Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ‘టైమ్’ వచ్చేదాకా ప్రసవవేదన- ప్రయాస… టాటా వాచీల కథ!

July 3, 2026 by M S R

.

( హరగోపాలరాజు వునికిలి ) సామాన్యులకు సమయం విలువ చెప్పిన టాటా… సామాన్య భారతీయులకు సైతం సమయం విలువ చెప్పిన టాటా.. మీరు చదివింది కరక్టే.. మన దేశానికి పారిశ్రామిక దిక్సూచి అయిన టాటాలే సామాన్యులకు కూడా నాజూకైన గడియారాలు అందించి చరిత్ర సృష్టించారు.. అందుకే జె.ఆర్.డి.టాటా “భారతరత్న”మయ్యారు..

సరిగ్గా నలభై ఏళ్ల క్రితం తమిళనాడులో ప్రారంభమైన టైటాన్ గడియారాల తయారీ వెనుక ఎంత ప్రసవవేదన, ఎన్ని అవరోధాలు, అవాంతరాలు, ఎందరో భారతీయ మేధావుల మేధోమధనం, అన్నిటికీ మించి రతన్ టాటా దూరదృష్టి, ప్రయోగాలు, పరిశోధనలకు ప్రోత్సాహం, ఓటమి, సంఘర్షణ లేనిదే జీవితం లేదు.. అనే పాఠం ఒక ఆవిష్కరణ..

Ads

ప్రపంచానికి ఒక భారతీయ నైపుణ్యాన్ని చెయ్యెత్తి చూపిన.. నేటి జెన్ జడ్ తరానికి ఒక మేనేజ్ మెంట్ దృశ్య సాక్షాత్కారం.. టైటాన్ మేడ్ ఇన్ ఇండియా డాక్యుమెంటరీ (ఆరు భాగాలు).

జె.ఆర్.డి.టాటాగా నసీరుద్దీన్ షా, జెరాక్స్ దేశాయిగా జిమ్ సరబ్, అతని సహచర ఉద్యోగిగా వైభవ్ తత్వాడి (ఒకటి రెండు తెలుగు సినిమాల్లో విలన్) అద్భుతంగా నటించారు. నసీరుద్దీన్ షా నటన గురించి కొత్తగా చెప్పేదేముంది.. జె.ఆర్.డి పాత్రలో ఒదిగిపోయారు.. జిమ్ సరబ్ అయితే టైటాన్ వ్యవస్థాపక డైరక్టర్ పాత్రలో జీవించేశాడు. టైటాన్ కు కూడా అతనే ప్రచారకర్త.

దేశంలో స్మగుల్డ్ వస్తువులు రాజ్యమేలుతున్న కాలంలో (చేతి గడియారాల వాటా 40 శాతం అట) అదిగో అక్కడ పురుడు పోసుకున్న ఒక ఆలోచన దేశీయ గడియారాల తయారీలో ఒక శకానికి నాంది పలికింది. అందులోనూ అత్యంత తేలికైన, నాజూకైన (టైటాన్ ఎడ్జ్ 3.3 మి.మీ మందం) క్వార్ట్జ్ వాచీల ఉత్పత్తికి దారి తీసిన ప్రయోగాలు ఇందులో ఆసక్తిగా చూపించారు.

దార్శనికుడైన దిగ్గజ పారిశ్రామికవేత్త ఆలోచనా విధానం, ఉద్యోగులపై ఉంచే నమ్మకం, నిర్ణయాల తీరు ఇప్పటితరం తెలుసుకోవాల్సిందే. కార్మిక వివాదాలు, ఉద్యోగుల ఎంపిక, బోర్డు డైరక్టర్ల ఆలోచనా విధానం, అహం, బ్యూరోక్రసీ, అనుమతుల్లో ప్రభుత్వ అలసత్వం, బ్యాంకు రుణాలకు పడే తిప్పలు వంటి ఎన్నో సునిశిత అంశాలను చాలా సరళంగా, సూటిగా చర్చించారు.

ప్రైవేట్ సంస్థలకు ఇప్పటి ప్రభుత్వాలు ఉదారంగా భూములు ఇస్తున్న తీరు భావితరాలకు ఎంత నష్టమో కూడా తెలుస్తుంది. అసలు తమిళనాడులో (హోసూరు) ఎందుకు పెట్టాలనుకున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించారనేదీ ఆసక్తికరమే.

వాచీల తయారీకి సాంకేతిక సాయం కావాలని స్వయంగా కోరిన రతన్ టాటాను తిరస్కరించిన విదేశీ కంపెనీ చివరకు టైటాన్ విజయాన్ని ప్రసంశించిన తీరు కూడా ఆకట్టు కుంటుంది. తన సంస్థ తయారు చేసే వాచీ విడుదలయ్యేవరకు తాను ఏ గడియారం పెట్టుకోనని తన విదేశీ చేతి గడియారం తీసేసి ఛాలెంజ్ విసిరిన రతన్ టాటా నమ్మకాన్ని చూడాల్సిందే. ఒకానొక దశలో దివాళా దిశగా పయనిస్తుందా.. విజేతగా, మార్కెట్ లీడర్ గా నిలుస్తుందా అన్న ఉత్కంఠ కూడా కలుగుతుంది.

చిత్తశుద్ధితో పనిచేసే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎంతటి అద్భుత విజయాలు సాధిస్తారో! ప్రయోగాలు చేయకుంటే ఫలితాలు ఎలా వస్తాయి..? పరాజయం ఎదురయిందని చింతిస్తూ కూర్చోకుండా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయమంటుంది ఈ కథ.

వినయ్ కామత్ రాసిన పుస్తకం ఆధారంగా రోబి గ్రేవాల్ ఈ సిరీస్ తెరకెక్కించారు. ప్రతి సన్నివేశంలో ఆపాత మధురాలైన హిందీ గీతాలను నేపధ్యంలో వినిపించడం దర్శకుడి అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేం. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. వీలున్నప్పుడు కుటుంబంతో చూడండి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చట్టం చేయని నిర్వాకం కేసీయార్‌ది ! నిందలు రేవంత్ రెడ్డిపైన !!
  • Bheemana Amavasya ! భర్తకు నటి ప్రణీత పాదపూజ వైరల్ ఫోటోలు !!
  • టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ వెనుక ఏం జరిగింది ?!
  • ఆ దరిద్రుడు, నరకం చూపించాడు ! అనుపమ వేదనాగీతం !!
  • ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!
  • అడాప్టివ్ టెస్టింగ్ ! నీట్- పోటీ పరీక్షల అక్రమాలకు రియల్ చెక్ !!
  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions