Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

త్రిషపై సింగర్ సుచిత్ర అక్కసు ఉత్త మీనింగ్‌లెస్..!

May 15, 2026 by M S R

.

తరచూ సినీ ప్రముఖుల వ్యక్తిగత అంశాలను బహిరంగం చేసే కంట్రవర్సీ కేరక్టర్ సుచీ లీక్స్ సింగర్ సుచిత్ర తెలుసు కదా… మళ్లీ తెర మీదకు వచ్చింది… చిన్మయి, కస్తూరి, సుచిత్ర… ఇలా కొందరుంటారు… ఇప్పుడు త్రిష మీదకు మళ్లింది సుచిత్ర కన్ను… విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరైంది కదా… అది ఆమెకు నచ్చలేదట… ఆమెకు నచ్చాల్సిన అవసరం ఏమిటి..? త్రిష విజయ్ ఇష్టసఖి, అన్నీ అనుకూలిస్తే పెళ్లీ చేసుకుంటారు, నడుమ ఈమెకు నొప్పేమిటి అంటారా..? ఆమె ఏమన్నదో చూద్దాం…

ఒక వీడియోలో మాట్లాడుతూ తాను త్రిషను అస్సలు ఇష్టపడనని అంటోంది…. “నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు… నేను ఇది వ్యక్తిగత ద్వేషంతో చెప్పడం లేదు… విజయ్ అంటే నాకు చాలా ఇష్టం… ఎవరి పక్షం పట్టకుండా నిజాయితీగా నా అభిప్రాయం చెబుతున్నాను… విజయ్ భార్య, పిల్లల మానసిక పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి…

Ads

సుచిత్ర అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా విజయ్- త్రిషలపై వస్తున్న ప్రచారానికి సంబంధించిన పలు పోస్టులు, స్టోరీలు షేర్ అవుతున్నాయి… దీంతో ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలా? లేక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రచారమా? అనే చర్చ కూడా మొదలైంది… తమిళ సినీ పరిశ్రమలో విజయ్, త్రిష జంటకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి…

అందుకే వీరిద్దరిపై వచ్చే ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది… అయితే ఈ మొత్తం వివాదం మరోసారి భారతీయ సినీ సంస్కృతిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ప్రజలు చూపించే అతి ఆసక్తిని బయటపెడుతోంది… ఒక రాజకీయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరు హాజరయ్యారు? ఎవరు ఎవరిని అభినందించారు? వంటి అంశాలే ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలపై ఊహాగానాలకు దారితీస్తున్నాయి…

సోషల్ మీడియా యుగంలో సినీ తారల వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, పబ్లిక్ ఇమేజ్ అన్నీ ఒకే చర్చలో కలిసిపోతున్నాయి… ఫలితంగా వాస్తవాలకన్నా ప్రచారాలు, సంకేతాలు, ఊహాగానాలే ఎక్కువగా ప్రాధాన్యం పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది…

నిజానికి విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసుకుంది, కారణం విజయ్- త్రిష బంధమే… ఇది బహిారంగం, త్రిషతో విజయ్ సంబంధం బహిరంగ రహస్యం… సో, సినిమాల్లోనే కాదు, అన్నిరంగాల్లోనూ బ్రేకప్పులు, విడాకులు, మళ్లీ పెళ్లిళ్లు కామన్ అయిపోతున్న తరుణంలో… విజయ్ పిల్లలు కూడా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకున్న వేళ… విజయ్ కాపురాన్ని త్రిష చెడగొట్టిందనే ప్రచారానికి పెద్ద విలువ లేదు… రెండురోజులు ముచ్చటించుకుని వదిలేయడానికి తప్ప..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions