Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ నెక్కిలీసు గొలుసు గుర్తుంది కదా… ఈసారి లేజర్ డాన్స్‌తో కుమ్మేశాడు…

November 20, 2022 by M S R

సాధారణంగా టీవీల్లో డాన్స్ రియాలిటీ షోలు ఎలా ఉంటయ్… మొహాల్లో ఏ ఫీలింగూ లేకుండా, సినిమా పాటల్ని రీమిక్స్ చేసి, డాన్సర్లతో సర్కస్ ఫీట్లు చేయించి, వాటినే డాన్స్ అనుకొండిరా అని మనల్ని దబాయిస్తుంటారు… కానీ డాన్స్ కంపిటీషన్ షోను సక్సెస్ చేసి మెప్పించడం ఓ పెద్ద టాస్క్… అంతటి ఓంకారుడే స్టార్‌మా టీవీలో డాన్స్ ప్లస్ అని భారీ ఎత్తున హంగామా చేసీ ఫెయిలయ్యాడు…

ఇప్పుడు తనే ఆహాలో డాన్స్ ఐకాన్ షో చేస్తున్నాడు… పర్లేదు, డాన్సర్లు, కాన్సెప్టులు ఎట్సెట్రా బాగానే ఉన్నయ్… దాన్నే జెమినిలోనూ ప్రసారం చేస్తున్నారు… 1.86 రేటింగ్ వస్తోంది… జెమిని టాప్ 30 జాబితాలో ఉందంటే ఈ షో సక్సెస్ అయినట్టే లెక్క… అదే ఈటీవీలో కొన్నాళ్లుగా భ్రష్టుపట్టించబడిన ఢీ షోకు 1.89 రేటింగ్ వచ్చింది… (దయనీయం..) జీతెలుగు నిర్వహిస్తున్న డాన్స్ ఇండియా డాన్స్ షోకు మరీ ఘోరంగా 1.01 రేటింగ్ వచ్చింది… డిజాస్టర్… 

ఇక ఢీ గురించి మరిచిపొండి… ఎన్నో సీజన్లుగా ఈటీవీకి డబ్బు ముద్రించి ఇస్తున్న షోను పాతాళమార్గం పట్టించారు… మరీ సుధీర్, రష్మి వెళ్లిపోయాక, ఆది మార్క్ కామెడీతో ఇదుగో 1.86 దాకా వచ్చింది… ఇంకా ఏం బాకీ ఉందో పాపం… నిజానికి జీతెలుగు వాడికి రియాలిటీ షోలు అచ్చిరావు… వాటిని సరిగ్గా టాకిల్ చేసే క్రియేటివ్ టీం లేదు వాళ్లకు… అందుకే డాన్స్ ఇండియా డాన్స్ షోకు ఎంత ఖర్చు చేస్తున్నా సరే, అది లేవడం లేదు…

కాకపోతే కామెడీ పార్ట్‌ను రోహిణి ఒంటిచేత్తో లాగించేస్తోంది… మెరిట్ ఉన్న ఆర్టిస్టే… సంగీత, బాబా మాస్టర్, ఆనంది జడ్జిలుగా ఉన్నారంటే ఉన్నారు… అకుల్ బాలాజీ హోస్టింగు పర్లేదు… ఐనాసరే, ప్రేక్షకులకు పట్టడం లేదు… కానీ నిన్న ఆదివారం హఠాత్తుగా పండు డాన్స్ కనిపించి ప్లజెంటుగా అనిపించింది… ఎందుకోగానీ జబర్దస్త్, ఢీ, డాన్స్ ఇండియా డాన్స్… వేదిక ఏదైనా సరే… పండు కనిపిస్తే తన ముద్ర వేస్తాడు… తన మ్యాగ్జిమం ఇవ్వడమే కాదు… కామెడీలో భలే టైమింగు ఉంది అబ్బాయికి…

Ads

pandu

అబ్బాయి అన్నానని మొహం చిట్లించకండి… వయస్సు ఇప్పటికి పాతికేళ్లే… బెంగాలీ బాబు… విశాఖలో ఓ ఆటో డ్రైవర్ తండ్రి, బెంగాలీ కోల్‌కత్తా తల్లి… తక్కువేమీ కాదు, ఐఐటీ చెన్నె గ్రాడ్యుయేట్ తను… తరువాత అనుకోకుండా డాన్స్‌ను కెరీర్‌గా తీసుకున్నాడు… తనకూ ఓ విషాదమైన లవ్ స్టోరీ ఉన్నట్టుంది… అఫ్‌కోర్స్, ఫీల్డులో వందల మంది కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు ఉన్నారు, పండు విశేషం ఏమిటీ అంటారా..? ఉంది…

సుడిగాలి సుధీర్‌లాగే తను కూడా ఎవరు తన మీద జోకులు వేసినా సరదాగా తీసుకుంటాడు, వీలయితే చిన్నగా అంటిస్తాడు, కానీ నెగెటివ్‌గా తీసుకోడు… కావాలంటే కామెడీ స్కిట్ చేస్తాడు… మామూలు స్కిట్ చేస్తాడు… మిగతా కొరియోగ్రాఫర్లలా కాదు, తనే స్వయంగా డాన్స్ చేయగలడు… ‘‘నాదీ నెక్కిలీసు గొలుసు’’ అనే పాట ఉంది కదా… ఆ పాటతో లేడీ వేషం వేసి డాన్స్ చేస్తే, ఏకంగా 12 కోట్ల వ్యూస్ సాధించింది… సూపర్ డూపర్ హిట్… సినిమా పాటల వీడియోల్ని వదిలేయండి… ఓ ప్రాంతీయ భాషా టీవీ షోలో ఓ డాన్స్ బిట్‌కు ఈ రేంజ్ వ్యూస్ రావడం అబ్బురమే…

పండు డాన్సర్

ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… జీతెలుగులో ఆదివారం తను ఇద్దరు లేడీ డాన్సర్లతో కలిసి ఓ బిట్ చేశాడు… పెద్ద సర్కస్ ఫీట్లు ఏమీ లేవు… కానీ లేజర్ కిరణాలను ఉపయోగించుకుని, జబర్దస్త్ టైమింగుతో రోబో డాన్స్ చేశారు… వీటికి మంచి సాధనే కాదు, సరైన సమన్వయం అవసరం డాన్సర్ల మధ్య… అదరగొట్టారు నిజంగానే… హోస్ట్ బాలాజీ అయితే ‘‘వంద మిలియన్ల డాన్స్ బిట్ నీదే… ఆ పాట తరువాత మళ్లీ ఈ పాట అంత హిట్ అవుతుంది బ్రో’’ అన్నాడు… అది విన్నాక పండు గురించి చెప్పాలి అనిపించింది… అందుకే మన నెక్కిలీసు పండు మీద ఈ స్టోరీ…!!

అన్నట్టు బాలాజీకి తన షో నడిచే తీరు మీదే ఐడియా లేనట్టుంది… డాన్స్ ఇండియా డాన్స్ షో జీతెలుగులో వస్తుంది, వోకే… దాని ప్రమోషన్ వర్క్ అంతా యూట్యూబ్‌లో పెడతారు, వోకే… కానీ అసలు వీడియోలు కావాలంటే జీ5 ఓటీటీలోకి వెళ్లాలి… ఈ ఒకటీరెండు పాటల కోసం ఆ ఓటీటీకి చందా ఏం కడతాంలే బాలాజీ… యూట్యూబ్‌లో పెడితే కదా నువ్వన్నట్టు 100 మిలియన్ల మార్క్ టచ్ చేస్తుందో లేదో తేలేది…!! (ఈ షోలో సుధీర్ పాత్ర ఏమిటో అస్సలు సమజ్ కాలేదు…)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions