.
జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయి ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన విధానం పేలవంగా అనిపించింది… తను సగటు యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ స్థాయిలో కూడా ప్రశ్నలు వేయలేక, జవాబులు చెప్పించలేక చేతులు ఎత్తేసినట్టు అనిపించింది…
రేవంత్‌రెడ్డికి ఒక్కటి కూడా ఇరుకునపెట్టగల ప్రశ్న వేయలేకపోయాడు… ఏవో కొన్ని వేయాలని ప్రయత్నించినా సరే, రేవంత్‌రెడ్డి అలవోకగా అసంబద్ధ సమాధానాలు ఇస్తూ, దాటవేస్తూ, జవాబుల్ని ఎటెటో తీసుకుపోతున్నా సరే రాజదీప్ నుంచి విలువైన అనుబంధ ప్రశ్నలే కరువయ్యాయి…
Ads
ఉదాహరణకు… ఎంత ప్రయత్నించినా దక్షిణాదిలో సీట్లు రావడం లేదనే కక్షతో బీజేపీ దక్షిణ రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తోందనీ, అందుకే డీలిమిటేషన్ ద్వారా సీట్లు తగ్గించే ప్రయత్నం చేస్తోందనీ రేవంత్‌రెడ్డి ఆరోపించాడు…
దక్షిణాది మీద ప్రతీకారం అనేది కేవలం ఓ రాజకీయ విమర్శ… ఏమాత్రం హేతుబద్ధ సమాధానం కాదు, నిజానికి ఇకపై పిల్లల్ని పుట్టిద్దాం అనే ఒకటీరెండు శుష్క మాటలు తప్ప స్టాలిన్ డీలిమిటేషన్ అన్యాయం మీద నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నాడు… బీజేపీ సహా అందరికీ లేఖలు రాసి, కలుద్దాం, చర్చిద్దాం అంటున్నాడు…
అవసరమే, డీలిమిటేషన్, హిందీ రుద్దుడు మీద స్టాలిన్ పోరాటమే సరైన పంథాలో ఉంది తప్ప బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోంది వంటి డొల్ల విమర్శల జోలికి పోవడం లేదు… ఇదేకాదు, ఎంతసేపూ రేవంత్‌రెడ్డి జవాబులు బీజేపీపై, మోడీపై టార్గెటెడ్‌గానే ఉన్నాయి, రాజదీప్ ప్రశ్నలూ అలాగే మారిపోయాయి…
ఒక జవాబు మాత్రం రేవంత్‌రెడ్డి సరిగ్గా ఇచ్చాడు… అమిత్ షా చెబుతున్న ప్రొరేటా ప్రకారం సీట్ల పెంపు అనే ఓ పిచ్చి వ్యాఖ్యకు అదెలా ఇంకా డేంజరో వివరంగా చెప్పాడు… అది సరైన పద్దతి, సరైన జవాబు… మరి దక్షిణాది మీద ప్రతీకారం అనే డొల్ల వ్యాఖ్యలు దేనికి..? స్ట్రెయిట్‌గా, సరైన పద్ధతిలో పంచ్ ఉండాలి…
గిఫ్ట్ సిటీలో పెట్టుబడులకు రాయితీలు ఇస్తారు, ఇంకెక్కడా ఇవ్వరు, వేస్ట్ గుజరాత్ మోడల్, ఆయనది టెస్టు మ్యాచ్… ఇలా మోడీ మీద, గుజరాత్ మీద తీసుకుపోయాడు విమర్శను రేవంత్ రెడ్డి… ఒకవేళ నిజంగానే తెలంగాణ మోడల్ పర్‌ఫెక్ట్ అయ్యే పక్షంలో ఆ క్రెడిట్ వైఎస్, కేసీయార్, చంద్రబాబులకు పోతుంది, గత ఏడాదిలో సాధించింది ఏమీ లేదు కదా, హైడ్రా కూల్చివేతలు తప్ప… మరి తెలంగాణ మోడల్ గురించి పదే పదే ఎందుకు చెబుతున్నట్టు…? అది మోడీకి జవాబు ఎలా అవుతుంది..?
ఎన్నికల్లో వాగ్దానాల పోటీ నడుస్తోంది, నెలకు 500 కోట్ల పెట్టుబడి వ్యయం కూడా చేతకావడం లేదు, ఆదాయమంతా జీతాలకు, వడ్డీలకే సరిపోతుంది అంటూనే… మరి నువ్వు అమలు చేసే ఉచితాల మాటేమిటి అంటే డిబేట్ జరగాలి అంటాడు… చేసేది చేస్తూనే డిబేట్ జరగాలి అనడం ఏమిటి..? రాజదీప్ సైలెంట్… చెప్పానుగా, ఉత్త పేలవమైన ఇంటర్వ్యూ… కులగణన మీద కూడా సేమ్… నీకూ రాహుల్‌కూ దూరం పెరిగిందట అంటే అక్కడ నో స్ట్రెయిట్ ఆన్సర్, నో అడిషనల్ క్వశ్చన్స్…
మా పార్టీకి అనుబంధ కమిటీలున్నాయి… బీజేపీకి మాత్రం నైస్ అండ్ ఐస్ పాలసీ ఉందనేది కూడా ఓ శుష్క సమాధానం… దీని మీద కూడా రాజదీప్ నుంచి వేరే ప్రశ్న లేదు… ఏదో తిరుపతికి రాయితీ ఇవ్వడం లేదా అంటాడు..? ఏమిస్తున్నాడు..? సేమ్, కుంభమేళా మీద గందరగోళపు సమాధానం, బహుశా దేశంలో ఒక్క రాజదీప్‌కు ఇంకెవ్వరికీ అర్థమై ఉండదు…
నేను పోలేదు, నా కుటుంబం పోయింది, ఐనా భద్రాచలం రమ్మన్నాను, వచ్చారా మోడీ, షా… అంటాడు రేవంత్ రెడ్డి… మరో డొల్ల సమాధానం… కుంభమేళా మోడీ, షా, బీజేపీ పార్టీ ప్రోగ్రామా రమ్మనడానికి..? రాహుల్ అనబడే హిందూద్వేషికి కోపం వస్తుంది కాబట్టి రేవంత్ పోలేదు… సోకాల్డ్ ఇండికూటమికి చెందిన లాలూ, ఖర్గే, మమతలు విషం కక్కారు కోట్ల మంది హిందువుల విశ్వాసాల మీద… ఈ అంశంపైనా రాజదీప్ ఫెయిల్యూర్…
ఇన్నాళ్లూ రాజదీప్ ఆహా ఓహో అంటున్నారు చాలామంది పాత్రికేయానికి సంబంధించి… ఉత్తదే… ఉత్త డొల్ల ఇంటర్వ్యూ… ఏదో ఓ గెస్టు వచ్చాడు, మేమేదో అడిగాం, మమ, అయిందనిపించాం అన్నట్టుగా ఉంది… మొత్తం ఇంటర్వ్యూ కీన్‌గా వెళ్తే ఇంకా దీనికి నాలుగైదు రెట్లు రాయొచ్చు… కానీ వేస్ట్… సారీ టు సే మిస్టర్ రాజదీప్, నువ్వేదో తోపు అనుకున్నాం…!! మా తెలంగాణలో పెయిడ్ యూట్యూబర్స్ వంద రెట్లు బెటర్..!!
ఇక ఫోర్త్ సిటీ… ఫ్యూచర్ సిటీ, 30 వేల ఎకరాలు, ల్యాండ్ పూలింగ్, న్యూయార్క్‌తో పోటీ… ఐదేళ్లు ఆగండి అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద నో కామెంట్… అబ్రకదబ్ర… రాయ్‌పూర్ తెలుసా..? అమరావతి తెలుసా..? అవునూ… 500 కోట్ల కేపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టలేని దురవస్థలో ఉన్న నగరం, రాష్ట్రం ఒలింపిక్స్ కండక్ట్ చేస్తుందా..? ఫ్యూచర్ సిటీ కడుతుందా..? పక్కా చంద్రబాబు శిష్యరత్నమా… అచ్చుగుద్దినట్టు అదే పాలన..!!
తనూ చెబుతాడు కదా, సైబరాబాద్ కట్టాను, హైదరాబాద్ కట్టాను, సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను అని… ఆ స్కూల్ విద్యార్థిలాగే ఉండాలీ అనుకుంటే ఇక అది రేవంత్ రెడ్డి ఇష్టం..!!
Share this Article