Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆది మీమాంస..! కేసీయార్, రేవంత్… ఎవరు నిజంగా రెయిజింగ్..?

February 5, 2025 by M S R

.

Narukurti Sridhar …….. ‘ఆది మీమాంస ‘ ( success is never ending … failure is never final )

‘ఆది మీమాంస ‘ అని ఒక ఒరియా మూవీ ఉంది . 1991 లో జాతీయ అవార్డు పొందిన చిత్రం . ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్ లో వచ్చినప్పుడు చూసినట్లు గుర్తు . మోహన్ గోఖలే … నీనా గుప్తా … అప్పట్లో ఈ మూవీ నాకు ఎంతగా నచ్చిందంటే నా కూతురికి కూడా చాలా సార్లు దాని గురించి చెప్పాను . అది పోటీలో ఇరుక్కున్నప్పుడల్లా విజయం అంతిమం ఎందుకు కాదో చెప్పడానికి వాడుకున్నాను .

Ads

సినిమా ఇప్పుడు పూర్తిగా గుర్తు లేదు కానీ సారాంశం ప్రస్తావిస్తాను . రెండు పక్క పక్క కుటుంబాలు ( ఒకరు శాకాహారులు, మరొకరు మాంసాహారులు ) ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటాయి .

మాంసాహారులు శాకాహారుల ఇంట్లో తినేసిన ఎముకలు పడేస్తే , శాకాహారులు తమ ఇంటివైపు నుంచి వెళ్లే డ్రైనేజీని మూసేసి మాంసాహారులని హింసిస్తారు . ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది . ఆ పిల్లలని దగ్గరికి చేర్చి మోహన్ గోఖలే శర్మిష్ట , దేవయానిల కథ చెబుతాడు .

శర్మిష్ట రాజకుమారి అయితే దేవయాని రాజగురువు శుక్రాచార్యుని కూతురు . ఇద్దరూ నదిలో స్నానానికి వెళితే ఈదురుగాలి వల్ల వారి దుస్తులు కలగా పులగమై ఒకరి దుస్తులు వేరొకరు ధరిస్తారు . శర్మిష్ట కోపంతో దేవయానిని నూతిలోకి తోసి , చనిపోయిందని భావించి వెళ్ళిపోతుంది.

అయితే వేటకి వచ్చిన యయాతి దేవయానిని రక్షిస్తాడు . దేవయాని తండ్రి సాయంతో రాజుని బెదిరించి శర్మిష్టని దాసిగా చేసుకుంటుంది . ఆపై యయాతిని పెళ్లి చేసుకుని శర్మిష్టని దాసిగా తీసుకుని వెళ్తుంది .

దేవయాని గర్భంతో ఉన్న సమయంలో శర్మిష్ట యయాతిని వశపరుచుకుంటుంది . ఇద్దరికీ ముగ్గురు కొడుకులు కూడా పుడతారు . ఆ విషయం తెలిసిన శుక్రాచార్యుడు యయాతిని వృద్ధుడిగా మారమని శపిస్తాడు . యయాతి కొడుకుల్లో ఒకడైన ‘పురు ‘ తన యవ్వనాన్ని ఇవ్వడంతో యయాతి మళ్లీ యువకుడిగా మారి వెయ్యేళ్ళు జీవించి రాజ్యాన్ని , యవ్వనాన్ని ‘పురు ‘ కి ఇస్తాడు .

ఆ ‘పురు ‘ కురు పాండవుల మూల పురుషుడు …

“ పిల్లలూ శర్మిష్ట దేవయానిని నూతిలో తోసినప్పుడు విజయం ఎవరిది ?”
“ శర్మిష్టది …”
“ మరి దేవయాని యయాతిని పెళ్లి చేసుకుని శర్మిష్టని దాసిగా పొందినప్పుడు !”
“ దేవయానిది “
“ అలాగే శర్మిష్ట యయాతితో పిల్లల్ని కని కురువంశ మూలపురుషుడిని కన్నప్పుడు!”
“ శర్మిష్టది “
“ యయాతికి శాపం తగిలినప్పుడు !”
“ దేవయానిది “

………
ఇదంతా ఎందుకు రాసానంటే విజయం శాశ్వతం కాదని చెప్పడానికి . “ success is never ending … failure is never final “

…
“ పిల్లలూ , తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ లో విలీనం అవుతుందని భావించి రాష్ట్ర విభజనని వేగవంతం చేసినప్పుడు విజయం ఎవరిది ?”
“ కాంగ్రెస్ ది “
“ మరి కాంగ్రెస్ ని పక్కన బెట్టి ఎలక్షన్స్ లో నెగ్గి టీడీపీ శాసనసభ్యుల్ని లాక్కున్నప్పుడు !”
“టీఆర్ఎస్ ది “
“ రేవంత్ రెడ్డిని సూట్ కేసు తో పట్టుకుని జైల్ కి పంపించి సంచలనం చేసినప్పుడు !”
“ కెసిఆర్ ది “
“ అదే కెసిఆర్ ని ప్రజలు ఈసడించుకునేలా చేసి , ఆయన్నే ఓడించి అధికారం కైవసం చేసుకున్నప్పుడు !”
“ రేవంత్ రెడ్డిది “

….
టీడీపీ ఎమ్మెల్యేలని పార్టీ మార్పించడానికి వాళ్ళని ఏకంగా మంత్రులని చేయడం , సూట్ కేసుతో డబ్బులు తీసుకుని వెళ్లి ఇవ్వడం కంటే ఎక్కువే . తెరవెనక చాలా లావాదేవీలు జరిగే ఉంటాయి . సోషల్ మీడియా వీరులు ఎలా అనుకున్నా ప్రజలు అర్థం చేసుకున్నారు . అందుకే రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు .

అత్యంత వేగంగా జగన్ దారి పడుతున్న రేవంత్ ని రేపు జనం ఓడించినా ఆశ్చర్యం లేదు . ఒకప్పుడు చంద్రబాబు ప్రాపకం కోసం ఆయన ఇంటి చుట్టూ తిరిగిన కేసీఆర్ స్వయంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం కచ్చితంగా విజయమే .

అది తలకెక్కి అడ్డమైన రాజకీయాలు ఆడి కూడా చంద్రబాబుని ‘ డర్టీ పొలిటిషన్ ‘ అనడం తనని తాను స్టేట్స్మన్ లా భావించుకోవడం హాస్యాస్పదం ! అందరూ ఆ తానులో ముక్కలే ! తాను చేస్తే ప్రజల కోసం ! ఎదుటి వారు చేస్తే డర్టీ పాలిటిక్స్ !!

కేటీఆర్ , లోకేష్ కచ్చితంగా భవిష్యత్తు ఉన్న , ఆధునిక భావాలున్న సమర్థ నాయకులు . వాళ్లు వేగంగా మారుతున్న యువత ఆకాంక్షలను , ఆధునికతని ప్రతిబింబిస్తే మంచిది . ప్రత్యర్థులపై అత్యంత పేలవమైన సవాళ్లు విసరడం ద్వారా కాలం తీరిన రాజకీయాన్ని ఆశ్రయిస్తే తిరోగమనం వైపు వెళ్తున్నట్లే ! మీరేంటో అలాగే ఉండండి . మీరెంత వీరులో ప్రజలకి తెలుసు !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions