ఆ శంతనుడి కుమారుడు ఎవరో కాదు — భీష్ముడు. అంటే బాహ్లీకుడు భీష్ముడికి పెదనాన్న…
కురువంశంలో దైహిక సమస్యలున్న రాజులు మహాభారత వంశాన్ని చూస్తే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. కురువంశంలో చాలా మంది పాలకులు శారీరక సమస్యలతో ఉన్నట్టు కథనం చెబుతుంది. ఉదాహరణకు….
-
దేవాపి – చర్మవ్యాధి
-
విచిత్రవీర్యుడు – బలహీన ఆరోగ్యం, పేరులో అసలు అర్థం
-
ధృతరాష్ట్రుడు – అంధత్వం
-
పాండు – శాపం వల్ల సంతానం సమస్య
ఈ పరిస్థితుల వల్లే కురువంశంలో ఒక ప్రత్యేక పద్ధతి అమలైంది — నియోగం…
నియోగ పద్ధతి ఎలా వచ్చింది? విచిత్రవీర్యుడు సంతానం లేకుండా మరణించడంతో వ్యాసుడు ద్వారా నియోగ పద్ధతిలో సంతానం పొందారు. అలా పుట్టినవారే…
-
ధృతరాష్ట్రుడు
-
పాండు
-
విదురుడు
ఇది మహాభారత వంశక్రమంలో కీలక మలుపు….
- చివరకు తన కుటుంబంతోనే యుద్ధం కాలం గడిచేసరికి బాహ్లీకుడు చాలా వృద్ధుడయ్యాడు. కానీ కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు ఆయన దుర్యోధనుడు పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. ఎందుకు..? రాజ్యానికి కట్టుబడి, రాజధర్మానికి కట్టుబడి… కురుక్షేత్రంలో పోరాడిన అత్యంత వృద్ధుడు తను… బలరాముడు వంటి యాదవ యోధుడు యుద్ధాన్ని త్యజించాడు కానీ బాహ్లీకుడు మాత్రం క్షాత్ర ధర్మాన్ని వదల్లేదు…
చివరకు యుద్ధంలో భీముడు చేతిలో బాహ్లీకుడు మరణించాడు… ఈ కథలోనే మరో విషాదం ఉంది…
ఒకే కుటుంబం… మూడు తరాల విషాదం
బాహ్లీకుడి కుమారుడు సోమదత్తుడు.
అతని కుమారుడు భూరిశ్రవుడు.
భూరిశ్రవుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అతని మరణం కూడా యుద్ధధర్మంపై పెద్ద వివాదంగా మారింది…. అది మరెప్పుడైనా చెప్పుకుందాం… కృష్ణుడు ధర్మం పేరిట వహించిన పక్షంలో కూడా బోలెడు అధర్మ యుద్ధాలు, హత్యలు…
అలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలు — బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు — కురుక్షేత్ర యుద్ధంలోనే అంతమయ్యాయి…
- “హస్తినాపురం చరిత్ర మర్చిపోయిన రాజు” బాహ్లీకుడి కథ ఒక విషాదగాథ. హస్తినాపుర సింహాసనానికి అసలైన అర్హుడు… కానీ రాజ్యం దూరమైన వ్యక్తి… చివరకు అదే వంశం యుద్ధంలో మరణించిన వృద్ధ యోధుడు… నిజానికి తనే హస్తినకు అసలైన వారసుడు అని పోరాడి ఉంటే… నియోగాల్లేవు, వారసత్వ పోరాటాల్లేవు, అసలు కురుక్షేత్రమే లేదు…!!
Share this Article