కాంతార మరోసారి అదరగొట్టేసింది… పెద్ద పెద్ద సినిమాలే టీవీ రేటింగుల వద్ద బోల్తా కొడుతుంటే, కాంతార సినిమా ఏకంగా 16.7 టీవీఆర్ రికార్డ్ చేసింది… అఫ్‌కోర్స్ హైదరాబాద్ బార్క్ ఒక్కటే పరిశీలిస్తే 9.5 వరకూ ఉంది… ఐనాసరే, అభినందనీయమే… నిజానికి టీవీల ముందు జనం కూర్చుని సినిమాల్ని చూడటం మానేస్తున్నారు… పెద్ద సినిమాలే రేటింగ్స్ దిక్కులేదు…
ఈ స్థితిలో కాంతార ఈ రేంజ్ రేటింగ్స్ సాధించడం విశేషమే… థియేటర్లలో బాగానే నడిచింది… ఓటీటీలోనూ బాగానే నడిచింది… ఇక దీనిపై ప్రేక్షకాసక్తి ఉండదు అనుకున్నారు… కానీ ఈ రేంజ్ రేటింగ్స్ రావడం ఒకరకంగా వార్తే… ఎందుకంటే..? నిజానికి సినిమా పాతపడిపోయింది… టీవీ ప్రసారం లేటైంది… కానీ స్టార్ మాటీవీలో రావడంతో, దాని రీచ్ ఎక్కువ కావడంతో ఈ రేంజ్ సాధించింది…
గత వారం స్టార్ మాటీవీ ఏదో నక్కను తొక్కింది… అందుకే కార్తీకదీపం ఫైనల్ ఎపిసోడ్ బంపర్ హిట్… ఘనంగా ప్రేక్షకులు వీడ్కోలు పలికారు… ఈ కాంతార సినిమాను కూడా విశేషంగా చూశారు… ఇది థియేటర్ సరుకు, ఆల్‌రెడీ ఓటీటీలో వచ్చేసింది వంటి నిరాశపూర్వక ప్రచారం బద్ధలైంది… పాజిటివ్ మౌత్ టాక్ బలంగా ఉంటే సినిమా టీవీల్లో కూడా బాగానే చూస్తారనే ఓ నిజానికి ఈ రేటింగ్స్ ఓ ఉదాహరణ…
Ads
వాస్తవంగా ఈ సినిమా క్లైమాక్స్ పావుగంటసేపే దానికి ప్రాణం… మిగతాదంతా సోసో సినిమాయే… మామూలు తెలుగు సినిమా లక్షణాలే ఉంటయ్… కానీ క్లైమాక్స్ ఈ సినిమా పంట పండించింది… సప్తమి గౌడ, మానసి సుధీర్, కిషోర్ అదనపు బలాలు… ఎప్పుడైతే కంటెంట్ ఇంట్రస్టింగా జనాన్ని కనెక్ట్ అవుతుందో ఇక సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఎట్సెట్రా కూడా అభినందనలు, అప్లాజ్ పొందుతాయి… ఇక్కడ జరిగిందీ అదే…
వరాహరూపం పాట వదిలేస్తే మిగతా పాటలు సోసో… కాకపోతే చీకట్లు, దట్టమైన అడవుల్లో సినిమాటోగ్రఫీ మాత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది… ఇదిలా సక్సెస్ అయ్యింది కాబట్టే కాంతార సీక్వెల్ లేదా ప్రీక్వెల్ మీద ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీల్లో, ట్రేడింగ్ సర్కిళ్లలో బాగా ఆసక్తి నెలకొంది ఇప్పుడు… ఆల్‌రెడీ కథ కోసం రిషబ్ శెట్టి అడవుల్లోకి వెళ్లిపోయాడని నిర్మాత కథనం… గుడ్, గుడ్… ఈసారి మరింత చిక్కటి స్క్రీన్ ప్లేతో వస్తాడని ఆశిద్దాం…
Share this Article