ఇండియాటుడే సర్వేల్లాగా…. పోయిన ఎన్నికల ముందు లగడపాటి సర్వేల్లాగా… కొన్ని భలే అనిపిస్తాయి… ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలు నిర్వహించే పాపులారిటీ సర్వేలు భలే నవ్వు పుట్టిస్తాయి… టైమ్స్ వాడి సినిమా, టీవీ పర్సనాలిటీల పాపులారిటీ సర్వేలయితే పొట్ట చెక్కలే… వాటికి క్రెడిబులిటీ ఏమీ ఉండదు… ఎంతమంది పాల్గొన్నారు, ఏ పద్ధతిలో సర్వే చేశారు, ఏం ప్రశ్నలు వేశారు, శాంపిల్ మిక్స్ ఏమిటి వంటి వివరాలేమీ ఉండవు… సరే, అనుకోకుండా ఆర్మాక్స్ అనే ఓ మీడియా కంపెనీ (??) సర్వే ఒకటి కనిపించింది… కాస్త ఆశ్చర్యం, కాస్త నవ్వు, కాస్త ఆసక్తి, కాస్త చిరాకు, కాస్త నిర్వేదం, ఇలా రకరకాల భావాలు ఒకేసారి కలిగాయి… ముందుగా జూలై నెలకు సంబంధించిన మోస్ట్ తెలుగు పాపులర్ నాన్-ఫిక్షన్ పర్సనాలిటీ సర్వేలో టాప్ ఫైవ్ ప్లేసులు చూడండి… మరీ కంగారుపడకండి.,. టీవీ పర్సనాలిటీలకు సంబంధించిన పాపులారిటీ సర్వే… టీవీ పర్సనాలిటీలు నాన్-ఫిక్షన్ ఎలా అవుతారో సర్వే చేసినవాడికీ తెలియదు, చేయించినవాడికీ తెలియదు… ఓసారి చూడండి…
ఫస్ట్ ప్లేస్… సుడిగాలి సుధీర్… కాస్త రియలిస్టిక్… ఈటీవీలో జబర్దస్త్ టీం లీడర్, శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్, ఢీ డాన్స్ షోలో మెంటార్ ప్లస్ అడపాదడపా సినిమాలు… కామెడీ, మ్యాజిక్, స్టంట్స్, డాన్సులు గట్రా… తెలుగు టీవీ సూపర్ స్టార్… సెకండ్ ప్లేసులో హైపర్ ఆది… ఇప్పుడు తగ్గిపోయాడు గానీ రెండుమూడు సంవత్సరాల క్రితం టాప్ రేంజ్ తనది… ఒక్కో జబర్దస్త్ స్కిట్ సూపర్ హిట్… మూడో ప్లేసు ఓంకార్… ఇది కాస్త అతిశయోక్తి… తను పాపులరే కానీ, మరీ మూడో ప్లేసులో నిలిచేంత పాపులర్ ఏమీ కాదు తను… ఇప్పుడైతే జనం ఆయన గడ్డం చూసి, ప్రత్యేకించి పిల్లలయితే జడుసుకునేలా… (విచిత్రంగా పిల్లల ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నాడు)… నాలుగో ప్లేసు యాంకరిణి సుమ… పర్లేదు, ఆమె షోలు ఈమధ్య ఫ్లాప్ అవుతున్నా సరే, ఇప్పటికీ ఫిమేల్ యాంకర్లలో టాప్… పాపులారిటీలో నాలుగే ప్లేసు ఖండించాల్సింది ఏమీ కాదు… అయిదో ప్లేసులో నాగబాబు… అప్పట్లో జబర్దస్త్, తరువాత అదిరింది… అంతే… చాలారోజులుగా అసలు టీవీ తెర మీద కనిపించడం లేదు, యూట్యూబులో ఏదో స్టాండప్ కామెడీ చేయించాడు, మరి అయిదో ప్లేసు ఎలా వచ్చింది..? సర, ఈ చార్ట్ ఓసారి చూడండి…
Ads
జస్ట్, ఒక నెల ముందు నిర్వహించిన సర్వే చార్ట్ ఇది… ఫస్ట్ ప్లేస్ సుధీర్, వోకే… సెకండ్ ప్లేస్ సుమ, వోకే… థర్డ్ ప్లేస్ హైపర్ ఆది, వోకే… ఫోర్త్ ప్లేస్ ప్రదీప్… నిజానికి ప్రదీప్ ప్లేస్ ఇంకాస్త బెటర్… తన పాపులారిటీ చాలా ఎక్కువ… ఒకటికాకపోతే మరొకటి… చేతి నిండా షోలు… పైగా తన స్పాంటేనిటీ ఆయా షోలకు అదనపు అడ్వాంటేజీ… మరి ఈ ప్రదీప్ పేరు గత నెల సర్వేలో అస్సలు కనిపించలేదు, ఇక ఆ సర్వే ఏమిటో వాళ్లే చెప్పాలి… మోడీ జనాదరణ ఏడాదిలో 66 శాతం నుంచి 22 శాతానికి పడిపోయినట్టుగా… ప్రదీప్ పాపులారిటీ ఒకే నెలలో టాప్ ఫైవ్ నుంచి జారిపోయి, బిలో ఫైవ్ కేటగిరీలోకి చేరిపోయాడా..? వారెవ్వా, ఏం సర్వే చేశారు బాసూ… అలాగే అయిదో ప్లేసు రోజా… రెగ్యులర్ జబర్దస్త్ షోల జడ్జి ప్లస్ అదేదో రచ్చబండో ఏదో విచిత్రమైన షో చేస్తున్నది కాబట్టి టీవీకి సంబంధించి పాపులరే… అవునూ, ఫాఫం… తన డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో ఉండే అనసూయ, సహ యాంకరిణులు రష్మి, శ్రీముఖి ఎప్పుడైనా టాప్ ఫైవ్‌లోకి వచ్చారా లేదా..?! ఆదికి దీటైన కమెడియన్ చమ్మక్ చంద్ర ప్లేస్ ఏమిటో…!!
Share this Article