Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!

September 11, 2025 by M S R

.

రాజాసింగ్ ఇప్పుడు బీజేపీలో లేడు, సస్పెండ్ చేశారు… తెలంగాణ బీజేపీని శాసించే పెద్దలతో ఎప్పుడూ తనకు పడటం లేదు… అలాగని బీజేపీని ద్వేషించే సమాజంలో చేరడు… ఫైట్ చేస్తూ ఉంటాడు… ఇంటర్నల్ ఫైటర్…

ఇప్పుడు కూడా బీజేపీ స్టేట్ కమిటీ కూర్పు మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు… సెలుపుతున్నడు, అంటే కుదుపుతున్నడు… ఏమయ్యా, కిషన్ రెడ్డీ, కమాన్, ఇక్కడ పోటీచేద్దాం, నీ పెతాపమో నా పెతాపమో అని సవాల్ విసురుతున్నడు…

Ads

కానీ రాజాసింగ్ పట్టుకోలేకపోయిన ఓ పాయింట్ ఉంది… సవాళ్ల ఆతృతలో స్టేట్ కమిటీని ఓసారి గట్టిగా పరిశీలించలేదేమో…! 22 మందితో రాష్ట్ర కమిటీ వేస్తే బీజేపీ శ్రేణులే షాకయ్యాయి అందులో పేర్లు చూసి… వారిలో కొందరు పార్టీ వాళ్లకే తెలియదు… విశేషం ఏమిటంటే..? ఆ 22 మందిలో ఆరుగురు వారసనేతలే… (నేతలు అనొచ్చో లేదో తెలియదు…)

ఓసారి పార్టీ కమిటీని చూడండి… ఇదుగో…

tbjp

అబ్బే, నిరాశపడకండి, ఇంకా మస్తు పోస్టులున్నయ్ అని ఏదో అధ్యక్షుడు రాంచందర్రావు చెబుతున్నాడు కానీ… మరీ స్వజనానికే సరిగ్గా తెలియని వాళ్లు స్టేట్ కమిటీ లీడర్లు ఏమిటి అధ్యక్షా…? పైగా సెక్రెటరీ పోస్టులు..!!

వారసత్వం అనర్హత కాదు, నిజమే… కానీ వారసత్వమే అర్హత కాకూడదు… పైగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని పదే పదే బలంగా చెప్పుకునే బీజేపీలో..! అది అనైతికమో కాదో తెలియదు కానీ పనిచేసే వర్కర్లను తీవ్రంగా నిరాశపరచడమే…

నంబర్ 10… తూళ్ల వీరేందర్ గౌడ్… ఆయన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు… తను ఏకంగా పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఇప్పుడు… నంబర్ 14… భరత్ ప్రసాద్… ఈయన మాజీ మంత్రి పోతుగంటి రాములు కొడుకు… స్టేట్ సెక్రెటరీ… తను నాగర్‌కర్నూలు ఎంపీగా చేశాడు, ఇది వోకే అనుకోవచ్చు…

నంబర్ 15… బండారు విజయలక్ష్మి… మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బిడ్డ… ఇంతకుముందు అధికార ప్రతినిధి పోస్టు ఇస్తేనే ఓ డిబేట్ లేదు, ఓ ప్రకటన లేదు, ఓ ప్రెస్ మీట్ లేదు… ఇప్పుడు సెక్రెటరీగా ప్రమోషన్ ఇచ్చారన్నమాట… సూపర్…

నంబర్ 17… కరణం ప్రణీత… సెక్రెటరీ అట ఈమె కూడా… అసలు ఈమె పేరే తెలియదు చాలామందికి… ఎవరూ అని ఆరా తీస్తే తెలిసింది, ఆమె మాజీ మంత్రి రాంచందర్‌రావు కోడలు… నంబర్ 18… బద్దం మహిపాల్ రెడ్డి… ఈయన వెటరన్ బీజేపీ స్టార్ బద్దం బాల్‌రెడ్డి కొడుకు… చివరగా… ఎన్వీసుభాష్… మరీ చీఫ్ స్పోక్స్ పర్సన్ అని పోస్టు ఇచ్చారు…

ఎవరబ్బా అని ఆరా తీస్తే తెలిసింది… పీవీ నరసింహారావు మనమడు అట… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి ఉంది కదా… ఆమె అక్క కొడుకు అట… ఇలాంటి స్టేట్ కమిటీ కూర్పుతో బీజేపీ హైకమాండ్ తన కేడర్‌కు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..?

స్టోరీ అప్‌డేట్ :: ఈ కమిటీలో నంబర్ 4… జయశ్రీ… వైస్ ప్రెసిడెంట్… ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బొమ్మ వెంకన్న బిడ్డ…! ఈమె కూడా ఎవరికీ తెలియదు పెద్దగా పార్టీలో… వెరసి 22 మందిలో ఏడుగురు వారసనేతలు… అంటే మూడోవంతు వీళ్లే… ఫాఫం టీబీజేపీ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions