మోడీ కరోనా టీకా వేసుకోవడం వెనుక అంత పరమార్థం, ఎన్నికల వ్యూహాలు ఉన్నాయా…? వావ్… మనలాంటి అల్లాటప్పా సామాన్యులకు అంతుపట్టదు గానీ… ఉండే ఉంటుంది… ఒకాయన చెప్పాడు కదా…. ప్యూర్ యాంటీ మోడీ బ్యాచ్… తెల్లారిలేస్తే హిందూ డప్పు కొట్టే మోడీ అట, తన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూకు వచ్చేసరికి క్రిస్టియన్ నర్సులను నమ్ముకున్నాడట… నమో నమ…. వీళ్లు మోడీని మించిపోతున్నారు కదా… ఆయన అస్సోం ఎన్నికల నేపథ్యంలో ఆ కల్చర్‌ను ప్రతిబింబించే ఓ స్కార్ఫ్ వేసుకుని, టీకా వేసుకుంటూ ఫోటో దిగాడు సరే… అసలే ఓ పెద్ద ముదురు వేషధారి… అందులో డౌట్ లేదు… రాజకీయ పరిపక్వతకన్నా వేషధారణనే నమ్ముకునే ఓ పాత ఎన్టీయార్ బాపతు అనుకుందాం… కానీ మరీ నర్సుల వృత్తికి కూడా మతాన్ని, ఉద్దేశాల్ని ఆపాదించే స్థాయికి ఎదిగిపోయింది మన రాజకీయం… ఫాఫం, మన ఖర్మ… వాడెవడో అఖిలేషుడు ఆమధ్య అన్నాడు కదా, అది బీజేపీ వేక్సిన్, అది వేసుకుంటే నా పొటెన్సీ మటాష్ అని… ఇది ఆ మూర్ఖత్వాన్ని మించిపోయింది… ఐనా ఇండియన్ పొలిటిక్స్ అంటేనే అది కదా… ఒకరికి మంచి మరొకరు తమ ఎదవాయిత్వాన్ని ప్రదర్శించడం… ఒక్కడూ తక్కువ కాడు… జ్ఞానముంటే పాలిటిక్స్‌కు ఎందుకు పనికొస్తారు అంటారా…? అంతేలెండి… మన మోడీ భయ్యా అన్నదీ అదే కదా… పరోక్షంగా…!!
అందుకేనేమో మోడీ టీకా వేసుకునేటప్పుడు అన్నాడు… ‘‘మేం అసలే తోలుమందం కేసులు కదా… కాస్త పశువులకు సూది మందులు ఇచ్చే బాపతు నీడిల్స్ ఏమైనా వాడుతున్నారా..?’’ అనడిగాడు… అందులో ఆ నర్సుల టెన్షన్ తగ్గించే ప్రయత్నం కాదు, ఆత్మవిమర్శ అది… కన్ఫెషన్ ప్రకటన… నిజమే కదా మరి… నాయకులకు టీకాలు వేయాలంటే కాస్త డిఫరెంట్ సూదులు కావాలి కదా… ఆ నర్సులు టెన్షన్ తగ్గించుకుని, నవ్వుకున్నారేమో గానీ… మోడీ జనరలైజ్ చేసి కామెంటొచ్చు గానీ… మాంచి సెటైరికల్ కామెంటే కావచ్చు గానీ… నిజమే కదా… తోలుమందం రాజకీయ నాయకులు అనేది ఎంత మంచి ఆత్మచింతన… నువ్వు గ్రేటురా నా తండ్రీ…
Ads
వాడెవడో ఆంధ్రజ్యోతి వాడు రాస్తాడు… తూవాబచె… సిగ్గూశరం లేని తోలుమందం కేటగిరీలో జర్నలిస్టులు కదా ఫస్ట్ చేరాల్సింది… ‘‘అస్సాం స్కార్ఫ్ వేశాడు, పుదుచ్చేరి నర్స్, కేరళ సహాయకురాలు… మొత్తం ఎన్నికల నేపథ్యమే’’ అంటాడు వాడు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దిగడానికి వేరే పాతాళమెట్లు లేవు కదా, క్షమించేద్దాం… నిజానికి అభినందించాలి తనను… నర్సుల పుదుచ్చేరి స్థానికతను, అస్సాం స్థానికతను, మోడీ టీకాను, ప్రస్తుత ఎన్నికలనూ లింక్ చేయడం అసలు మామూలు విషయమా..? సూపర్ క్రియేటివిటీ…. రాధాకృష్ణ తన రిపోర్టర్ల కథనాల పట్ల తనే బోలెడంత హాశ్చర్యానందసంభ్రమాల్ని అనుభవించుగాక…! అవునూ… మోడీ వర్యా… అస్సాం స్కార్ఫ్ వేశావు సరే… బెంగాల్ రవీంద్రుడి పోలినట్టు గడ్డం, జుట్టు పెంచావు సరే… పుదుచ్చేరి నర్స్ సరే… కేరళ సహాయకురాలు సరే… మరి తమిళనాడు బాపతు ఏదో ప్రదర్శించాలి కదా… అదేమైంది..? అబ్బే, ఎక్కడో తేడా కొడుతోంది మాస్టారూ… పోనీ… పెరియార్‌ను లేదా అన్నా దురైని గుర్తుచేసేలా ఏదైనా కొత్త వేషం ఆలోచించొచ్చు కదా… అసలే పొలిటికల్ హీట్ పెరుగుతోంది… త్వరగా ఆలోచించాలి మరి…! ప్లీజ్…!!
Share this Article