Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నొచ్చిండు… భిన్నమైన ఆ కామెడీ షోలోకి మళ్లీ సుడిగాలి సుధీర్…

December 19, 2023 by M S R

సుడిగాలి సుధీర్… సినిమాల మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు ఈమధ్య… కానీ నిజానికి తనది బుల్లితెర మీద సూపర్ స్టార్ స్టేటస్… ఆల్ రౌండర్… సినిమాలు చేస్తున్నా సరే టీవీ వర్క్ మాత్రం మిస్ కాడు… ఆహా ఓటీటీ వాళ్ల ప్రోమో ఒకటి చూస్తే ఆశ్చర్యం వేసింది… ‘అన్నొచ్చిండు’ అని చెబుతూ ప్రచారం చేసుకుంటోంది ఆ ప్రోమో… అన్న అంటే సుధీర్… ఎక్కడికి వచ్చాడు అంటారా..? చదవండి…

తెలుగు టీవీల్లో కామెడీ షో అంటే జబర్దస్తే… తరువాత ఆ రేటింగ్స్, ఆ యాడ్స్ డబ్బులు ఎక్కువ కావడంతో ఇంకా పిండుకోవడానికి ఎక్సట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు… కానీ అనేకానేక అవలక్షణాలు సోకి, ద్వంద్వార్థాలు, వెగటు బూతులు, అక్రమ సంబంధాల స్కిట్లు నిండిపోయి ఎయిడ్స్ రోగిలా మారిపోయింది క్రమేపీ… అనేక మంది జడ్జిలు, కమెడియన్లు వస్తుంటారు, పోతుంటారు… కానీ ఆ ఫార్మాట్ మారదు, ఆ పతనమూ ఆగదు…

దాన్నుంచి బయటపడిన నాగబాబు జీతెలుగులో ఏదో షోకు నాయకత్వం వహించాడు గానీ… సేమ్, అదే జబర్దస్త్ ఫార్మాట్… నాలుగు రోజులకే నాసిరకం, నాగబాబు పట్ల వ్యక్తిపూజలతో అదీ దారుణంగా దెబ్బతినిపోయింది… అంతకుముందు మాటీవీ కూడా చేతులు కాల్చుకున్నట్టుంది… ఈటీవీయే స్టాండప్ కామెడీ షో ఒకటి స్టార్ట్ చేసి, అదీ సక్సెస్ లేక ఈటీవీ ప్లస్‌కే పరిమితం చేసింది అప్పట్లో…

Ads

sudheer

ఈ స్థితిలో ఆహా ఓటీటీ కామెడీ కంటెంట్ కోసం కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ అని ఓ షో ప్లాన్ చేసింది… దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జి… సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి హోస్టులు… జబర్దస్త్ ఫార్మాట్ గాకుండా కొత్తరకంగా డిజైన్ చేశారు… ఫస్ట్ సీజన్ బాగానే హిట్టయింది… వేణు, హరి, రాజు, సద్దాం, అవినాష్, భాస్కర్ (ప్లస్ జ్ఙానేశ్వర్) తదితరులు కమెడియన్లు… కొంత గ్యాప్ తరువాత సెకండ్ సీజన్ ఈమధ్యే స్టార్టయింది… అనిల్ రావిపూడి దర్శకుడిగా బిజీ అయినా ఈ షోలో మాత్రం కంటిన్యూ అయిపోతున్నాడు…

బలగం తరువాత వేణు బిజీ అయిపోయాడు… తన ప్లేసులో రోహిణిని తీసుకొచ్చారు… మంచి మార్పు… ఆమె టైమింగ్ బాగుంటుంది, ప్రస్తుతమున్న లేడీ కమెడియన్లలో బెటర్… ఫైమా ఉంటే ఇంకా బాగుండేదేమో,.. లేడీ కమెడియన్లలో ఇప్పుడు ఆమెది స్టార్ స్టేటస్… దీపిక పిల్లి ఏదో సినిమాలో హీరోయిన్‌గా చేస్తుండటంతో ఆమె ప్లేసులో శ్రీముఖిని తీసుకొచ్చారు… సుడిగాలి సుధీర్ లేకపోయినా జస్ట్, శ్రీముఖితో నడిపించొచ్చు అనుకున్నారు… కానీ శ్రీముఖి మరీ మొనాటనస్ అయిపోయిన తీరును వాళ్లు పరిగణనలోకి తీసుకోలేదు…

రెండుమూడు ఎపిసోడ్లు అయిపోయాక సుధీర్‌ను వద్దనుకుని తప్పు చేసినట్టు తెలిసినట్టుంది… దాంతో అర్జెంటుగా సుధీర్‌ను మళ్లీ ఈ షోలోకి తీసుకొచ్చారు… ‘‘సుధీర్ మళ్లీ ఈ షోలోకి వచ్చాడు’’ అని ప్రచారం చేసుకోవడానికి ‘‘అన్నొచ్చిండు’’ అని ఆ ప్రోమో రిలీజ్ చేశారు… పోనీ, అదైనా క్లారిటీ ఉందా అంటే అదీ లేదు… తను హోస్టా..? ప్రోమో చూస్తే అలా లేదు, ఇతర కమెడియన్లతోపాటు ఆ గుంపులో ఒకడిగా కూర్చున్నాడు… శ్రీముఖితో కలిసి హోస్టింగ్ చేస్తున్నట్టా..? అలా కూడా కనిపించలేదు…

కామెడీ ఫార్మాట్ కూడా పెద్దగా మార్చలేదు… ఇంకాస్త నాణ్యత పెరగాల్సి ఉంది… కాకపోతే జబర్దస్త్ తరహాలో బూతులు, అక్రమ సంబంధాలు, ఓయో కల్చర్ గట్రా లేవు కాబట్టి ప్లజెంటుగానే ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions