సుప్రసిద్ధ రచయిత Veerendranath Yandamoori నుంచి త్వరలో రాబోయే ఓ కొత్త పుస్తకం నుంచి ఓ పార్ట్ ఇది… తను షేర్ చేసుకున్నదే… ఇదంతా ఏ పాత్ర ఏ సందర్భంలో చెబుతుందో తెలియదు… కానీ నిజానికి దీన్ని పూర్తిగా అంగీకరించలేరు కొందరు… ముందుగా ఈ పార్ట్ యథాతథంగా చదవండి ఓసారి…
బాగా లేకపోవడం వేరు, నచ్చక పోవటం వేరు..! అర్థం పర్థం లేకుండా రాళ్లు విసిరే విమర్శకులు కూడా అంతే.ఒక సెలబ్రిటీ విజయాన్ని పోజిటివ్ దృష్టితో అస్సలు చూడరు. చూడటానికి ఇష్టపడరు. అది వాళ్ళ రక్తంలోనే జీర్ణించుకుపోయి ఉంటుంది.
ఇంటికి స్లాబ్ వేస్తున్నప్పుడు వర్షం రాకుండా చూసుకుంటాం. స్లాబ్ కాస్త గట్టి పడిన తర్వాత మనమే నీళ్లు కొడతాం. విమర్శలు కూడా అలాంటివే. నిరుపయోగమైన వాటిని పట్టించుకుంటే నాశనం చేస్తాయి. అవసరమైనవి పట్టిచుకుంటే అభివృద్ధికి తోడ్పడతాయి. ఉపయోగపడతాయి…
Ads
ఎందుకో గానీ , పైన చెప్పిన తత్వానికీ లేడిని పులి చంపే కథకూ నడుమ లింక్ సరిగ్గా కుదరలేదు అనిపించింది… స్థూలంగా చూస్తే ఈ నాలుగైదు పేరాలు వ్యక్తిత్వ వికాస పాఠాలే అనిపించినా… (యండమూరి గత కొన్నాళ్ల ప్రస్థానం కూడా అదే కాబట్టి ఇదీ ఆ రీతిలోనే సాగిందేమో)… కొంత గందరగోళం ఉన్నట్టుంది… మరో కోణంలో పరిశీలిస్తే… జస్ట్ ఫర్ డిబేట్ సేక్…
“నీకు ఎప్పుడూ ఇతరుల చీకటి కోణాలు మాత్రమే కనబడుతున్నాయీ అంటే, నీవు నీ బలహీనతలని సమర్ధి౦చుకోవటానికి అవతలివారిని విమర్శిస్తున్నావన్న మాట” అనేదీ కరెక్టు కాదు… ఒక క్రీడాకారుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక హీరో, మరో ప్రముఖుడు, ఇంకో సెలబ్రిటీ… వ్యక్తిగత జీవనవిధానం, వ్యవహారశైలి నచ్చనప్పుడు విమర్శ చేయడంలో తప్పులేదు…
ఒక హీరో అడుక్కుతినే స్టేజ్ నుంచి, వాళ్ల వీళ్ల కాళ్లు పట్టుకుని హీరోగా ఎదిగాడనే సానుభూతితో తన పాత్రను చూడలేం… ఒక సినిమాలో తన నటన బాగుంటే మెచ్చుకుంటాం, లేదంటే విమర్శిస్తాం… అంతే… ఇక్కడ మన బలహీనతల్ని సమర్థించుకునే ప్రయత్నం ఏమున్నట్టు..?
జోరుగా ఓ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తోంది… ఓ ప్లేయర్ రెండు క్యాచులు వదిలేశాడు నిర్లక్ష్యంగా, దెబ్బకు మ్యాచ్ పోయింది, కూలీ పని చేసుకుంటూ ఎదిగాడు కాబట్టి ఆ ప్లేయర్ నాసిరకం ఆటను సమర్థించలేం కదా… పాన్ డబ్బా నడుపుకునే ఓ వ్యక్తి పెద్ద ఇండస్ట్రియలిస్టు అయ్యాడు, సక్సెస్ స్టోరీ కాబట్టి తన నాసిరకం ప్రొడక్టును మెచ్చి, తనకు మేకతోలు కప్పలేం కదా… అలాగని యండమూరి రాసిందాంట్లో తప్పుందని కాదు… అకారణ, అసందర్భ, ఉద్దేశపూర్వక విమర్శలకు ఆ మాటలు సరిగ్గా వర్తిస్తాయి…
Share this Article