మొత్తానికి మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి తనే స్వయంగా రంగంలోకి దిగి, సుడిగాలి సుధీర్ ఇష్యూను సెట్ చేసుకున్నట్టున్నాడు..! ఈమధ్య చాలా ప్రచారం జరిగింది కదా, జబర్దస్త్‌ను సుధీర్ విడిచివెళ్లిపోతున్నాడు, తనతోపాటు ఇక ఆ టీం కూడా డిస్టర్బ్ కాబోతుంది అని..! తనకు సినిమాలతో బిజీ, అందుకే టైం ఇవ్వలేకపోతున్నాడు, అందుకే వదిలేస్తున్నాడు అని ఫేక్ వార్తలు వచ్చాయి… కానీ సుధీర్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా జబర్దస్త్ విడిచిపెట్టేరకం కాదు… తనకే కాదు, కమెడియన్లందరికీ జబర్దస్త్, టీవీ కామెడీ షోలు పాడిగేదెలు… ఎవరూ వదులుకోరు… కానీ మల్లెమాల టీంలో ఒకరిద్దరితో సుధీర్‌కు ఇష్యూస్ ఉన్నయ్, అది నిజం… ఎక్సట్రా జబర్దస్త్‌లో తను కంటిన్యూ కావడానికి సుధీర్ బెట్టు చేసిన మాట నిజం… ఐతే అదే జరిగితే అది ఈటీవీకి నష్టం, ఏ జీటీవీ వాడో, ఏ మాటీవీవాడో రెట్టింపు జీతం ఇవ్వడానికీ రెడీ… కారణం :: ఒకటి ఈటీవీ కామెడీ షోలను డిస్టర్బ్ చేయడం, తమకు ఉపయోగపడటం…
ఈ సంగతి సుధీర్కూ తెలుసు… ఈటీవీకి తెలుసు, మల్లెమాలకు తెలుసు… ఎవరూ తక్కువ కాదు, ఎవరి కోణం వాళ్లది… జబర్దస్త్ మాత్రమే కాదు, మల్లెమాల టీంతో సుధీర్ ఇష్యూస్ ‘ఢీ’ డాన్స్ తదుపరి సీజన్లో తను కొనసాగుతాడా అనే ప్రచారానికీ, లేదు, ఆల్రెడీ సుధీర్ ప్లేసులో వేరే ఎవరినో సెలెక్ట్ చేశారని కూడా వార్తలొచ్చినయ్… నిప్పు లేనిదే సోషల్ పొగ రాదు కదా… సరే, హైపర్ ఆది మంచువిష్ణు ఇష్యూ సెటిల్ చేసినట్టుగానే, సుధీర్ ఇష్యూ కూడా సెట్ చేసినట్టున్నారు… అయితే ‘‘మేం జబర్దస్త్ వీడిపోవడం లేదు’’ అనే క్లారిఫికేషన్ కూడా అదే ఎక్సట్రా జబర్దస్త్‌లో ఓ స్కిట్ ద్వారా వెరయిటీగా చెప్పడానికి సుధీర్ అండ్ టీం విఫలప్రయత్నం చేసింది… తాజా ప్రోమో ఓసారి పరిశీలిస్తే…
Ads
ఆటోరాంప్రసాద్, సుధీర్, గెటప్ సీను ముగ్గురూ కలిసి డాన్స్ చేస్తారు, మేం ఓ విషయాన్ని ఈ వేదికగా చెప్పాలనుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి అని మొహాలు మాడ్చుకున్నట్టు పెట్టారు… కానీ ఆ పక్కనే నిల్చున్న సుధీర్ నవ్వుతూ చూస్తున్నాడు, దాంతో అర్థమైపోయింది… ఈ స్కిట్ కూడా ఓ కామెడీ క్లారిఫికేషన్ అని… నిజంగా వాళ్లు జబర్దస్త్ షో వీడిపోతున్నారు, అదే చెప్పి వెళ్లిపోతున్నారు అన్నట్టుగా ప్రోమో కట్ చేశారు తెలివిగా.,. రోజా షాక్‌తో చూస్తున్నట్టు మరో ఇమేజీ… వాళ్లు వేదిక నుంచి వెళ్లిపోతున్నట్టు మరో దృశ్యం… కానీ తీరా అసలు షోలో చెబుతారన్నమాట… అబ్బే, అవన్నీ ప్రచారాలు, మేమెక్కడికీ పోవడం లేదు, మల్లెమాల మా దేవుడు, ఈటీవీ మా కన్నతల్లి, రోజా మా అక్క, రష్మి మా దోస్త్… వీళ్లందరినీ విడిచిపెట్టి పోతామా… హవ్వ, అబద్దం అన్నట్టుగా ఓ కలరింగు, ఓ కవరింగు ఇచ్చేస్తారన్నమాట… మొత్తానికి సోషల్ ప్రచారానికి కూడా ఓ కామెడీ స్కిట్ రూపంలో క్లారిఫికేషన్ ఇస్తూ, దాన్ని కూడా ప్రోమోలో నెగెటివ్ అర్థమొచ్చేలా కట్ చేసి… ప్రచారంలో పెట్టి… వావ్, భలే క్రియేటివ్ మెదళ్లు భయ్యా మీవి…!! మామూలు కమెడియన్లయితే ఇలాంటి క్లారిటీలు ఏ ఫేస్బుక్ లైవ్ వీడియోలోనో ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్లు… కానీ మీరు ‘‘అంతకుమించి’ కదా…!!
Share this Article