Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనోజ్ ఇంటి జనరేటర్‌లో షుగర్… ఎవరి కుట్ర..? పేలుతుందా..?

December 16, 2024 by M S R

.

మంచు కుటుంబంలో తండ్రీకొడుకులు, ఇద్దరు సోదరుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది… అది ఇప్పట్లో తెగదు…

బౌన్సర్లను పెట్టుకుని దాడులు చేయించుకునే దశ దాకా వెళ్లిపోయింది… నిజమేంటో తెలియదు గానీ… మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో విష్ణు షుగర్ పోయించాడనీ, అది పేలిపోయే కుట్ర చేశాడని ఓ వార్త కనిపించింది…

Ads

manchu

మనోజ్ తాలూకు బట్టలు, ఇతర సామగ్రి మొత్తం లారీల్లో నింపేసి, జల్‌పల్లి ఇంటి నుంచి పంపించేశాడు మోహన్‌బాబు అని మరోవార్త ఆమధ్య కనిపించింది… మరి ఇది ఏ ఇంట్లో జరిగిందో తెలియదు… సరే, ఆల్రెడీ ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకున్నారు కదా… ఇది మరో కేసు అవుతుందేమో…

అయితే నిజంగా జనరేటర్‌లో షుగర్ పోస్తే అది ప్రమాదకరమా..? పేలుతుందా..? నో… మిత్రుడు బీటీ గోవిందరెడ్డి ఏమంటాడంటే..?

‘‘పెట్రోల్, డీజిల్ మోటార్ల ఫ్యూయల్ ట్యాంక్ లో షుగర్ (C12 H22 O11)ను కలిపితే ఇంజన్ డ్యామేజి అవుతుందా?
తమ ఇంటి జనరేటర్ లో షుగర్ పోసి కుట్రకు పథకం వేసారని మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో… ఈ శాస్త్రీయ వివరణ…

generator
ఎలా ప్రచారంలోకి వచ్చిందో కాని, వాస్తవానికి ఫ్యూయల్ లో చక్కెర కలపడం వల్ల ఇంజన్ కు ఎలాంటి నష్టం వాటిల్లదు. అసలు డీజిల్, పెట్రోల్, మరో హైడ్రోకార్బన్ అయినా వాటితో షుగర్ రసాయన చర్య జరపదు.

బరువుగా ఉండే షుగర్ ట్యాంక్ అడుగుకు చేరి ఫ్యూయల్ పైపులోకి వెళ్తుంది. ఫిల్టర్ వద్ద అడ్డుపడి ఇంజన్ కు ఇంధనం సరఫరా కాకుండా చేస్తుంది. మట్టి, ఇసుక లాంటి మలినాలు ట్యాంకులోకి చేరినా, ఇంజన్ కు ఫ్యూయల్ సరఫరా కాకుండా చేస్తాయి తప్ప మరో విధంగా ఇంజన్ కంబూష్చన్ ఛాంబర్ ను డ్యామేజ్ చేయవు.

MANCHU

షుగర్ కలిపితే ఇంజన్ పేలుతుందో, పనికిరాకుండా పోతుందో అన్న ప్రచారం నాకు చదవడం తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. సినిమాలు, క్రైం నవలల ద్వారానే ఇది ప్రచారంలోకి వచ్చింది. గతంలో 2012 లో అనుకుంటా, ముంబాయిలో అనిల్ అంబానీ హెలికాప్టల్ ఫ్యూయల్ ట్యాంక్ లో గులక రాళ్లు, మట్టి పోసారన్న వార్త సంచలనం సృష్టించింది.

ఆఖరు నిమిషంలో తనిఖీ చేసినప్పుడు ఇంజన్ కు ఫ్యూయల్ సప్లయ్ చేసే పైపులో మట్టి చేరినట్టు గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ఒకవేళ చెక్ చేయకుండా హెలికాప్టర్ ను టేకాఫ్ చేస్తే కొద్ది సేపట్లో ఇంజన్ నిలిచి పోయి, కూలిపోయే ప్రమాదం ఏర్పడేది. కార్ల లాంటి వాహనాల్లో షుగర్ పోస్తే కొద్ది దూరం పోయిన తర్వాత ఆగిపోతాయి. మట్టి, ఇసుక కలిపితే ఏం జరుగుతుందో షుగర్ తోనూ అదే సమస్య వస్తుంది… అంతే…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions