మిగతా టీవీలకు ఎలాగూ చేతకాలేదు… యాడ్స్ రాలేదేమో గానీ, ఎవ్వడూ దీపావళి స్పెషల్ షో ప్లాన్ చేయలేదు… మాటీవీ వాడు బిగ్‌బాస్ దీపావళి స్పెషల్ ప్లాన్ చేసి, ఆదివారం సాయంత్రం ఎలా భ్రష్టుపట్టించాడో చెప్పుకున్నాం కదా ఆల్‌రెడీ… కాస్త ఇలాంటి షోలలో కాస్త సీనియారిటీని, తన అనుభవాన్ని చూపే ఈటీవీ పూర్తిగా పండుగ ఉత్సాహాన్ని నాశనం చేసింది ఈసారి…
ఇదికదా పండుగ అంటే శీర్షికతో 3 గంటల షో… యాంకర్లు ఎవరూ దిక్కులేరు కాబట్టి రష్మిని, ఆడవాళ్లూ మీకు జోహార్లు యాంకరింగ్ చేసే రవిని తీసుకొచ్చి మీరు నడపండ్రా షో అన్నారు… సంగీతను, పోసాని చీఫ్ జడ్జిలు, గెస్టులు… అసలు ఈ సంగీతను ఎందుకు రుద్దుతున్నారో అర్థం కాదు… ఆమెకు తెలుగు రాదు, ఎవడేం మాట్లాడుతున్నారో తెలియదు… ఇంగ్లిషులో ఆమె చెప్పేది ప్రేక్షకుడికి అర్థం కాదు… ఇంద్రజ కాస్త అలవాటైన మొహం… ప్లజెంటుగా ఉంటుంది… స్పాంటేనిటీ ఉంది… సంగీతకు ఎక్కడ నవ్వాలో, ఎక్కడ కాస్త మొహం గంభీరంగా పెట్టాలో కూడా తెలియదు… ఈటీవీ ప్రేక్షకుల ఖర్మ… ఒక జడ్జి ఎలా ఉండకూడదో ఉదాహరణ…
ఇంతకు ముందు మాటీవీ బ్యాచును ఈటీవీ స్టూడియో మెట్లు కూడా ఎక్కనిచ్చేవాళ్లు కాదు… ఇప్పుడు సరిహద్దులు తెరిచేశారు… పాత బిగ్‌బాస్ సీజన్ల మహిళల్ని, సీరియళ్ల తారల్ని బోలెడు మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు… కానీ వాళ్లతో ఏం చేయించాలో ఎవడికీ తెలియదు… జస్ట్, అలా కూర్చుండిపోయారు… మరి వాళ్లనెందుకు తెచ్చుకున్నట్టు..? మరీ ఘోరం ఏమిటంటే..? ఎడిటింగ్ చేసినవాళ్లు ఒకామెనే పదే పదే చూపిస్తుంటే ‘చూసుకునే సోయి’ లేదు మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్లకు…
Ads
ఈమధ్య ఈటీవీ షో అంటేనే హైపర్ ఆది… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, ఇలాంటి స్పెషల్స్… ఏదయినా తను నాలుగు ర్యాగింగ్ డైలాగ్స్ వేస్తాడు, అదే కామెడీగా చెలామణీ అయిపోతోంది… తనకు తోడుగా ఆటో రాంప్రసాద్ సరేసరి… నిజానికి ఇద్దరూ యాక్టర్స్ కారు… పంచ్ డైలాగులు రాసుకునే రైటర్లు… కానీ ప్రస్తుతం మల్లెమాల కంపెనీ ఏ చెట్లూ కనిపించని ఎడారి మరి… చివరకు ఏ స్థాయికి తీసుకెళ్లారంటే…?
ప్రతి తెలుగువాడికీ ఇష్టమైన సినిమా భక్తకన్నప్ప… కృష్ణంరాజుకు నివాళి అంటూ ఆ సినిమాలోని పలు సీన్లను ఆటో రాంప్రసాద్‌తో నటింపజేసి, ఆయన ఆత్మను ఒకరకంగా అవమానపరిచారు… అంత ఘోరంగా ఉంది ఆ ఎపిసోడ్… ఇంకా నయం, హైపర్ ఆదితో చేయించారు కాదు… కట్ చేస్తే… హఠాత్తుగా కమెడియన్లు అందరూ అమ్మలను గుర్తుచేసుకుంటూ ఉంటారు… ఈ బిగ్‌బాస్ నుంచి తెచ్చిన ఆడలేడీస్ బ్యాచ్ కళ్లొత్తుకుంటూ ఉంటారు… చాలావరకు కృతకంగా… మరీ ఘోరమైన బోరింగ్ ఎపిసోడ్ ఏమిటంటే… లోకులు పలుకాకులు అనే మరో ఎపిసోడ్… (పేదల బస్తీకి వెళ్లి స్వీట్లు పంచి, పటాకులు అక్కడే కాల్చడం అనే కాన్సెప్టు కాసేపు బాగుంది…)
ఏమాటకామాట… చూస్తున్నంతసేపు బాగనిపించింది రీతూ చౌదరి, యశస్వి ఎపిసోడ్… తనను పిలిచారు, తను ఎప్పుడూ పాడే పాటలే ఒకటీరెండు పాడాడు… గుడ్… వెంటనే రీతూ తన వైపు పరుగెత్తుకెళ్లింది… యశస్వి భయపడి అటూఇటూ దాక్కోవడానికి ప్రయత్నించాడు… ఆమె హగ్ చేసుకుంటుందని భయం… సో వాట్..? యశస్వి అంటే ఆ పిల్లకు పిచ్చి ప్రేమ, గతంలో ఓసారి వేదిక మీదే వెళ్లి గాఠ్టిగా వాటేసుకుంది… నువ్వు దేనికంటే దానికి రెడీ అనేసింది… యశస్వి ఠారెత్తిపోయాడు…
రష్మి కలగజేసుకుని, తన అభిమానాన్ని హగ్ రూపంలో వ్యక్తీకరిస్తే అంత భయపడాల్సిందేముంది అని చెప్పాక కాస్త యశస్వి కుదుటపడ్డాడు, రీతూ వైపు ప్రేమగా చూశాడు… రీతూ కళ్లల్లో యశస్వి పట్ల ప్రేమను నిజంగా ఆమె మొహంలో చూడాల్సిందే… ఎ రియల్ ఎమోషన్, ఆ పిల్ల ఇక యశస్విని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అంటీముట్టని ఓ హగ్ ఇచ్చి వెళ్లిపోయింది… కనీసం దీన్నయినా అందంగా ప్రజెంట్ చేయలేక మల్లెమాల ఎడిటింగ్ టీం చేతులెత్తేసింది… మొత్తానికి పండుగ ఉత్సాహాన్ని నాశనం చేసి, ఇది కాదురా పండుగ అంటే అనిపించుకుంది ఈటీవీ…!!
Share this Article