Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏస్కో కోకాకోలా తీస్కో రమ్ము సారా… అబ్బో, ఈ డ్రింక్ కథ పెద్దదే…

March 2, 2024 by M S R

శంకర్ జీ …. చిన్నప్పుడు ఏస్కో కోకాకోలా, తీస్కో రమ్ము సారా… అని రేడియోలో వచ్చే పాట వినే వుంటారు కదా.. అప్పట్లో ఒక ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి క్లబ్ సాంగ్ ఇది. ఇంట్లో ఘట్టిగా పాడి తిట్లు తిన్నట్టు గుర్తు. ఇదేకాదు జ్యోతిలక్ష్మి పాట ఏది పాడినా తిట్టేవాళ్ళు. ఎందుకో జో లక్ష్మి అంటే అంత కోపం. తర్వాత కొద్ది ఏళ్ళు ఇండియాలో కోకాకోలా అమ్మలేదు… 90 ల తర్వాత మళ్ళీ ఇండియాలో ప్రత్యక్షం అయ్యింది.

సరే ఇప్పుడు కొకాకోలా పుట్టుపూర్వోత్తరాల ముచ్చట చెప్పుకుందాం. కోకాకోలా…. ఏమిటీ కోలా చరిత్ర… చూద్దాం… అసలు ముందూ, క్లారిటీ అంటే స్పష్టత మనకు రావాలి… “కోకో (cocoa)” అనేదొకటి , “కోకా (coca)” అనేదొకటి… రెండున్నాయని మీకు తెలుసా. నాకూ ఇప్పుడే తెలిసింది. మొదటిది మన చాక్లెట్లలో ఉండేది. ఇది కోకో కాయల గింజల్ని, కాఫీ గింజల్లా వేయించి తీస్తారు. ఈ రెండో కోకా, చీర లాంటి పదం అయినా “కొకైన్” అనే మాదకద్రవ్యం ఇచ్చే మొక్క…
నేను కూడా మన “కోకకోలా” ని “కోకోకోలా” అనుకుని, చాక్లెట్ నుంచి వచ్చిందేమో అనుకున్నా కాని, సదరు మొక్కకి దీనికి ఏ సంబంధమూ లేదు. ఇది అచ్చంగా కొకైన్ నుంచే వచ్చింది. మొదట్లో దీనిలో ఎంచక్కా కొకైన్ కలిపి (9 mg /గ్లాసుకి), ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం అనే అమ్మారు… అప్పట్లో కొకైన్ లీగల్ గా ధారాళంగా వాడుకోవచ్చు. అయితే 1904 తర్వాతి కాలంలో అంక్షల వల్ల ఓపెన్‌గా ఆ పని చేయలేక , ఆకుల లోంచి సారాన్ని కలిపి చేస్తున్నారు. అది కూడా అతి కొద్ది మోతాదులోనే లెండి.
ఇక రెండో భాగం అయిన కోలాకి ఆ పేరు కోలా అనే పండు గింజ వల్ల వచ్చింది. ఇది డైరెక్ట్‌గానే కలిపినా ఇబ్బంది లేదు. కాబట్టి ఒక భాగం కొకైన్ లో కోకా, రెండోభాగం కోలా అనేవి వాడారు… కాబట్టే కోకా కోలాకి ఆ పేరు. ఇప్పుడు కొకైన్ లాంటిదేమీ లేదుట లెండి, ఖంగారు పడవలసిన అవసరం లేదు.
అసలు దీని తయారీ సరుకుల చిట్టా ప్రతిని , అట్లాంటాలో “సన్ ట్రస్ట్ బ్యాంకు” లో భద్రమైన ఖజానా గది (secret vault) లో ఉంచారని అంటారు. దీనిలో వేసే పదార్ధాల జాబితా అతి గోప్యం అని అంటారు గానీ, 2011 లో “దిస్ అమెరికన్ లైఫ్”అనే పత్రిక, ఒక నోట్ బుక్‌లో సీక్రెట్‌గా రాసిన పేజీని ఓపెన్‌గానే ప్రకటించింది.

లీకైన చిట్టా చెప్పిన ప్రకారం, అందులో “వనిలా, కేరమెల్, కెఫీన్, కోకా ఆకుల రసం, నిమ్మ రసం, దీనికి జతగా ఏడు సుగంధ తైలాలు/ద్రవ్యాలు (7 X)- ఆల్కహాల్, ఆరంజ్, లెమన్, జాపత్రి, కొత్తిమీర, నేరోలి, దాల్చిన చెక్క” ఉన్నాయట. పనిలో పని, మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.

మొదట్లో దీన్ని కుళాయిల్లో (హోటల్/షాపు లోనే లెండి , వీధుల్లో అనుకునేరు) అమ్మేవారట . అలాగే దీని సీసా ఆకారం కోకో బీన్స్ ఆకారాన్ని పోలి ఉంటుందట. మొదటిసారి సులభంగా ఇంటికి తీసుకుని వెళ్ళేలా అర డజన్ పేక్ లాగా అమ్మింది , 1928 ఒలింపిక్స్‌కి స్పాన్సర్ చేసింది కూడా వీరే. ప్రపంచం అంతా టక్కున గుర్తు పట్టే పదాలలో కోకాకోలా రెండోదట. మొదటిది “ఓకే “ అనే పదం అట. కోకాకోలా అనే అక్షరాలు కూడా చిత్రంగా ఉంటాయి కదా. వాటిని “స్పెన్సేరియన్ ఖతి- spencerian font” అంటారు.ఈ ఖతిలో ఇంకేవి ఉండకూడదని 1893లో ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళు.

Ads

కోకా కోలా బాగా ఆమ్లత్వం ఉండే పానీయం. దీని ఆమ్లత్వ (ph) విలువ 2.5. ఎనామెల్ని నెమ్మదిగా అరిగేట్టు చేయగల సత్తా దీనికి ఉంది. దీని మీద విమర్శలు కూడా బోలెడు.

మే 8 1886 లో డాక్టర్ “జాన్ పెంబర్టన్” అనే పార్మసిస్ట్ , “జాకోబ్స్ ఫార్మసీ” అట్లాంటా లో తయారు చేసాడు. 1891 లో ఇంకో పార్మసిస్ట్ “ఆసా గ్రెగ్స్ కాండ్లర్”, హక్కులు కొనుక్కుని కంపనీ మొదలెట్టాడు. ఒక రకంగా దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లడం ఈయన ఘనతే. మళ్ళీ 1919 లో ఈ కంపనీ “ఎర్నెస్ట్ వుడ్రాఫ్” చేతికి మారింది.

ఇంకా రాసుకుంటూ పొతే సీసా ఎలా మారింది, లోగో , దాని మార్కెటింగ్ ప్రణాళికలు, ఇతర కంపనీల పానీయాల కైవసం, అబ్బో చాలా పెద్ద చరిత్ర ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions