Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ గృహిణి… రోజూ రెండు ఇడ్లీలు… అస్సలు మెచ్చుకోని ఓ ధర్మ భిక్షువు కథ…

April 5, 2024 by M S R

Prabhakar Jaini….. రెండు ఇడ్లీలు… ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది, ఆకలితో ఉన్నవాళ్లు ఎవరైనా తింటారు అని…

ఆ దారివెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొణుక్కుంటూ వెళ్లడం జరిగేది, ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది, అతను చెప్తున్న మాటలు…
నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది
నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది
ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు, రోజు ఇడ్లీ పెడుతున్నాను తీసుకు పోతున్నాడు, నువ్వు మహాలక్ష్మివి చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు, ఇడ్లీలు బావున్నాయని చెప్పకపోయినా పర్లేదు, ధన్యవాదాలు అమ్మా అని చెప్పడం కూడా తెలియలేదా ఇతనికి… ఏదో ఆ చెత్త వాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది, అయినా ఇడ్లీలు పెట్టడం మరిచిపోలేదు
రోజురోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా మారిపోయింది… ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది,
కానీ మనసు ఒప్పుకోలేదు, చేతులు వణకడం మొదలెట్టింది, ఆలోచన మొదలయింది…
ఛ, వద్దు, అతను అలా ఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది… ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకుని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు, కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధాన పరుచుకుంది…
ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తే వెళ్లి తలుపు తీసింది… ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు… అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి, అలిగి వెళ్లిన తన కొడుకు…
అమ్మా… ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేసారు, చేతిలో చిల్లి గవ్వ లేదు, బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు, నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు, ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది…
విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే, నా కొడుకుకి నేనే యముడినై ఉండిఉంటానే అని కంటతడి పెట్టుకుంది… ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థం అయ్యాయి…
నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది… నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కుని వచ్చి చేరుతుంది, అందరికీ అన్నీ అర్థం అవ్వవు, అర్థం అయ్యేంతవరకు ఎవరమూ ఎదురుచూడము…
చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది, ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి, మనం తెలియక చేసే తప్పుల నుండి బయట పడే మార్గం మంచి చేయడం మాత్రమే….  సర్వే జనాః సుఖినోభవంతు… కర్టెసీ: వాట్సప్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions