కొన్ని రాజకీయ, విధాన వ్యాఖ్యలు చేసే ముందు సంయమనం, వాటి ప్రభావాల మీద ఓ అంచనా, ఓ చూపు ఉండాలి… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పు చెప్పింది… వర్గీకరణ సబబే అని కుండబద్ధలు కొట్టేసింది…
ఇది ఎందుకు చరిత్రాత్మకం అంటున్నామంటే… చాలాచోట్ల ఈ వర్గీకరణ (Sub Classifications) పంచాయితీలు ఉన్నాయి… ఎన్ని తేనెతుట్టెల్ని కదుపుతోంది ఈ తీర్పు..?
సరే, మంద కృష్ణ అవిశ్రాంత పోరాటం ఓ చరిత్ర… ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి… దశాబ్దాల పోరాటం ఓ కొలిక్కి వచ్చింది… ఫలానా పార్టీలు, నాయకులు సహకరించారు అనడంకన్నా ఎస్సీల్లోని ఒక ఉపకులం సాగించిన పోరాటం ఫలించింది అనడమే సమంజసం… పూర్తి క్రెడిట్ మాదిగ సమూహానిది, మంద కృష్ణ మాదిగది…
Ads
మాల ఉపకులానికి ఇది ఒకింత చేదు పరిణామమే… ఆ సమాజం కూడా గట్టిగానే ప్రతిఘటించింది ఇన్నేళ్లూ… కానీ ఫలించలేదు… ఈ తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి, వెంటనే అమలు చేస్తామని, ఆల్రెడీ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్తింపజేస్తామని అన్నాడు… వోకే, ఈ వర్గీకరణ క్రెడిట్ ఇంకేదో పార్టీ ఎత్తుకుపోకుండా తనే ముందుగా స్పందించాడు, అక్కడివరకూ వోకే…
చంద్రబాబు గతంలోనే అమలు చేయాలని ప్రయత్నించాడు కాబట్టి ఏపీలో తను ఈ తీర్పు అమలు చేస్తాడనే అనుకోవాలి… సందేహం లేదు… కానీ… తెలంగాణలో మరో వర్గీకరణ డిమాండ్ ఉంది… మాదిగ దండోరా స్థాయిలో కాకపోయినా కాస్త బలంగానే ఆ డిమాండ్ అప్పుడప్పుడూ వినిపిస్తోంది… ఒకరకంగా చూస్తే అదీ సమంజసమే అన్నట్టుగా ఉంటుంది, సుప్రీం తాజా తీర్పును బట్టి దానికీ ఓ సానుకూలత వస్తున్నట్టే అనుకోవాలి…
బంజారా సమాజం, ఆదివాసీ సమాజం నడుమ కూడా ఈ ఎస్టీ వర్గీకరణ గొడవ చాన్నాళ్లుగా ఉంది… మరి సుప్రీం తీర్పును తమకూ వర్తింపజేయాలని ఆ ఆదివాసీ సమాజం గొంతెత్తితే..? రేవంత్ రెడ్డి దానికీ సై అంటాడా అనేది ఓ ప్రశ్నార్థకం… ఇలాంటి డిమాండ్లు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయంటున్నారు… పాలక పార్టీలు తమపై ఉండే రాజకీయ ప్రభావాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది…
ఎందుకంటే..? ఓబీసీ కులాల వర్గీకరణకూ డిమాండ్లు పెరుగుతాయి, ఆల్ రెడీన జస్టిస్ రోహిణి కమిషన్ ఏడాది క్రితమే రిపోర్టు ఇచ్చినట్టుంది కేంద్ర ప్రభుత్వానికి… కులగణన మీద డిమాండ్లకు బలం పెరుగుతుంది… సో, ఇది మొదలు… ఇక్కడ ఎవరి డిమాండ్‌లో న్యాయం ఎంత ఉందనేది కాదు… ఈ తీర్పు ప్రభావాల గురించిన అధ్యయనం, భావి కోరికల మీద ప్రభుత్వాలకు అవగాహన కూడా అవసరమే అని చెప్పడం మాత్రమే…!!
Share this Article