ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఓ చెత్త… అది రేటింగ్స్‌లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది… సర్‌ప్రయిజులు లేవు, సడెన్ ఎంట్రీలు లేవు, రీఎంట్రీలు లేవు, అసలు ఈసారి సీజన్ మీద నిర్వాహకుల్లో ఎవడికీ ఇంట్రస్టు లేదు… దాదాపు నాలుగు గంటలపాటు ఆదివారం సాయంత్రం దీపావళి స్పెషల్ అని ప్రత్యేకంగా షో నడిపించారు… అసలే పాతాళంలో రేటింగ్స్ ఉన్నప్పుడు వీకెండ్ షో, అదీ పండుగ స్పెషల్ షో అంటే ఎంత క్రియేటివ్ వర్క్ జరిగి ఉండాలి… ప్చ్, ఏమీలేదు… జస్ట్, అలా గాలికి వదిలేశారు…
మధ్యలో కార్తిని పిలిచి, సర్దార్ సినిమా దర్శకుడు, ఒక హీరోయిన్‌ను కూడా పిలిచి ఆ సినిమా ప్రమోషన్ నిర్వహించాడు నాగార్జున… అంతేకాదు, హాట్‌స్టార్ ఓటీటీలో రాబోయే వెబ్ సీరీస్ ఝాన్సీ ప్రమోషన్ కోసం హీరోయిన్ అంజలిని పిలిచాడు… అంతేనా..? మధ్యలో ఏదో మిక్సీ యాడ్ ప్రమోషన్ చేయించాడు… మిగతాదంతా ఓ ట్రాష్… ఎంత అంటే..?
హైపర్ ఆదిని పిలిచారు… నాలుగు పంచ్ డైలాగులు వేస్తాడు, వినోదం అనుకున్నారు… కానీ ఎంత సోది స్క్రిప్టు రాసిచ్చారు తనకు అంటే, ప్రతిసారీ ఎలిమినేటై బయటికి వెళ్లిపోయే కంటెస్టెంట్లు చెబుతుంటారు కదా, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉంటున్నావు అని పేలవంగా, నాసిరకం డైలాగులు… హైపర్ ఆదితోనూ అలాంటి డవిలాగులే పలికించారు… చూసినంతసేపు పరమ వేస్ట్ అనిపించింది… ఒకటీఅరా తప్ప ఏమీపేలలేదు… ఆ దీపావళి తోకపటాకులు…
Ads
పండుగ స్పెషల్ అంటే ఆ పిచ్చి రీమిక్స్ పాటలకు డాన్సులు చేయంచడమా..? ఎవడు చెప్పాాడ్రా మీకు..? పోనీ, చేయించారు సరే… స్నేహ గుప్తాతో, అవికా గౌర్‌తో చేయించారు… ఆ పాటలూ బాగాలేవు, ఆ డాన్స్ కంపోజింగూ బాగాలేదు… అసలు ఈటీవీ షోలని వదిలి బయటి టీవీలకు రాదు రష్మి గౌతమ్… ఆమెను రప్పించి ఓ పాటకు డాన్స్ చేయించారు సరే… నిజానికి ఆమె మంచి డాన్సర్ కూడా… కానీ ఎంత దారుణం అంటే… ఓ చెత్త రీమిక్స్ సాంగ్, పైగా డాన్స్ కంపోజింగ్ బాగాలేదు… మొదట్లో ఆమె చెప్పులు ఆమెను స్కిడ్ చేయిస్తుంటే, మధ్యలో ఆపి, బేర్ ఫుట్‌తో డాన్సు చేయించారు…!!
షోలో బాగా హైలైట్ అయ్యింది ఫైమా… తన ఎనర్జీతో కాసేపు ఎంటర్‌టెయిన్ చేసింది… మిగతా కంటెస్టెంట్లు దాదాపు దేభ్యం మొహాలే… మధ్యలో సింగర్ శ్రీరామచంద్రను పిలిచి పాటలు పాడించారు… అవి కూడా బోరింగ్ పాటలు… ఎందుకు పిలిచారో, ఏం పాడించారో తనకే అర్థం కాలేదు… తను గత సీజన్ కంటెస్టెంటు కూడా…
కార్తి సినిమాలో వేరు, వేదికలపై వేరు… విచిత్రంగా ఉంటుంది తన మాటతీరు, బాడీ లాంగ్వేజీ… ఏతావాతా దాదాపు నాలుగు గంటలపాటు నాగార్జున ఏదో తిప్పలు పడ్డాడు గానీ… పండుగ స్పెషల్ వీకెండ్ షో కూడా తుస్సుమంది…!! ఈసారి సీజన్ కు వర్క్ చేస్తున్న క్రియేటివ్ టీం కావాలనే చేస్తోందా..? మాటీవీ వాడికి ఎప్పుడూ ఈ సందేహం రాలేదా..?
Share this Article