మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్‌లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు…
దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? మస్తు హైప్ క్రియేట్ చేసుకుని, ఏకంగా చిరంజీవి పాపులారిటీని, ఇమేజీని కూడా వాడుకున్న ‘సుమ అడ్డా’ ప్రోగ్రామ్ టీవీ రేటింగ్స్‌లో ఢమాల్ అనేసింది… గత వారం బార్క్ రేటింగ్స్‌లో జస్ట్, 2.31 జీఆర్పీలు వచ్చినయ్… అత్యంత దయనీయం… ఓ నాసిరకం సినిమాను పన్నెండోసారి ప్రసారం చేసినా సరే, ఇంత దారుణమైన రేటింగ్స్ రావు… ఈ రేటింగ్ చూసి టీవీ బిజినెస్ సర్కిళ్లు విస్తుపోతున్నయ్…
Ads
ఈమాత్రం దానికి 31 డిసెంబరు ఇయర్ ఎండింగ్ స్పెషల్ షోలో… నేనిక యాంకరింగ్ మానేస్తున్నానంటూ తిక్క ప్రాంక్ వీడియో చేసింది… అది కాస్తా అభాసుపాలై, కవర్ చేసుకోలేక నానా తిప్పలూ పడింది… కల్యాణం కమనీయం ప్రమోషన్ షో చేసింది అందులోనే… చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్ షో బొంబాట్ చేయడానికి ప్రయత్నించింది… ఓ భిన్నమైన షో డిజైన్ చేసుకోలేక, రకరకాల టీవీ ప్రోగ్రాముల కలిపేసి, ఓ కిచిడీ షోకు రూపకల్పన చేసుకోవడమే ఈ ఫ్లాప్‌కు కారణం…
మొన్న చెప్పుకున్నాం కదా… స్టార్ మాటీవీ సీరియళ్లు క్రమేపీ నాసిరకంగా మారుతున్నాయనీ, రేటింగ్స్ దెబ్బతింటున్నాయనీ, కార్తీకదీపం ఆగిపోతే ఆ దెబ్బ కూడా ఉంటుందనీ…! అదే జరుగుతోంది… ఈసారి టాప్30 టీవీ ప్రోగ్రామ్స్‌లో త్రినయని ఏకంగా మూడు స్లాట్లలో మెరిసింది… దీనికి బింబిసార ప్రీమియర్ ప్రసారం తోడైంది… దీంతో జీతెలుగు టీవీ స్టార్‌మాటీవీకి మరింత దగ్గరైంది… మాటీవీ గనుక మేలుకోకపోతే జీటీవీ దాన్ని త్వరలోనే కొట్టేయడం ఖాయం… ఈటీవీ గురించిన చర్చ వేస్ట్ గానీ… జెమిని టీవీ స్థానమే నవ్వొస్తుంది… అది నాలుగో ప్లేస్ కదా… పాత సినిమాల్ని ప్రసారం చేసే జెమిని మూవీస్ దానికి ఈక్వల్ స్టేటస్‌లో ఉండటం విశేషం… చివరకు జెమిని టీవీ అలా భ్రష్టుపట్టిపోయింది…
చివరగా మరో విశేషం చెప్పుకోవాలి… బయట థియేటర్లలో ఎంత సూపర్ హిట్ అయినా సరే, టీవీల్లో జనం పెద్దగా చూడటం లేదు… ఇదీ మనం పలుసార్లు ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం… ఓటీటీల దెబ్బ థియేటర్లకే కాదు, టీవీ చానెళ్ల మీద కూడా పడుతోందని..! బింబిసార రేటింగ్స్ కూడా ఇదే నిరూపిస్తున్నాయి… సినిమా థియేటర్లలో సూపర్ హిట్… కార్తికేయ-2కు దీటుగా వసూళ్లు సాధించింది… కల్యాణ్‌రామ్‌కు కమ్ బ్యాక్ మూవీ…
ఐతేనేం… జస్ట్, 8.6 రేటింగ్స్ వచ్చినయ్… నిజానికి కొన్ని ప్రముఖ సినిమాల రేటింగ్స్‌తో పోలిస్తే కాస్త బెటరే… కానీ టీవీల్లో ప్రేక్షకులు సినిమాల్ని చూడటం లేదనే ట్రెండ్‌కు తగినట్టే ఉన్నయ్ రేటింగ్స్… అందులో కల్యాణ్‌రామ్ ఫెయిల్యూర్ ఏమీ లేదు… మిగతా బార్క్ విశేషాలంటారా..? చెప్పుకుందాం..! అన్నట్టు… థియేటర్లకు, టీవీలకు, ఓటీటీలకు, చివరకు బిగ్‌బాస్‌లకు కూడా అక్కరకు రాని నాగార్జున సినిమా రేటింగ్స్‌లో దారుణంగా పర్‌ఫామ్ చేసింది… ది ఘోస్ట్ అని ఓ సినిమా వచ్చింది కదా తనది… జస్ట్, 2.74 రేటింగ్స్‌తో ‘సుమ అడ్డా’ స్థాయిలో నిలిచింది… ఫాఫం నాగార్జున..!!
Share this Article