Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇద్దరు సన్నకారు దళిత రైతులు… మోస్ట్ పాపులర్ సన్నాల్ని డెవలప్ చేశారు…

June 18, 2026 by M S R

.

మొన్నటి నుంచీ సన్నరకాల బియ్యం గురించి చర్చ జరుగుతోంది కదా… గులాబీ శిబిరానికి ఎంతసేపూ గాయిగత్తర ప్రచారం తప్ప సబ్జెక్టు పట్టదు… పేరుకు 33 రకాలకు మొన్నటిదాకా 500 రూపాయల బోనస్ ఇచ్చేది ప్రభుత్వం (క్వింటాల్‌కు)… ఇకపై కేవలం 7 రకాలకే ఇవ్వనుంది… సన్నరకాల పేరిట మార్కెట్‌లోకి నానారకాల సంకర రకాల్ని వదులుతున్న అక్రమార్కులకు ఇది చెక్… పైగా జనం మెచ్చే సన్నాలనే పండించడానికి నిజమైన సన్నాలు పండించే రైతులకే ప్రోత్సాహం…

ఈ ఏడు రకాల్లో ఒక బీపీటీ-5204 (బాపట్ల పరిశోధన కేంద్రం అప్పుడెప్పుడో డెవలప్ చేసిన వెరయిటీ)… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీపీటీ, సాంబ, సోనా, మశూరి పేర్లతో ఎక్కువగా అమ్ముడయ్యే రకం ఇది… ఆర్ఎన్ఆర్- 15048 (రాజేంద్రనగర్) తక్కువ జీఈ ఉండేది, అంటే సుగర్ పేషెంట్లకు బెటర్… కాకపోతే కేసీయార్ ప్రభుత్వం దీన్ని కూడా ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసింది…

Ads

కేఎన్ఎం-1638, కేఎన్ఎం- 7715 రకాల్ని కూనారం కేంద్రం డెవలప్ చేసింది…డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి- వరంగల్ కేంద్రం పరిశోధన)… ఇవి వదిలేస్తే తెలంగాణ మార్కెట్‌లో ఈమధ్య కొల్లం రైస్ అని అమ్ముతున్నారు, కాస్ట్‌లీ… ఇది మహారాష్ట్ర వెరయిటీ- లచ్చకారీ కొల్లం అనీ అంటారు…

(బగారా అన్నం కోసం తెలంగాణలో కాస్త స్థోమత ఉన్నవాళ్లు ఇతర సన్నాలే గాకుండా బాస్మతి, లాంగ్ గ్రెయిన్ వెరయిటీలు తీసుకుంటారు)… మిగతా రెండు రకాల గురించి చెప్పుకోవాలి… అవి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు కాదు, సామాన్య రైతులు తమ సొంత ఇంట్రస్టుతో డెవలప్ చేసినవి… ప్రస్తుతం తెలుగు బియ్యం మార్కెట్లలో టాప్ ఇవే… ఈ ఇద్దరు కూడా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన రైతులే…

1) హెచ్ఎంటీ సన్నల రూపకర్త: దాదాజీ రామాజీ ఖోబ్రాగడే… మహారాష్ట్రలోని నాందేడ్ గ్రామానికి చెందిన దాదాజీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు సైతం సాధ్యం కాని రీతిలో అద్భుతం చేశాడు… ఓ సన్నకారు దళిత రైతు… 1983లో తన పొలంలో ‘పటేల్ 3’ అనే రకాన్ని సాగు చేస్తుండగా, కొన్ని మొక్కలు మిగిలిన వాటి కంటే భిన్నంగా, ఏపుగా పెరగడాన్ని ఆయన గమనించాడు. ఆ మొక్కలను వేరు చేసి, విత్తనాలను సేకరించి ప్రతి ఏటా వాడుకలోకి తెచ్చాడు…

ఈ రకం వరి గింజలు చాలా నాణ్యంగా, సువాసనతో ఉండటాన్ని చూసిన స్థానిక వ్యాపారులు, ఆ కాలంలో నాణ్యతకు మారుపేరుగా ఉన్న ‘HMT’ (Hindustan Machine Tools) వాచీల పేరును దీనికి పెట్టారు. అప్పటి నుండి ఇది ‘HMT సన్నలు’గా దేశవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ రైతును కూడా మోసం చేసి పేటెంట్ కొట్టేయడానికి సమీపంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం కుట్రలు చేసింది, అది వేరే కథ…

2. జైశ్రీరామ్ రకం సృష్టికర్త: శ్రీరామ్ గోవింద లాంజెవార్… చంద్రపూర్ జిల్లాలోనే మరో సన్నకారు దళిత రైతు, శ్రీరామ్ గోవింద లాంజెవార్, హెచ్ఎంటీ రకాన్ని మరింత మెరుగుపరిచి ‘జైశ్రీరామ్’ రకాన్ని అభివృద్ధి చేశాడు.

1998లో హెచ్ఎంటీ పంటను సాగు చేస్తున్నప్పుడు, అందులో కొన్ని మొక్కలు మరింత సన్నగా, బలంగా ఉండటం గమనించాడు. ఆ మొక్కలను ఎంపిక చేసి, ఏడు సంవత్సరాల పాటు నిరంతర పరిశీలనతో ‘జైశ్రీరామ్’ అనే కొత్త రకాన్ని రూపొందించాడు.

తన పొలంలో పండిన ఈ అద్భుతమైన ధాన్యానికి, భక్తితో ‘జైశ్రీరామ్’ అని పేరు పెట్టుకున్నాడు. ఇది కేవలం ఆయన నమ్మకమే కాదు, నేడు లక్షలాది మంది అన్నదాతల ఆర్థిక స్థితిని మార్చిన ఒక బ్రాండ్‌గా నిలిచింది. బీపీటీ, హెచ్ఎంటీలను మించిన సేల్స్ ఇప్పుడు తెలంగాణలో…

సో, ఏ రకానికి మార్కెెట్‌లో వాల్యూ ఉంది, రన్నింగ్‌లో ఉంది, ఎగుమతులకూ చాన్స్ ఉంది అనే కోణంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే 7 రకాలకు బోనస్… ఇదీ సన్నాల కథ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!
  • ‘రామాయణ’ లెక్కలు ఎక్కడ దెబ్బతిన్నాయి? అసలు కథలేమిటి?
  • ఓ వెలుగు వెలిగి… అనామకంగా ఓ మారుమూల అజ్ఞాతంలోకి!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions