Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుడిగాలి సర్కార్… ఓవరాక్షన్‌తో తెగ చిరాకెత్తించిన బాబా భాస్కర్…!

July 5, 2024 by M S R

బాబా భాస్కర్… బాగా ఎనర్జిటిక్… సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ, ఆటపట్టిస్తూ ఎప్పుడూ ఓ జోష్ నింపుతుంటాడు తన చుట్టూ ఉన్న వాతావరణంలో… బిగ్‌బాస్ దగ్గర నుంచి తెలుగు టీవీ షోలన్నింటిలోనూ కనిపిస్తుంటాడు…

కానీ తొలిసారి ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ షోలో బాబా భాస్కర్ ఓవరాక్షన్ చూస్తే చిరాకొచ్చింది, చికాకు కలిగింది… అఫ్‌కోర్స్, తను ప్రోగ్రాం స్క్రిప్ట్ రైటర్లు చెప్పిన పంథాలోనే పోయినా టూమచ్ అయిపోయింది… నిజానికి ఇలాంటి షోలలో స్పాంటేనియస్ జోకులు గట్రా తక్కువే…

కంటెస్టెంట్ల పరిచయం దగ్గర నుంచి మొత్తం ఓ డ్రామా… కానీ అందరూ కలిసి రక్తికట్టిస్తారు… అఫ్‌కోర్స్, టీవీ షోలన్నీ అంతే కదా… బాగా ఎడిటయ్యాకే కదా, ప్రోమోల మీదుగా ఎప్పుడో ప్రసారమవుతాయి… ఇవేమీ రియల్ రియాలిటీ షోలు కావు కదా… నిజానికి ఈ సర్కార్ షోకు మెయిన్ అసెట్ సుధీర్… ప్రదీప్ హోస్ట్ చేశాడనే విషయాన్నే అందరూ మరిచిపోయారు, అలా సుధీర్ మరిపించాడు…

Ads

తన ప్లేబాయ్ తరహా జోకులు… కంటెస్టెంట్లు కూడా దానికి తగ్గట్లే మాట్లాడటం బాగానే రక్తికడుతోంది… కానీ పదే పదే బాబా భాస్కర్ ప్రదీప్ ఎక్కడరా..? అంటూ అనేకసార్లు తెగ విసిగించేశాడు… ఈసారి ఎపిసోడ్‌లో అనసూయ, గీతామాధురి, బాబా భాస్కర్, మనో పాల్గొన్నారు… మనో ఎందుకో డల్‌గా కనిపించాడు…

sarkar

తనకు అలవాటైనట్టే ఏదో పిచ్చి డ్రెస్ వేసుకుని వచ్చింది అనసూయ… కానీ వేరేవాళ్లతో పోలిస్తే బెటర్‌గా ఆడింది, ఆడించారు… గీతామాధురి కూడా పర్లేదు… కాకపోతే మరీ ఎన్డీయే ఫుల్ ఫామ్, తూర్పు తిరిగి నిలబడితే ఎడమ వైపు ఏ దిక్కు వంటి, నెలలో ఎనిమిదో తిథి పేరేమిటి వంటి మహా కష్టమైన గొట్టు ప్రశ్నలు నవ్వు పుట్టించాయి కొన్ని…

కానీ చివరలో నిజంగానే ఓ కష్టమైన ప్రశ్న… జగన్నాథుడి రథం పేరు ఏమిటి…? చాలామందికి తెలియదు… నంది ఘోష్ అట… సెల్ ఫోన్ చూపించి… వెంటనే మొబైల్ కీ బోర్డులో బీ, సీ నడుమ ఏ లెటర్ ఉంటుందనేదీ మంచి ప్రశ్నే… గుర్తుకు తెచ్చుకోవాలనుకున్నా గుర్తురాదు… అది వీ..!

ఈటీవీలో వచ్చే సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ స్టార్స్ లో భాను, ఆషు రెడ్డి కూడా బాగానే చేస్తున్నా అదెందుకో రేటింగ్స్ సంపాదించడం లేదు… ఈ ఆహా ఓటీటీ సర్కార్ షో మాత్రం బాగానే క్లిక్కయింది… ఈసారి ఎపిసోడ్ స్క్రిప్టు రైటింగు కొంత బాగాలేదు గానీ, స్థూలంగా షో బాగానే ఉంటోంది..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీం కోర్టూ కొట్టేసింది… కిం కర్తవ్యం..? ఏమీ లేదు… అంగీకరించడమే..!!
  • ఆ సినారె పాట… భారతీరాజా చిత్రీకరణలో… మరుపురాని ఆపాతమధురం…
  • Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!
  • ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్… ఈ యుద్ధం ఏం నేర్పింది మనకు..?
  • కమ్‌తాయి… అపరిచితుడు… విరోధా‘బాసుడు… వెరసి వీరలౌక్యుడు…
  • 824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions