మనకు తెలియని నటి ఏమీ కాదు… అప్పట్లో నాని గ్యాంగ్ లీడర్లో కనిపించింది… తరువాత పవన్ కల్యాణ్ ఓజోలో కూడా చాన్స్ కొట్టేసినట్టు వార్తలు కూడా చదివాం… అదే నాని మళ్లీ ‘సరిపోదా శనివారం’ సినిమాలో కూడా చాన్స్ ఇచ్చాడు… పర్లేదు… కాస్త బిజీగానే ఉంటోంది… మరి అంతటి ఇంటిమేట్ సీన్లలో ఎందుకు నటించినట్టు..? అసలు ఏమిటీ తాజా వివాదం..?
వినవచ్చే సమాచారం ఏమిటంటే..? ఆమె తమిళంలో టిక్ టాక్ అనే ఓ నాసిరకం బజారు స్థాయి సినిమాలో నటించిందట ఈమధ్య… అందులో అన్నీ విడిచేసి, వదిలేసి హీరోతో హాట్ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయి చేసిందట… దర్శకుడు ఏది చెబితే అది కాదనకుండా చేసింది… సరే, ఆమె వృత్తి అది… అదేమిటమ్మా అన్నామే అనుకొండి, కథ డిమాండ్ చేసింది అని ఓ పడికట్టు వాక్యాన్ని మన మొహాన విసిరేస్తుంది…
కొన్ని సినిమాల్లో అలాంటివి ఉంటాయి, చూసేవాళ్లూ ఉంటారు, అదంతా వేరే చర్చ… ఐతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే… ఆమధ్య పాపం ఈ కన్నడ కస్తూరికి ఏమీ అవకాశాలు లేక ఖాళీగా ఉందట, అప్పుడు ఈ అవకాశం వరించింది… ఆమె అంగీకరించింది… ఏది వద్దంటే ఉన్న ఆ అవకాశం కాస్తా ఎగిరిపోతుందో అనే భయంతోనో, అవసరంతోనో దర్శకుడు చెప్పినట్టు నటించింది…
Ads
ట్రెయిలర్లో కూడా కొన్ని సన్నివేశాలు హాట్‌గానే ఉన్నాయి… మరి ట్రెయిలర్ అంటే ఆడియనెన్స్ అటెన్షన్‌ను అట్రాక్ట్ చేయడం కదా… కానీ తీరా చూస్తే అసలు సినిమాలో అవేవీ లేవట.,. మొత్తం 20 నిమిషాలపాటు ఉండే రసదృశ్యాలను కత్తిరించి పారేశారట… ఇప్పుడు నిర్మాత లబోదిబోమంటూ కోర్టులో కేసు వేయడానికి రెడీ అవుతున్నాడనేది కాస్త విచిత్రంగా కనిపించిన వార్త…
నాకు తెలియకుండానే ఆ హాట్ సీన్లన్నీ కత్తిరించారని, 2017లోనే ప్రియాంకతో అగ్రిమెంట్ కుదిరిందనీ, సినిమా జాప్యం జరిగి, ఈలోపు ఆమె పాపులర్ అయిపోయి, ఇమేజ్ కోణంలో వాటిని తొలగించేలా చేసిందనీ నిర్మాత ఆరోపణ… అసలు నిర్మాతకు తెలియకుండానే అంత నిడివి సీన్లను కత్తిరించడం ఏమిటి..? అసలు సినిమా నిర్మాణ సమయంలో ప్రతిదీ చూసుకోవల్సిన నిర్మాత ఇప్పుడు ఏడవడం ఏమిటి..?
వోకే, కత్తిరించేశారు సరే… కానీ ఎవరు..? దర్శకుడే కదా…! రేప్పొద్దున కోర్టుకు ఈ కేసును యాక్సెప్ట్ చేసినా సరే, ఆ సీన్లు మొదట కథానుసారం చిత్రీకరించామని, కానీ సినిమా కథనానికి అడ్డుపడుతూ సినిమాను నాసిరకంగా మారుస్తున్నాయనే అభిప్రాయం కలిగి కత్తిరించిపారేశామనీ చెబితే, ఇక నిర్మాత దగ్గర ఎదురు వాదన ఏముంటుంది..? ఫలానా సీన్లు ఉండాలని దర్శకుడు, హీరోయిన్ అగ్రిమెంట్ కాగితాల్లో ఉండదు కదా…
నిజానికి దర్శకుడు నిర్మాత చెప్పినట్టు వింటుంటాడు సాధారణంగా… కానీ నా ఇమేజీకి భంగకరం, అవి తీసేద్దాం అని ప్రియాంక గోముగా అడగ్గానే దర్శకుడు తీసేయడం చూస్తే పాపం మంచోడే అనిపిస్తోందా..? మరి తనతో అంత వెగటు సీన్లను ముందుగా ఎందుకు చిత్రీకరించినట్టు..? నాకు చెడ్డపేరు అని బాధపడే కేరక్టరే అయితే అప్పుడు ఎందుకు అంత యథేచ్ఛగా ఎందుకు నటించినట్టు..? 20 నిమిషాల హాట్ మొత్తాన్ని తీసేసినా సరే, సినిమాకు నష్టమేమీ లేదని చెబుతున్నాడు అంటే… కావాలనే ఓ టేస్ట్ ప్రేక్షకుల్ని రప్పించుకోవడం కోసమే ఆ బెడ్రూం సీన్లను పెట్టినట్టే కదా… ప్రియాంక అంత ఇదిగా అడిగితే కాదంటానా అన్నట్టుగా, నిర్మాతను ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నట్టే కదా దర్శకుడు… హహ… మొత్తానికి అందరూ అందరే… ఎవరూ శుద్ధపూసలు కారు…!!
Share this Article